Home /News /andhra-pradesh /

VIJAYAWADA VANGAVEETI RADHA AND VALLABHANENI VAMSI MET AT VANGAVEETI RANA DEATH ANNIVERSARY EVENT GRABS POLITICAL ATTENTION FULL DETAILS HERE PRN GNT

Vangaveet - Vallabhaneni: వంగవీటితో వల్లభనేని.. బెజవాడ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం..

వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ

వంగవీటి రాధాతో వల్లభనేని వంశీ భేటీ

ఇద్దలు నేతలు ఒకే వేదిక పంచకోవడం, ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశమవుతోంది. దివంగత నేత వంగవీటి మోహనరంగా (Vangaveeti Mohan Ranga) వర్ధంతి సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధా (Vangaveeti Radha), గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ (Vallabhaneni Vamsi Mohan) కలవడం ఆసక్తిని రేకెత్తిస్తోంది.

ఇంకా చదవండి ...
    ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో విజయవాడ (Vijayawada) రాజకీయాలకు ప్రత్యేక స్థానముంది. అక్కడ ఏ జరిగినా రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ప్రస్తుతం విజయవాడలో వైసీపీ, టీడీపీ మధ్య పొలిటికల్ ఫైట్ గట్టిగానే నడుస్తోంది. ఈ నేపథ్యంలో ఇద్దలు నేతలు ఒకే వేదిక పంచకోవడం, ప్రత్యేకంగా సమావేశం కావడం చర్చనీయాంశమవుతోంది. దివంగత నేత వంగవీటి మోహనరంగా వర్ధంతి సందర్భంగా విజయవాడ రాఘవయ్య పార్క్ సమీపంలోని రంగా విగ్రహానికి పలువురు నివాళులర్పించారు. ఈ క్రమంలో రంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధాకృష్ణతో పాటు గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ కలిసి రంగాకు నివాళులర్పించడం చర్చనీయాంశంగా మారింది. వీళ్లిద్దరి కలయిక బెజవాట రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇక ఇదే కార్యక్రమంలో జనసేన నేత పోతిన వెంకట మహేష్ కూడా పాల్గొనడం కొసమెరుపు.

    ప్రస్తుతం వంగవీటి రాధా టీడీపీలో ఉండగా.. టీడీపీ తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వల్లభనేని వంశీ.. వైసీపీకి దగ్గరయ్యారు. అధికారికంగా ఆ పార్టీలో చేరకపోయినా ఆయన ఆయన వైసీపీతోనే ఉన్నారు. ఈ నేపథ్యంలో వంగవీటి రాధ, వంశీల భేటీ ఆసక్తికరంగా మారింది. రంగా విగ్రహానికి నివాళులర్పించిన అనంతరం వంశీ.. రాధా ఆఫీసుకు వెళ్లి కాసేపు మాట్లాడారు. గతంలో ఇద్దరి మధ్య స్నేహం ఉన్నందున ఇద్దరూ స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారా.. లేక దీని వెనుక రాజకీయ కోణం ఏమైనా ఉందా అనే అంశంపై ప్రతి ఒక్కరూ చర్చించుకుంటున్నారు.

    ఇది చదవండి: ఏపీలో 6కి చేరిన ఒమిక్రాన్ కేసులు.. కొత్తగా ఇద్దరికి పాజిటివ్..


    ఇక రంగాకు నివాళులర్పించిన అనంతరం వంగవీటి రాధా మాట్లాడుతూ.. తమ కుటుంబాన్ని ఆదరిస్తున్న ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలిపారు. గత 33 సంవత్సరాలుగా నాన్న వర్ధంతిని అభిమానులు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఆశయ సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడిన వ్యక్తి వంగవీటి రంగా అని.. ఆయన ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని రాధా పిలుపునిచ్చారు.

    ఇది చదవండి: వైసీపీ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పవ్.. కేంద్రం చూస్తూ ఉరుకోదు.. సుజనా వార్నింగ్..


    ఈ సందర్భంగా వల్లభనేని వంశీ కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రపంచంలో చనిపోయిన తర్వాత కూడా ప్రజలు గుర్తు పెట్టుకునే నాయకులు గుర్తుండే వ్యక్తులు ముగ్గురే ఉన్నారన్నారు. వారు ఎన్టీరామారావు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వంగవీటి రంగా మాత్రమేనన్నారు. వంగవీటి రంగా బిడ్డలం అని చెప్పడానికి నేను గర్వపడుతున్నానని వంశీ అన్నారు. తండ్రి మాదిరిగానే వంగవీటి రాధా కూడా ఉన్నతస్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు వంశీ తెలిపారు.

    ఇది చదవండి: అమరావతిలో పెండింగ్ నిర్మాణాలపై ప్రభుత్వం క్లారిటీ.. కోర్టుకు ఏం చెప్పిందంటే..!


    ఇదే కార్యక్రమంలో పాల్గొన్న పోతిన మహేష్ మాట్లాడుతూ... వంగవీటి రంగా ఆయన ప్రజలకు చేసినటువంటి సేవలు ఎప్పటికి మరువలేవన్నారు. బడుగు బలహీన వర్గాలకు రంగా అండగా నిలబడ్డారన్నారు. ప్రతి ఊరిలో వంగవీటి రంగా విగ్రహాలు ఉంటాయని.., కృష్ణా జిల్లాలో ఏదో ఒక ప్రాంతానికి వంగవీటి రంగా పేరు పెట్టేలా వల్లభనేని వంశీ చొరవ తీసుకోవాలని మహేష్ విజ్ఞప్తి చేశారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Vallabhaneni vamsi, Vangaveeti Radha, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు