పవన్ కుమార్ న్యూస్18 తెలుగు, విజయవాడ
విజయవాడ ఇంద్రకీలాద్రిపై నరబలులు జరుగుతున్నాయని తెలిసి చల్లపల్లి ఆస్థానంలో ఉండేటువంటి ముత్తు చలపతి అనే రాజా వారు ఇంద్రకీలాద్రిపై జరిగే నరబలులును, జంతు బలులను శాంతి యంత్రంతో పోరాడి ఆపి వేశారు. ఆతర్వాత నర బలులను నిషేదించటంతో... విజయవాడ 1 టౌన్ బ్రహ్మాణ వీధి అక్కడ శివాలయాన్ని ప్రతిష్టించాలని అనుకున్నాడు.
కాశీ నుండి శివలింగాన్ని తెచ్చుకుని స్వయంగా ఇంట్లో పూజ చేసుకునేవారు చలపతి.. వెంటేనే ఆశివలింగాన్ని వారి ఇంట్లో నుండి తెచ్చి ఆలయాన్ని నిర్మించారు.. చలపతి. ఆ ఆలయం నిర్మించి దాదాపుగా 432 సంవత్సరాల అయ్యిందని రికార్డ్స్ చెప్తున్నాయని అక్కడి పురోహితులు తెలుపుతున్నారు.
అలాగే కృష్ణా జిల్లాలోని బుద్దగా పెద్ద కల్లెపల్లిలో నివసించేటువంటి కుటుంబీకులకు అమ్మవారు సాక్షాత్తు ప్రత్యక్షం అయ్యిందని అక్కడ ఆలయాన్ని కూడా నిర్మించారు. అమ్మవారు ఎన్నో మహత్కర్యాలు చేసిందని అక్కడి వారంతా చెప్తుంటారు. విజయవాడలోని 1 టౌన్ బ్రాహ్మణ వీధిలో ప్రతిష్టించిన ఈ వసంత మల్లికార్జున దేవాలయంకి ఎంతో ప్రాధాన్యత ఉంది.
ఈ ఆలయంలో వినాయకుడు, కుమారస్వామి, నంది, చండి, బృంగి, కాలభైరవ,వీరభద్ర స్వామివారు వీరంతా కూడా వసంత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంలో భక్తులకు దర్శనం ఇస్తారు. పరమేశ్వరుడు శివునిగా, అమ్మవారు పార్వతి దేవి అమ్మవారుగా ఈ వసంత మల్లికార్జున స్వామి ఆలయంలో దర్శనం ఇస్తారు. ఈ ఆలయంలో శివయ్య విశేష పూజలు అందుకుంటారు. అలాగే దసరా సందర్భంగా, శివరాత్రి, ఆరుద్రోచవమ్, తొలి ఏకా దశి, ఎంతో వైభవంగా విశేషంగా పూజలు అందుకుంటారు శివయ్య.
అంతే కాకుండా శివయ్య ఎంతో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన రోజు శివరాత్రి. ఆ రోజునా బయట నుండి మూడు దేవాలయాలు వారు ఈ వసంత మల్లికార్జున స్వామి వారి దేవస్థానంకి వస్తారు. అందరూ కలిసి ఎంతో ప్రత్యేకంగా విశేషమైన పూజలు ,అభిషేకా లు చేయిస్తారు శివరాత్రి రోజున. ఎన్నో ఏళ్లుగా కష్టమని తలచి దేవాలయం దర్శించి కష్టమని వేడుకున్న వారికి కష్టాలను, కోర్కెలను, తీర్చే దయగల స్వామిగా ఆలయాన్ని దర్శించుకున్న వారంతా చెప్తుంటారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada