హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

తులసి దళంతోనే కాదు.. పంటతోనూ లాభాలే లాభాలు..! వివరాలివే..!

తులసి దళంతోనే కాదు.. పంటతోనూ లాభాలే లాభాలు..! వివరాలివే..!

X
రైతుకు

రైతుకు లాభదాయకంగా తులసి సాగు

తులసి మొక్క గురించి మనందరికీ తెలిసే. ఎంతో భక్తి శ్రద్దలతో తులసమ్మకు పూజలు కూడా చేస్తారు. తులసిదళంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి మొక్క ఇంట్లో ఉంటే రోగాలు రావని చెబుతుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

తులసి (Tulasi) మొక్క గురించి మనందరికీ తెలిసే. ఎంతో భక్తి శ్రద్దలతో తులసమ్మకు పూజలు కూడా చేస్తారు. తులసిదళంలో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. తులసి మొక్క ఇంట్లో ఉంటే రోగాలు రావని చెబుతుంటారు. ఒక్క తులసీదళం ఎన్నో రోగాలకు చెక్ పెడుతుంది. కరోనా సమయంలోనూ తులసి వాడం చాలా పెరిగింది. కరోనా వైరస్ వలన చాలా మందికి ఎంతో గుణపాఠాలు నేర్పిందనే చెప్పాలి. కరోనా సమయంలో ప్రజలు అంతా ఎక్కువగా ఆయుర్వేదిక్ మెడిసిన్స్‌ వైపు శ్రద్ద చూపారు. అందువల్ల తులసి మొక్కలకు డిమాండ్ మరింత పెరిగింది. మరొక విధంగా చెప్పాలి అంటే ప్రజలు శ్రద్ధ చూపుతున్న సమయంలో మెడిసినల్ ప్లాంట్ అయిన తులసి పండించడం ద్వారా మెరుగైన లాభాలు పొందవచ్చు.

ఈ తులసి పంట కోసం పెద్దగా వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎకరాకు రూ.15 వేలు పెడితే లక్షల్లో సంపాదించవచ్చుని చెబుతున్నారు కృష్ణా జిల్లా (Krishna District) తాడిగడపకు చెందిన రైతు రమణయ్య. తనకున్న 70సెంట్ల భూమిలో తులసి పంటను సాగుచేస్తున్న రమణయ్య.. సాధారణ పంటలతో పోలిస్తే ఎక్కువ లాభాలే పొందుతున్నారు.

ఇది చదవండి: కోనసీమలో ఘనంగా ప్రభల ఉత్సవం.. ప్రత్యేకతలివే..!

ప్రస్తుతం తులసి పంటకు మార్కెట్లో మంచి గిరాకీ ఉందని.. ఆయుర్వేద వైద్యంలో తులసి ప్రాధాన్యత ఉండటంతో పంటను విక్రయించుకోవడానికి పెద్దగా కష్టపడాల్సిన పనిలేదంటున్నారు. ఎకరా తులసి పంట నుంచి 6 లీటర్ల నూనె తీయవచ్చని.. లీటర్ తులసి నూనె ధర రూ.7వేల నుంచి రూ.10 వేల వరకు ఉంటుందంటున్నారు. రూ.15వేల పెట్టుబడితో రూ.50వేల వరకు ఆదాయం వస్తుందంటున్నారు. ఐతే దళారుల కారణంగా ధరలో కాస్త తేడాలు వస్తున్నాయని.. ఔషధ కంపెనీలు, సుగంధ ద్రవ్యాల కంపెనీలతో నేరుగా అమ్మకాలు జరిపితే లాభాలు పెగుతాయని రైతు చెబుతున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Krishna District, Local News, Tulasi, Vijayawada

ఉత్తమ కథలు