Home /News /andhra-pradesh /

VIJAYAWADA TRAGEDY IN ANDHRA PRADESH INTER STUDENT SUICIDE FOR MOTHER FINANCIAL ISSUES NGS

Tragedy: అయ్యో ఎంత కష్టమొచ్చింది తల్లీ.. ర్యాంక్ వచ్చినా తల్లిదండ్రులు ఫీజు కట్టలేరని.. భారం కాకూడదని కఠిన నిర్ణయం

హరిత (ఫైల్)

హరిత (ఫైల్)

Tragedy: చదువుల తల్లి తనువు చాలించింది. మంచి ర్యాంక్ వచ్చినా.. తల్లి దండ్రులు చదివించలేరని భయపడింది. వారికి భారం కాకూడదు అనుకుంది. కఠిన నిర్ణయం తీసుకుంది. కూతరి నిర్ణయం తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

    Tragedy: లక్షలకు లక్షలకు ఖర్చుపెట్టి చదివిస్తామన్నా.. కొందరు ఒత్తిడిని తట్టుకోలేక చదువుకోలమని మదనపడుతుంటారు. మరికొందరు చదువు వంటపట్టక పక్కదారులు పడతారు.. ఎందుకంటే.. చదువుకునే స్థితి నుంచి చదువుకొనే స్థితిలో ప్రస్తుతం ఉన్నాం. దీంతో పేదలకు చదువు బరువైంది. ప్రతిభ ఉండి చదువును కొనే స్తొమత లేని స్టూడెంట్స్ కొందరు తమ చదువులకు గుడ్ బై చెప్పాల్సి వస్తోంది. తాజాగా ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) లో దారుణ ఘటన కలకలం రేపింది. ఉమ్మడి కృష్ణా జిల్లా (Krishna) నందిగామ (Nandigama) లో విద్యార్థిని సూసైడ్ (Student Suicide) కలకలం రేపింది. హరిత అనే విద్యార్థినికి ఎంసెట్ లో మంచి ర్యాంక్ వచ్చింది. కానీ తనను తల్లిదండ్రులు చదివించరనే మనస్తాపంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. కూతరు మరణంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్ధలానికి చేరుకుని..కేసు నమోదు చేశారు. దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు చేసుకోవడానికి ముందు హరిత రాసిన సూసైడ్ నోట్ పోలీసులకు లభ్యమైంది.

    ఆమె రాసిన సూసైడ్ లేఖ కూడా అందర్నీ కలచివేస్తోంది.. ఆ లేఖలో ఏముంది అంటే..? అమ్మా ఇప్పుడున్న పరిస్థితులలో మనం బతకడం కూడా చాలా కష్టంగా ఉంది.. మరోవైపు నాకు ,చెల్లికి చదువు కోసం ఫీజ్ కట్టడానికి మీ దగ్గర డబ్బులు లేవు అన్నవిషయం నాకు తెలుసు.. అందుకనే నేను ఆత్మహత్య చేసుకుంటున్నా అంటు హరిత ఆ సూసైడ్ లేఖలో పేర్కొంది.



    అలాగే ఆ లేఖలో తల్లిపై హరితకు ఉన్న ప్రేమని తెలియజేసింది. తమ వల్ల తన ఆరోగ్యం పాడుచేసుకో కూడదు అమ్మ అంటూ ఆ లేఖలో కోరింది. చెల్లిని బాగా చదివించండి.. బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకోమని సూచించింది. తాను మాత్రం తల్లికి భారం అవ్వకూడదని ఇలా ఆత్మహత్య చేసుకుంటున్నట్లు పేర్కొంది. అమ్మా క్షమించు.. పెద్దయ్యి చాలా చేయాలి అనుకున్నా. కానీ ఏమి చేయలేకపోతున్నా అంటూ ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేసింది.

    ఇదీ చదవండి : కేఏ పాల్ కు అనుచురుల షాక్.. అప్పు తిరిగి చెల్లించలేదని కార్లు సీజ్

    తాను చనిపోయినందుకు ఏడవద్దని.. అమ్మ చెల్లి జాగ్రత్తగా ఉండాలని సూచనలిచ్చింది. నాన్న డబ్బులు పంపిస్తాడో లేడో.. నాన్న పంపించకపోతే ఇల్లు గడవడం కూడా కష్టంగా ఉంటుంది కదమ్మా .. అందుకే తాను సూసైడ్ చేసుకుంటున్నానని ఉత్తరంలో హరిత పేర్కొంది. ఎవరైనా ఎందుకు తాను ఆత్మహత్య చేసుకున్నానని అడిగితే.. ఎంసెట్ గ్రాంట్ రాలేదని.. అందుకనే చనిపోయిందని చెప్పండని తల్లికి సూచించింది. కానీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోమని చెప్పింది. తనను చదివించే స్టేజిలో తల్లి లేదని.. తమ ఆర్ధిక పరిస్థితిపై ఆవేదన వ్యక్తం చేస్తూ హరిత ఉత్తరం రాసింది. హృదయ విదారకంగా ఉన్న హరిత సూసైడ్ నోట్ చూసిన కుటుంబ సభ్యులు విలపిస్తున్నారు.

    ఇదీ చదవండి: తెలుగు రాష్ట్రాల్లో క్యాసినో కలకలం.. ఈడీ రైడ్స్ తో తెరపైకి గుడివాడ వ్యవహారం.. నేపాలే ప్రధాన అడ్డా..?

    బ్యాంక్ ఏజెంట్లే కారణమా..?
    అయితే తన కూతురు ఆత్మహత్యకు బ్యాంక్ ఏఈజెంట్లు వేధింపు కారణం అంటూ హరిత తల్లి ఆరోపిస్తోంది. నందిగామలో బ్యాంక్ రికవరీ ఏజెంట్ల వేధింపులతో విద్యార్దిని ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. హరిత తండ్రి తీసుకున్న బ్యాంక్ లో అప్పు తీర్చాలని ఇంటికొచ్చి బ్యాంక్ రికవరీ ఏజెంట్లు బెదిరించారని. అంతేకాదు డబ్బులు కట్టకపోతే కూతుళ్ళని గేదెలు కాయించాలని ఏజెంట్లు ఓ ఉచిత సలహా కూడా ఇచ్చాడని ఆమె ఆరోపిస్తోంది. తాజాగా హరిత సూసైడ్ విషయం తెలియగానే.. ఏజెంట్ల పరారీ అయ్యారు. వారు ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు.
    Published by:Nagabushan Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, Crime news, Student suicide, Vijayawada

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు