హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andhra Pradesh: చిన్న గుహలో భారీ విగ్రహం.. అనంత పద్మనాభుని అద్భుతం ఇదే..!

Andhra Pradesh: చిన్న గుహలో భారీ విగ్రహం.. అనంత పద్మనాభుని అద్భుతం ఇదే..!

X
గుహలో

గుహలో భారీ విగ్రహం

Andhra Pradesh: ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

K Pawan Kumar, News18, Vijayawada

ఉండవల్లిఅంటే తెలుగువారందరికీ వెంటనే గుర్తొచ్చేవి అక్కడున్న గుహాలయాలు. ఒక పర్వత సముదాయాన్ని ముందు భాగం నుండి లోపలికి తొలచుకుంటూ వెళ్లి నాలుగు అంతస్తులుగా అద్భుత సౌందర్యాలను సృష్టించారు. ఇక్కడ నాలుగు అంతస్తులలో ఆలయాలు నిర్మించారు. అందులో ఒక పెద్ద గ్రానైట్ రాతితో చెక్కిన 20 అడుగుల ఏక శిలా 'అనంత పద్మనాభ స్వామి' విగ్రహం చూపరులను ఆకట్టుకుంటోంది. దేవతా మూర్తులైన బ్రహ్మ, విష్ణువు, మహేశ్వరులకు సంబంధించిన ఆలయాలు కూడా ఉన్నాయి.

ఇక్కడి శిల్పకళా నైపుణ్యం అజంతా, ఎల్లోరాలోని శిల్పాలకు ఏమాత్రం తీసిపోవు. ఇవి గుప్తుల కాలంనాటి ప్రథమ బాగానికి చెందిన నిర్మాణ శైలికి లభిస్తున్న ఆధారాలలో ఒకటి. ఈ గుహాలయాలు క్రీ.శ. 420 నుండి 620 వరకు సాగిన విష్ణుకుండినుల కాలానికి చెందినవి.

బౌద్ధులకు నిలయం..

ఈ గుహలు.. మొదట బౌద్ధ మతానికి సంబంధించినవి. తర్వాత క్రమంగా గుహాలయాలుగా ప్రసిద్ధి చెందాయి. ఈ గుహలు బౌద్ధ, హైందవ శిల్పకళారీతుల సమ్మేళనం. ఈ నాలుగు అంతస్తుల గుహల సముదాయాన్ని మొదట బౌద్ధ భిక్షువుల నివాసం కోసం ఏర్పాటు చేసినట్లు చారిత్రక ఆధారాల ద్వారా తెలుస్తోంది.

ఏయే అంతస్తుల్లో ఏమున్నాయి..?

ఈ నాలుగు అంతస్తుల గుహల్లో.. మొదటి అంతస్తులో రుషులు, సింహాలు వగైరా విగ్రహాలున్నాయి. నరసింహస్వామి, విఘ్నేశ్వరుడు, దత్తాత్రేయుడు ఇంకా కొన్ని విగ్రహాలు గోడలకి చెక్కి ఉన్నాయి. స్తంభాల మీద కూడా కొన్ని శిల్పాలు ఉన్నాయి. రెండో అంతస్తులో శయనించి ఉన్న 'అనంత పద్మనాభస్వామి' విగ్రహం ఉంది. గర్భాలయ ద్వారానికి జయ విజయుల విగ్రహాలుంటాయి. ఇక మూడో అంతస్తులో పూర్తిగా నిర్మింపబడని త్రికూటాలయం ఉంది. ఇందలో ఎలాంటి విగ్రహాలు లేవు.

గుహల నుంచి రహస్యగుహల మార్గాలు..

గుహాలయాలనుండి కొండవీటి కోటకు, మంగళగిరి కొండకు, విజయవాడ కనక దుర్గ ఆలయానికి రహస్య మార్గాలున్నాయని చెబుతుంటారు. పూర్వం ఈ మార్గాల ద్వారా రాజులు శత్రువులకు తెలియకుండా తమ సైన్యాన్ని తరలించేవారు. ప్రస్తుతం ఇక్కడున్న సొరంగ మార్గం మూత పడి, పూడి పోయి ఉంద.

ఈ గృహలలో ఒక శిలా ఫలకం చెక్కబడి ఉంది. ఎంతోమంది ఈ శిలాఫలకాన్ని చదవడానికి ఎంతోమంది ప్రయత్నాలు చేసిన ఎవరి వలన సాధ్యం కాలేదు. ఫారిన్ కంట్రీస్ నుండి వచ్చినవారు కూడా చదవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిన సాధ్యం కాలేదు ఐతే దీని రహస్యం తెలిస్తే గృహకు సంబందించిన నిధులు, అసలు దేనికి చెక్కబడినది అనే రహస్యం తెలుస్తుంది అని అందరు అంటూ ఉంటారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు