Union
Budget 2023

Highlights

హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Love: ప్రేమించానంటే నమ్మింది.. అంతా అయ్యాక ఇలా చేస్తాడనుకోలేదు..

Love: ప్రేమించానంటే నమ్మింది.. అంతా అయ్యాక ఇలా చేస్తాడనుకోలేదు..

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

Love affair: ప్రేమ అనే మాట వింటే చాలు యువతీయువకులు పులకరించిపోతారు. ప్రపోజ్ చేసిన వాళ్లు నచ్చితేచాలు వారితో ఎందాకైనా వెళ్తారు. పెళ్లిచేసుకొని ఒక్కటే కలకాలం చిలకాగోరింకల్లాగా ఉండాలని భావిస్తారు. ఇద్దరిలో ఒక్కరు మాట తప్పినా ఆ బంధం విడిపోతుంది. జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి.

ఇంకా చదవండి ...

ప్రేమ అనే మాట వింటే చాలు యువతీయువకులు పులకరించిపోతారు. ప్రపోజ్ చేసిన వాళ్లు నచ్చితేచాలు వారితో ఎందాకైనా వెళ్తారు. పెళ్లిచేసుకొని ఒక్కటే కలకాలం చిలకాగోరింకల్లాగా ఉండాలని భావిస్తారు. ఇద్దరిలో ఒక్కరు మాట తప్పినా ఆ బంధం విడిపోతుంది. జీవితాలు ఊహించని మలుపు తిరుగుతాయి. అలా ఓ యువతి.. ప్రేమించానని ఓ యువకుడు ప్రపోజ్ చేయగానే ఒప్పేసుకుంది. అతడితో కలిసి హద్దులు దాటింది. కానీ వాడు మాత్రం అవసరం తీరాక మాట మార్చాడు. చివరికి పంచాయతీ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని విజయవాడ (Vijayawada) వాంబేకాలనీకి చెందిన యువతి హైదరాబాద్(Hyderaad) లో ఉద్యోగం చేస్తోంది. అక్కడే కృష్ణాజిల్లా నందిగామకు చెందిన బోనగిరి గోపి అనే యువకుడు పరిచయమయ్యాడు. ఆమెను ప్రేమిస్తున్నాని గోపీ వెంటపడడ్డాడు.

కొంతకాలం తర్వాత ఆమె అంగీకరించింది. ఆ తర్వాత ఇద్దరూ కలిసి తిరిగారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి యువతిని శారీరకంగా లొంగదీసుకున్నాడు. కొన్ని రోజులుగా తనను పెళ్లి చేసుకోమని యువతి ఒత్తిడి చేసింది. ఐతే తక్కువ కులానికి చెందిన నిన్ను పెళ్లి చేసుకునేందుకు తల్లిదండ్రులు ఒప్పుకోవడం లేదని బాంబు పేల్చాడు. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు గోపీపై అత్యాచారం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇది చదవండి: ఆమెకు 17, అతడికి 20.. ఇద్దరూ ప్రేమించుకున్నారు.. కానీ వారి జీవితం ఊహించని మలుపు తిరిగింది..!మరో ఘటనలో విజయవాడలోని కొత్తపేట వైఎస్ఆర్ కాలనీకి చెందిన 22 ఏళ్ల యువతికి ఏడాది క్రితం ఫోన్లో చిలకపాటి భానుప్రసాద్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. ఫోన్లో మాటలు కలిపి ప్రేమిస్తున్నానని చెప్పాడు. అందుకు ఆమె కూడా అంగీకరించింది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు మరింత దగ్గరయ్యాడు. ఆమె కోసం పలుసార్లు ఇంటికి కూడా వచ్చాడు. ఐతే పెళ్లి మాట ఎత్తేసరికి సమాధానం దాటవేస్తూ వచ్చేవాడు. ఐతే యువతి మరింత ఒత్తిడి చేయడంతో ఫోన్ తీయడం మానేశాడు.

ఇది చదవండి: ఆ పాడుపని చేయవద్దన్నా వినని భార్య.. విసిగిపోయిన భర్త ఏం చేశాడంటే..!అతడి గురించి యువతి ఆరాతీయగా విస్తుపోయే నిజాలు తెలిశాయి. అప్పటికే అతడికి పెళ్లైందని.. కుటుంబంతో కలిసి యనమలకుదురులో ఉంటాడని తెలిసింది. దీంతో బాధిత యువతి కొత్తపేట పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇది చదవండి: కిటికీలో చేయిపెట్టి దోచేస్తాడు.. ఈ దొంగ రూటే సపరేటు..!ఇదిలా ఉంటే ఓ వైపు ప్రేమ పేరుతో మోసం చేస్తున్న ఘటనలు వెలుగచూస్తుండగా.. మరోవైపు ప్రేమ కోసం ప్రాణాలు వదులుతున్న ప్రేమికులు కూడా ఉన్నారు. కృష్ణాజిల్లా ముసునూరు మండలం లోపూడికి చెంది బాలిక, పశ్చిమగోదావరి జిల్లా లింగపాలెం మండలం కొత్తపల్లికి చెందిన అనిల్ అనే యువుకుడు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు అంగీకరించకపోవడంతో పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Love cheating, Vijayawada

ఉత్తమ కథలు