హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

రావి చెట్టు వేప చెట్టుకు పెళ్లి చేస్తే మంచి జరుగుతుందా..? పండితులేమంటున్నారు..?

రావి చెట్టు వేప చెట్టుకు పెళ్లి చేస్తే మంచి జరుగుతుందా..? పండితులేమంటున్నారు..?

X
విజయవాడలో

విజయవాడలో వేపచెట్టు, రావిచెట్టుకు పెళ్లి

మన హిందు సాంప్రదాయంలో ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాం. పూజలు కూడా చేస్తుంటారు. అలా వృక్షాలను పూజించే వాటిల్లో రావి చెట్టు, వేప చెట్టు. ఈ వృక్షాలను పురాతన కాలం నుండి పూజిస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

మన హిందు సాంప్రదాయంలో ఎన్నో వృక్షాలను దైవ సమానంగా భావిస్తాం. పూజలు కూడా చేస్తుంటారు. అలా వృక్షాలను పూజించే వాటిల్లో రావి చెట్టు, వేప చెట్టు. ఈ వృక్షాలను పురాతన కాలం నుండి పూజిస్తున్నారు. ఈ రావి చెట్టు వేప చెట్టుకు వివాహం కూడా చేస్తారు. రావి చెట్టును సాక్షాత్తు విష్ణు మూర్తిగా భావిస్తారు. అలాగే ఈ రావి చెట్టు అణువు అనువులోను నారాయణుడు ఉన్నాడని కొలుస్తుంటారు. అలాగే వేప చెట్టును కూడా మన హిందు సాంప్రదాయం ప్రకారం శ్రీ మహాలక్ష్మీగా పూజిస్తారు. పురాణాల ప్రకారంఈ వృక్షాలను దైవంగా భావిస్తారు. ఈ రెండు వృక్షాలను నూతన దంపతులు, సంతానం లేని వారు పూజించడం వలన సంతానం కలుగుతుందని నమ్ముతారు.

అలాగే దంపతులు మధ్య ఎలాంటి విభేదాలు రావని పెద్దవారు, పండితులు చెప్తుంటారు. దానితో పాటుగా చాలా మంది రావి చెట్టుకి వేప చెట్టుకు వివాహం జరిపిస్తుంటారు. ఇలా వివాహం జరిపించడం వలన అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లుతారని అందరి నమ్మకం. అలానే ఎవరి జాతకంలో అయినా వివాహ దోషం ఉంటే రావి చెట్టుకి వేప చెట్టుకి వివాహం జరిపించడం వలన త్వరగా వివాహం అవుతుందని పండితులు చెప్తున్నారు. రావి చెట్టును పురుషుడుగానూ వేప చెట్టును స్త్రీ గాను పూజిస్తారు.

ఇది చదవండి: బెజవాడను హడలెత్తిస్తున్న కొత్త బ్యాచ్.. వణికిపోతున్న జనం

రోజూ రావిచెట్టు నీడన నిలబడితే శనిదోషం తొలగిపోతుంది. కొద్ది రోజులు నమస్కారం చేసి, చెట్టును హత్తుకుంటే శనిదోషం కూడా పోతుందని భావిస్తారు. రావిచెట్టు కొమ్మలతో యజ్ఞయాగాల చేస్తారు. సన్యాసులు రావిచెట్టు కర్రను దండంగా చేసుకుంటారు. దీని నీడలో కాసేపు సేదదీరితే రక్తపోటు అదుపులో ఉండటమే కాదు, దీని గాలి మంచి ఆలోచనలు కారణమవుతుంది. బౌద్ధులకు కూడా రావిచెట్టు పరమ పవిత్రమైంది. శ్రీకృష్ణుడు చివరిదశలో రావిచెట్టు కిందనే ప్రాణత్యాగం చేశాడని శాస్త్రాలలో కూడా ఉంది.

ఇది చదవండి: ఆలయంలో అద్భుతం.. భూమిలో లభ్యమైన శివుడి కళ్లు

వేప చెట్టులో కూడా ఎన్నో ఓషదా గుణాలు ఉన్నాయి. వేప చెట్టు గాలికి కిమికిటకాలు అన్ని పోతాయని వేప ఆకులను నీటిలో మరిగించి వాటితో స్నానం చేస్తే ఎటువంటి చర్మ వ్యాధులు రావని చెప్తుంటారు. అమ్మవారు పోసినప్పుడు వేపాకులపై పడుకోబెడుతుంటారు అలాగే అమ్మవారికి వేపాకు ఇష్టమని జాతర్లలో కూడా వాడతారు మనకు నేలపై దివ్య ఓషదం ఏదైనా ఉంది అంటే అదివేపాకే అని చెప్పాలి. అలాగే విజయవాడ సత్యనారాయణ పురం 5 టౌన్ పోలీస్టేషన్ పక్కన రావి చెట్టు ఉన్నాయి.

అక్కడి వారు ఎంతో భక్తి శ్రద్దలతో పూజలు చేస్తుంటారు. అక్కడ ఉన్న లక్ష్మీ నారాయణ వేప,రవి చెట్టుకి దారం కూడా చుడితే సంతానం లభిస్తుందని నమ్మకం. వందేళ్ల నుండి రావి చెట్టుకి, వేప చెట్టు పూజలు అందుకుంటుంది. ఆగస్టు26 న అక్కడ కళ్యాణం కూడా జరుగుతుంది. ఆ కల్యాణం ఎంతో వైభవంగా జరుగుతుంది. భోజన ఏర్పాట్లు కూడా చేస్తుంటారు. ఆరోజున అక్కడ జరిగే కల్యాణానికి చుట్టుపక్కల ఉండే రాజకీయ నాయకులు అందరూ వస్తుంటారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు