K Pawan Kumar, News18, Vijayawada
రోజుకో ఛానెల్లో ప్రేమ పేరుతో మోసం, ప్రేమ పేరుతో డబ్బులు కాజేశారు అంటూ వార్తల్లో చూస్తూనే ఉన్నా ఈ ఆడపిల్లలు మారడం లేదు. గుడ్డిగా నమ్ముతూ ప్రేమించిన వాడు చెప్పినది చేస్తూ మోసపోతున్నారు,అలా చేస్తూ కొంత మంది ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు మరికొంతమంది కుటుంబ పరువును తీస్తున్నారు అలాంటి సంఘటనే విజయవాడ శివారుకు చెందిన ఒక యువతికి జరిగింది.
ప్రేమించుకున్నప్పుడు తీసుకున్న నగ్న వీడియో కాల్స్‌ను అందరికి చూపిస్తాను అంటూ యువతిని బెదిరిస్తున్న బొర్రా అరవింద్, విశ్వనాద్ అనే ఇద్దరు వ్యక్తులు వారిపై దిశ పోలీసులు కేసును నమోదు చేశారు. ప్రేమ పేరుతో యువతను నమ్మించి మోసం చేస్తున్నారు. నిజంగా ప్రేమిస్తున్నట్టు నటిస్తు వారికి అనుకూలంగా ఉండేలాగా ఆడపిల్లలను మలుచుకోడానికి ప్రయత్నిస్తున్నారు. యువతి నమ్మి వీడియో కాల్స్, నగ్నంగా వీడియో కాల్స్ చేస్తూ, ఫోటోలు పంపిస్తున్నారు, అవి వారికి రాగానే యువతిని వారికి నచ్చిన విధంగా ఉండాలని ఒత్తిడి తెస్తున్నారు. వాటికి సహకరించకుండా వ్యతిరేకించే సరికి పరువు పోయే విధంగా బ్లాక్ మైల్స్ చేస్తూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఇలాంటి సంఘటనే విజయవాడలో చోటు చేసుకుంది.
విజయవాడ శివారులో ఒక యువతి 26 గతంలో విమానయాన సంస్థలో ఎక్స్గ్యూటివ్గా పని చేసింది. అప్పుడు బొర్రా అరవింద్ అనే వ్యక్తి ని ప్రేమించింది. వారు తరచు కాల్స్,మెస్సేజ్ లు అలాగే నగ్న వీడియో కాల్స్ చేసుకుంటూ వుండే వారు. ఆ సమయంలో అరవింద్ ప్రవర్తన సరిగ్గా లేకపోవడంతో దూరం పెట్టింది. దానితో అలా దూరం పెట్టిందని భరించలేక అరవింద్ ఆ యువితిని బెదిరించాడు. ఎప్పటిలాగే నువు నాతో ఉండాలని లేదంటే తన దగ్గర ఉన్న నగ్న వీడియో కాల్స్‌ని తమ తల్లిదండ్రులుకి, ఫ్రెండ్స్ కి పంపిస్తాను అని బెదిరించాడు. అలాగే అతని ఫ్రెండ్ విశ్వనాథ్కూడా వాట్సప్ యూట్యూబ్‌లో పెడతానని బెదిరించడంతో బాధితురాలు దిశ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో కేసును దిశ పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada