VIJAYAWADA VANGAVEETI RADHA REJECTED GOVERNMENT SECURITY STATED THAT FANS WILL PROTECT HIM FULL DETAILS HERE PRN
Vangaveeti Radha: వంగవీటి రాధా సంచలన నిర్ణయం.. ప్రభుత్వ సెక్యూరిటీపై కీలక వ్యాఖ్యలు
వంగవీటి రాధా (ఫైల్)
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గత రెండు రోజులుగా వినబడతున్న పేరు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna). తన తండ్రి వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohan Ranga) వర్ధంతి నాడు రాధా చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్రకలకలం రేపాయి.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో గత రెండు రోజులుగా వినబడతున్న పేరు వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna). తన తండ్రి వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohan Ranga) వర్ధంతి నాడు రాధా చేసిన సంచలన వ్యాఖ్యలు తీవ్రకలకలం రేపాయి. తన హత్యకు కొందరు కుట్ర చేశారని.. రెక్కీ కూడా నిర్వహించారన్న వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. దీంతో వంగవీటి వ్యాఖ్యలను మంత్రి కొడాలి నాని సీఎం దృష్టికి తీసుకెళ్లడం.. ఆయన విషయంపై సీరియస్ అయ్యి వెంటనే పోలీసుల అధికారులకు కీలక ఆదేశాలు చేశారు.. వెంటనే దీనిపై విచారణ చేయాలి అన్నారు. అలాగే పటిష్ట భద్రత కల్పించాలని కోరారు. సీఎం జగన్ ఆదేశాలతో వంగవీటికి 2 ప్లస్ 2 భద్రత కల్పించామన్నారు ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్.. అయితే వంగవీటి తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని.. కానీ పోలీస్ శాఖ పరంగా తీసుకోవాల్సిన చర్యలు చేపట్టామని తెలిపారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటామని అన్నారు.
ఐతే ఇప్పుడు వంగవీటి రాధా మరోసారి షాకిచ్చారు. ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లు వద్దని రాధా స్పష్టం చేశారు. తనకు ఎలాంటి సెక్యూరిటీ అవసరం లేదని.. అభిమానుల మధ్య ఉండే తనకు వారే రక్ష అని రాధా స్పష్టం చేశారు. తన హత్యకు స్కెచ్ వేశారని రాధానే చెప్పి.. ఇప్పుడు సెక్యూరిటీ వద్దనడం చర్చనీయాంశంగా మారింది.
ఇది చదవండి: వైసీపీ ఎంపీ హత్యకు కుట్ర..? సొంతపార్టీ నేతలే స్కెచ్ వేశారా..? బాంబు పేల్చిన మరో ఎంపీ..!
మరోవైపు డీజీపీ ఆదేశాలతో వంగవీటి రాధా ఇంటి దగ్గర రెక్కీ నిర్వహించినవారి కోసం పోలీసుల గాలింపు చేపట్టారు. ఇప్పటికే సంచలన విషయాలను గుర్తించినట్టు సమాచారం. నగరానికి చెందిన కొందరు వ్యక్తులపై పోలీసుల అనుమానం వ్యక్తి చేస్తున్నారు. ప్రధాన అనుమానితుడిగా భావిస్తున్న అరవ సత్యం సోమవారం ఉదయం నుంచి పోలీసుల అదుపులోనే ఉన్నాడు. అయితే పోలీసుల విచారణలో ఆయన స్పృహ కోల్పోయినట్టు సమాచారం. ప్రస్తుతం ఆంధ్ర హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు అరవ సత్యం.. ఆరవ సత్యాన్ని అదుపులోకి తీసుకున్నట్టు పోలీసులు ధృవీకరించారు. అంతేకాదు ఆరవ సత్యం దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడే కావడం విశేషం..
వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే సమక్షంలోనే వంగవీటి రాధా ఈ వ్యాఖ్యలు చేయడం.. వంగవీటిపై రెక్కీ నిర్వహించిన విషయాన్ని మంత్రి కొడాలి నాని స్వయంగా సీఎంకు చెప్పడం.. ఇవన్నీ ఒక ఎత్తైతే.. ఇప్పుడు పోలీసులు అనుమానిస్తున్నది కూడా వైసీపీ కీలక నేత దేవినేని అవినాష్ ప్రధాన అనుచరుడిపైనే కావడంతో అసలు బెజవాడ రాజకీయాల్లో ఏం జరుగుతోందో అర్థం కావడంలో లేదు.. తాజా పరిణమాలు చూస్తుంటే త్వరలోనే రాజకీయంగా పలు మార్పులు తప్పకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.