Home /News /andhra-pradesh /

VIJAYAWADA VANGAVEETI RADHA NEXT POLITICAL STEP SNR

పార్టీలు ఆయన్ని వాడుకుంటున్నాయా...లేక ఆయనే పార్టీలతో ఆడుకుంటున్నారా...? నడుస్తున్న రాజకీయంతో వంగవీటి రాధా పొలిటికల్ ఫ్యూచర్‌ ఎలా మారనుంది..? వంగవీటి రాధా మాటల వెనుక దాగివున్న మర్మమేంటి..? వంగవీటి రాధా ఆ గట్టునుంటావా..? లేక ఈ గట్టుకొస్తావా..?

వంగవీటి రాధాకృష్ణ (File)

వంగవీటి రాధాకృష్ణ (File)

వంగవీటి రాధా దారెటూ..?
రాబోయే ఎన్నికల్లో బెజవాడ రాజకీయాలు ఎలా మారబోతున్నాయనే చర్చ ఇప్పటి నుంచే మొదలైంది. ఎందుకంటే గత కొంతకాలంగా సైలెంట్‌గా ఉన్న వంగవీటి రాధా.. తండ్రి వర్ధంతి రోజున చేసిన వ్యాఖ్యలే ఇప్పుడు పొలిటికల్ సర్కిల్‌లో హాట్‌ టాపిగ్‌గా మారాయి. వంగవీటి రాధా అసెంబ్లీకి ఎన్నికైంది ఒకే ఒక్కసారి. కాని మారింది నాలుగు పార్టీలు. రాజకీయ నేపధ్యం కలిగిన కుటుంబ చరిత్ర, బలమైన సామాజికవర్గం, తండ్రి చరిష్మాతో జనంలో వంగవీటి రాధాకు ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అయితే ఇది ఏమాత్రం ఆయన రాజకీయ భవిష్యత్తును డిసైడ్ చేయలేకపోతున్నాయనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. తరచూ పార్టీలు మారడం,  వివాదాలు, విమర్శలు ఆయన చుట్టు ముట్టడంతో రాజకీయంగా నిలదొక్కులేకపోతున్నారనే ప్రచారం ఉంది. విజయవాడ తూర్పు నియోజకవర్గంలో గట్టి పట్టున్నప్పటికి గత ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం రాకపోవడంతో టీడీపీలో చేరి వైసీపీపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. ఇదంతా పాత విషయమే అయినప్పటికి తాజాగా రాధా తండ్రి వర్ధంతి కార్యక్రమంలో అధికార పార్టీకి చెందిన మంత్రి కొడాలి నాని, టీడీపీ నుంచి వైసీపీలోకి  వెళ్లిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీతో కలిసి పాల్గొనడం కారణంగా  అనేక  ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.

బెజవాడ రాజకీయాల్లో అసలు ఏం జరుగుతోంది..?
వంగవీటి రాధా టీడీపీలో కొనసాగుతున్నా.. పార్టీ అధికారిక కార్యక్రమాలకు మాత్రం దూరంగానే ఉంటున్నారు.  వంగవీటి రాధాను 2024ఎన్నికల్లో ఆయుధంగా మార్చుకొని వైసీపీపై ఎక్కుపెడదామని టీడీపీ అధిష్టానం భావిస్తున్నాట్లుగా తెలుస్తోంది. పార్టీ మారిన వల్లభనేని వంశీతో పాటు విజయవాడ తూర్పు నియోజకవర్గ స్థానంతో పాటు టీడీపీ సిట్టింగ్‌ స్థానమైన గన్నవరంలో గెలిచి రెండు విజయాల్తని తమ ఖాతాలో వేసుకునేట్లుగా గద్దె రామ్మోహన్‌ని గన్నవరానికి షిప్ట్ చేసి..రాధాకు తూర్పు సీటు ఇచ్చి.. అక్కడ పోటీ చేసేందుకు సిద్దంగా వైసీపీ నేత దేవినేని అవినాష్‌కి చెక్ పెట్టాలని వ్యూహాలు రచిస్తోంది. టీడీపీ ప్లాన్ ఎలా ఉన్నా.. వరుస ఎన్నికల ఫలితాలతో టీడీపీ బలం తగ్గడం, వైసీపీ ఆధిపత్యం పెరుగుతూ వస్తోంది. ఈ పరిణామాల్ని గమనించే రాధా చూపు మళ్లీ వైసీపీపై మళ్లిందా అనే చర్చ కూడా కృష్ణా జిల్లాతో జోరుగా జరుగుతోంది.

రంగా తనయుడి వ్యాఖ్యల వెనుక మర్మమేంటి..?
రాజకీయంగా రాధా నిర్ణయం ఎలా ఉన్నా.. వంగవీటి రంగా వర్ధంతి కార్యక్రమంలో వైసీపీ నేతలతో కలిసి పాల్గొనడంతో బెజవాడ రాజకీయాలను మరోసారి తెరపైకి తెచ్చాయి. అంతే కాదు తనపై హత్యాయత్నానికి రెక్కీ నిర్వహించారంటూ సంచలన వ్యాఖ్యలు చేయడం, త్వరలోనే ఆధారాలు బయటపెడతానని చెప్పి అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల దృష్టిని తనపై పడేలా చేశారు రాధా.

రాధా ఆయుధంగా తయారవుతారా ..? లేక పావుగా మారతారా..?
వంగవీటి రాధా వ్యాఖ్యలు, ఆయన వేస్తున్న అడుగులు చూస్తుంటే.. గతంలో ఇలాగే పార్టీలు మారి రాజకీయాల్లో నిలదొక్కుకోలేకపోయిన బెజవాడ పొలిటికల్ లీడర్ యలమంచిలి రవిని గుర్తు చేస్తున్నాయి. ఆయనే కాదు ఉత్తరాంధ్రకు చెందిన గంటా శ్రీనివాస్‌ కూడా ఇలాగే వ్యక్తిగత ఇమేజ్ ఉన్నా.. రాజకీయ అనుభవం కలిగినప్పటికి పార్టీలు మారడం వల్లే ఎటూ కాకుండా మిగిలారనే విమర్శలు ఉన్నాయి.

క్లైమాక్స్ ఎలా ఉంటుందో ..?
తమను, తమ పార్టీని విమర్శించిన వారిని ఆమడదూరంలో పెట్టే వైసీపీ అధిష్టానం వంగవీటి రాధా విషయంలో మాత్రం ఎందుకు సంయమనం పాటిస్తోంది. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆయన్ని తమవాడని చెప్పుకోవడం చూస్తుంటే వంగవీటి రాధాను తమ వైపు తిప్పుకొని నెక్స్ట్ ఎలక్షన్స్‌లో టీడీపీని ఎదురుదెబ్బ కొట్టాలని చూస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుక్కుంటున్నారు. అయితే అధికార, ప్రతిపక్ష పార్టీల వలలో చిక్కుకొని వంగవీటి రాధా పావుగా మారతారా..లేక తిరుగులేని రాజకీయ అస్త్రంగా తయారవుతారా అనే దానిపై మాత్రం ఎవరికి క్లారిటీ రావడం లేదు.
Published by:Siva Nanduri
First published:

Tags: AP Politics, Vangaveeti Radha

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు