హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. నాలుగు రోజుల పాటు.. ట్రాఫిక్ మళ్లింపు..!

Vijayawada: విజయవాడలో ట్రాఫిక్ ఆంక్షలు.. నాలుగు రోజుల పాటు.. ట్రాఫిక్ మళ్లింపు..!

. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ వరకూ గుణదల పడవల రేవు జంక్షన్ నుంచి ఈఎస్ఐ జంక్షన్ వరకూ ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

విజయవాడలో  గురువారం నుంచి ట్రాఫిక్ ఆంక్షలు విధించనున్నారు. నాలుగు రోజుల పాటు ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. విజయవాడలో గుణదల  మేరీ మాత (Gunadala Merimatha) ఉత్సవాల సందర్భంగా విజయవాడ (Vijayawada) నగరంలో ట్రాఫిక్ ఆంక్షల (Traffic Rules)ను పోలీసులు విధిస్తున్నారు. మేరీ మాత ఉత్సవాల సందర్భంగా ఈ నెల 9వ తేదీ నుంచి 12వ తేదీ వరకూ నగరంలో పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు.

నగరంలో పండిట్ నెహ్రూ బస్టాండ్ (Pandit Nehru Bus stand) నుంచి గన్నవరం (Gannavaram), ఆటోనగర్ (Autonagar) రాక పోకలు సాగించే సిటీ సర్వీసులను 5వ నెంబరు రూట్ మీదగా మళ్లించనున్నారు. మేరీ మాత ఉత్సవాల కోసం బస్టాండ్ నుంచి ప్రత్యేక సిటీ సర్వీసులు నిర్వహించనున్నారు. 9వ తేదీ అర్ధరాత్రి నుంచి 12వ తేదీ వరకూ గుణదల పడవల రేవు జంక్షన్ నుంచి ఈఎస్ఐ జంక్షన్ వరకూ ఏ విధమైన వాహనాలకు అనుమతి లేదు. ఆటోలకు సైతం మాచవరం డౌన్ వరకే అనుమతి ఇవ్వనున్నారు. మేరీ మాత ఉత్సవాలకు వచ్చే భక్తుల కోసం 6 ప్రాంతాల్లో ప్రత్యేక పార్కింగ్ సదుపాయాలు కల్పించనున్నారు.

విజయవాడలో జరిగే ఈ గుణదల మేరీమాత ఉత్సవాల్లో పాల్గొనేందుకు అనేక ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో విజయవాడకు చేరుకుంటున్నారు. బిషప్ గ్రాసి పాఠశాల ద్వారా కొండ పైకి చేరుకుని మేరీమాతను దర్శించుకుని తమ మొక్కుబడులు చెల్లించుకుంటారు.  మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా విజయవాడ కేథలిక్ పీఠాధిపతి డాక్టర్ తెలగతోటి రాజారావు భక్తులనుద్దేశించి శాంతి సందేశం అందిస్తారు. దీంతో విజయవాడ వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకూడదని.. అధికార యాంత్రంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది.

First published:

Tags: Local News, Vijayawada

ఉత్తమ కథలు