news18-telugu
Updated: November 29, 2020, 1:22 PM IST
పేర్ని నాని (File)
కృష్ణా జిల్లా... మచిలీపట్నంలో... ఏపీ రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని నానిపై హత్యాయత్నం జరిగింది. మంత్రి తన ఇంట్లో ఉండగానే ఓ దుండగుడు... తాపీతో ఆయనపై దాడి చేయబోయాడు. అంతలోనే అప్రమత్తమైన అనుచరులు... ఆ దుండగుణ్ని పట్టుకొని... బలవంతంగా నిలువరించారు. ఎలాగైనా దాడి చెయ్యాలనీ, మంత్రిని హత్య చెయ్యాలని దుండగుడు గింజుకున్నాడు. అయినప్పటికీ... అనుచరులు బలంగా పట్టుకొని అతన్ని వెనక్కి నెట్టి... తాపీని లాక్కున్నారు. మొత్తానికి ఈ దాడి నుంచి మంత్రి తృటిలో తప్పించుకున్నారు. అలర్టైన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతను ఎవరు, ఎందుకు దాడి చేయాలనుకున్నాడు, మంత్రిని చంపేయాలనేంత కసి ఎందుకు పెంచుకున్నాడు వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

మంత్రిపై దాడి చేసేందుకు వాడిన తాపీ
ఈమధ్యే మంత్రి పేర్ని నాని తల్లి నాగేశ్వరమ్మ అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూశారు. ఆ విషాదం నుంచి కుటుంబం ఇంకా కోలుకోక ముందే ఈ దాడి యత్నం జరగడం కలకలం రేపింది.
అదే కారణమా?
మిగతా మంత్రులకూ పేర్ని నానీకీ ఓ ప్రధానమైన తేడా ఉంది. పేర్ని నానీ కొంత కాలంగా ప్రజలతోనే ఉండేందుకు ప్రయత్నిస్తూ... ప్రోటోకాల్ పట్టించుకోవట్లేదు. ఎప్పుడైనా ఎక్కడికైనా వెళ్లేటప్పుడు... బైకో, ట్రాక్టరో ఎక్కి వెళ్లిపోతుంటారు. ఇక ఆయన్ని కాపాడుకోవడం కోసం వెనకాలో ఫాలో అవ్వడం భద్రతా సిబ్బంది వంతవుతుంది. ఓ మంత్రిగా ప్రజల సమస్యలు తెలియాలంటే... తాను ప్రజలతోనే ఉండటం కరెక్టని మంత్రి చెబుతుంటారు. ఐతే... ఇలా మరీ ప్రోటోకాల్ పట్టించుకోకుండా... ప్రజల్లోకి వెళ్లిపోతే... దుండగులు, ప్రత్యర్థులు ఇలాంటి కుట్రలకు పాల్పడే ప్రమాదం ఉంటుందని తరచూ భద్రతా సిబ్బంది టెన్షన్ పడుతూనే ఉన్నారు. అందుకు తగ్గట్టుగానే... తాజాగా ఈ దాడి యత్నం జరిగింది.

దాడికి యత్నించిన నిందితుడు
ఇది కూడా చదవండి: Leopard in the City: నగరంలో చిరుత పులి.. దిక్కులు చూస్తూ.. దర్జాగా వెళ్తూ.. వైరల్ వీడియో
ఈ మొత్తం ఘటనపై పోలీసులు దర్యాప్తు జరిపి... వివరాలు చెబుతామంటున్నారు. ప్రాథమిక సమాచారం ప్రకారం దాడి చేసిన వ్యక్తి తాపీ మేస్త్రి నాగేశ్వరరావుగా తెలిసింది. మద్యం మత్తులో దాడి చేసినట్లు చెబుతున్నారు.
Published by:
Krishna Kumar N
First published:
November 29, 2020, 12:15 PM IST