K Pawan Kumar, News18, Vijayawada
ఎవరైనా కష్టపడి పని చేసేది నాలుగు మెతుకులు కోసమే... కొందరు కూలి పనికి వెళ్తుంటారు మరికొందరు జాబ్స్ చేస్తుంటారు. మరికొందరు బిజినెస్ (Small Business) లు పెట్టుకుంటూ వుంటారు. మధ్య తరగతి (Middle Class People) వారు ఏదో చిన్న చిన్న కొట్టు.. లేదా పూలు, పండ్లు కొట్లు పెట్టుకుంటున్నారు. అలవాటు ఉన్నవారు అయితే.. చికెన్ (Chicken), మటన్ (Mutton) షాప్ లాంటివి పెట్టుకుంటూ వుంటారు. దాని మీదే కుటుంబం అంతా ఆధారపడి ఉంటుంది. మాములు రోజుల్లో అంత అంత మాత్రంగా చికెన్, మటన్ షాప్స్ సాగుతుంటాయి. అదే ఆదివారం వచ్చిందంటే చాలు నాన్ వెజ్ ప్రియులు (Nonveg Lovers) మాసం దుకాణాలు వద్ద క్యూ కడుతుంటారు. ఆరోజే ఆ షాప్ వారికి ఒక రూపాయి ఎక్కువ వస్తుంది. అలా చిన్న చిన్న లాభాలతో రోజులు గడుపుతున్న షాపులను కూడా అధికారులు వదలడం లేదు.
విజయవాడ 35వ డివిజన్లో పూర్ణానందం పేట, పెజ్జోని పేట, హార్ట్ పేట ప్రాంతాల్లో మాంసం అమ్మే దుకాణదారులు భయపడిపోతున్నారు. ఉన్నత అధికారులకు చికెన్, మటన్ వారానికి నాలుగు నుండి ఐదు కేజీలు ఉచితంగా ఇవ్వాలని ఇవ్వకపోతే తప్పుడు కేసులు పెట్టి, ప్లాస్టిక్ కవర్లు వాడుతున్నారు అని ఏకంగా షాప్స్ మూసివేయిస్తానని బెదిరింపులు రావడంతో కలత చెందుతున్నారు.
ఇప్పటికే అనేకసార్లు కార్పొరేట్ అధికారుల పేరిట వేల రూపాయలు జరిమానాలు తీసుకెళ్లారు. అలాగే ఇప్పటివరకు మాసం దుకాణదారులు కట్టిన వేలాది రూపాయలుకి ఆ ప్రతాపం చూపిస్తోంది సానిటరి అధికారి. ఈరోజు వరకు దుకాణదారులు కట్టిన డబ్బులుకి ఒక్క రసీదు కూడా ఇవ్వలేదంటే ఆ అధికారి ఎంత అవినీతికి పాల్పడుతున్నాడో అర్థం అవుతుంది.
ఇదీ చదవండి : ఐటీ దాడులు.. ఈడీ నోటీసులు.. వైసీపీ నేతల్లో టెన్షన్ టెన్షన్.. అసలు ఏం జరుగుతోంది..?
ఆ ప్రాంతంలో వారు కొంతమంది అధికార పార్టీ నేతలు సైతం ఈ సానిటరి అధికారి తీరుపై ఉన్నత అధికారులు కు తెలియజేసినట్లుగా తెలుస్తోంది. కూటి కోసం కోటి విద్యలు అన్నట్టుగా బ్రతడానికి వారు జీవన ఆధారంగా పెట్టుకున్న చిన్న చిన్న షాపులపై కూడా ఉన్నత అధికారులు వారి ప్రతాపాన్ని చూపిస్తుంటే దుకాణదారులు అంత వారి కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలంటూ వాపోతున్నారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నా.. పట్టించుకోవడం లేదని.. ఇలాగా వ్యవహారం ఉంటే.. ఇక తాము వ్యాపారాలు నడుపుకోవడం కష్టమే అని వీధి వ్యాపారులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, Chicken, Local News, Mutton, Vijayawada