రిపోర్టర్: విజయ్ కుమార్
లొకేషన్: విజయవాడ
ఎన్టీఆర్ జిల్లా (NTR district) జగ్గయ్యపేట గురువారం రాత్రి నుంచి కురుస్తున్న అకాల వర్షానికి (Heavy Rains) జగ్గయ్యపేట నియోజకవర్గం లోని పెనుగంచిప్రోలు వత్సవాయి జగ్గయ్యపేట మండలాల్లోని మిర్చి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది.మిర్చి కోతలు ముమ్మరంగా జరుగుతున్న తరుణంలో ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి ఆరబోసిన మిర్చి తడిసింది.
Tirumala: తిరుమల శ్రీవారి భక్తులకు పండగలాంటి శుభవార్త చెప్పిన టీటీడీ
అన్నదాతలు పట్టలు కప్పి కాపాడుకునేందుకు అష్ట కష్టాలు పడ్డారు.గడిచిన నాలుగేళ్లుగా ప్రభుత్వం రాయితీపై టార్పాలిన్ పట్టాలను సరఫరా చేయడం లేదని రైతులు వాపోయారు.ప్రైవేటు వ్యాపారుల వద్ద అధిక ధరలు వెచ్చించి కొనుగోలు చేయలేక పోయామని అన్నదాతలు చెబుతున్నారు.గత ప్రభుత్వ హయాంలో రాయితీపై పంపిణీ చేసిన పట్టలను ఇప్పటికీ వినియోగిస్తున్నామని రైతులు తెలిపారు.
ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పట్టాలు అందజేయాలని వారు కోరుతున్నారు.మార్కెట్లో మిర్చికి మంచి ధర పలుకుతున్న తరుణంలో. అకాల వర్షం వల్ల తడిసిన కాయకు వ్యాపారులు ధరలు తగ్గించే అవకాశం ఉందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా ఎంతగానో ఆరు కాలంగా పండించిన పంటను అకాల వర్షాలు రైతులు తీవ్ర ఆవేదన గురవుతున్నారు.
ఒక్కసారిగా వర్షం రావడంతో రైతులు పట్టలు ఏర్పాటు చేసుకోలేకపోయారు. దీంతో పెనుగంచిప్రోలు వత్సవాయి జగ్గయ్యపేట మండలంలోని రైతులు విపరీతంగా నష్టపోయారు. అదేవిధంగా ప్రభుత్వం ఇప్పటికైనా పట్టలని సబ్సిడీలో పంపిణీ చేసే విధంగా చూడాలని రైతులు కోరారు. ఉద్యాన శాఖ ద్వారా రాయితీపై పట్టలు పంపిణీకి ప్రజా ప్రతినిధులు, అధికారులు చొరవ చూపాలని అన్నదాతల కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: AP News, Farmers, Local News, Rains, Vijayawada