K Pawan Kumar, News18, Vijayawada
ఆధ్యాత్మిక నగరంలో విరాజిల్లుతున్న విజయవాడ (Vijayawada) నగరంలో చరిత్రాత్మక కలిగిన ఆలయాలలో ఒకటి ఈ దుర్గమ్మ ఆలయం. ఈ ఆలయం ఒకప్పుడు మొగల్ రాజు ఉన్న ప్రదేశమైన మొగల్రాజపురం ప్రాంతంలో కొండ మీద ఉన్న స్వయంబు దుర్గమ్మ ఆలయం. ఆ అమ్మే స్వయంగా ధనకొండపై వెలసింది. ఇంద్రకీలాద్రి కొండపై కనక దుర్గమ్మ వెలియడానికి ముందే మొగల్రాజపురంలో ఉన్నటువంటి ధనకొండపై వెలసిందని పురాణాలు చెబుతున్నాయి. దుర్గమ్మ దక్షిణాది నుండి కదిలి ఉత్తర దిక్కునకు వచ్చి విజయవాడలోని మొగల్రాజపురం కొండ మీద వెలసింది ఈ దుర్గమ్మ. పూర్వం ఓ మేకలకాపరి గొర్రెలు, మేకలను తొలుకుని ప్రతిరోజూ కొండప్రాంతానికి వెళ్లేవాడు. ఓ రోజు కొండపై గజ్జెల శబ్దం రావడంతో వెతుక్కుంటూ వెళ్లగా.. అక్క ఓ మహిళ కనిపించింది. ఆమె నీకు మూడు బస్తాల బంగారం ఇస్తాను వెనక్కి తిరిగి చూడకుండా వెళ్లమని చెప్పింది. ఎట్టి పరిస్థితిల్లో వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పింది. అలా వెళ్తున్న గొర్రెల కాపరి.. ఓ మలుపు వద్ద వెనక్కి తిరిగి చూడగా.. అమ్మవారు మాయమైందని.. అప్పటి నుంచి ఆ కొండను ధనకొండ అని పిలుస్తున్నారు.
ఈ కొండపై అమ్మవారు 200ఏళ్ల క్రితం నుండే పూజలు అందుకుంటుందని స్థానికులు చెబుతుంటారు. ఈ కొండపై అమ్మవారు సాక్షాత్తూ శ్రీచక్రం రూపంలో వెలసిందని.. కళ్లు, పాదాలు కూడా కొట్టొచ్చినట్లు కనిపిస్తుంటాయి. ఆలయానికి వెళ్లేందుకు ఎలాంటి దారి లేకపోవడంతో చెట్లు, పొదల్లోనుంచే వెళ్లవలసి ఉంటుంది. దసరా పండుగ సమయంలో ఇక్కడ జాతర నిర్వహిస్తారు. నవరాత్రుల సమయంలో స్థానికులు కొండపైకి వెళ్లి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి, పూజలు చేస్తారు. ఇప్పటికీ కొండ పరిసర ప్రాంతాల్లా గజ్జెల శబ్దం వినిపిస్తుంటుందని స్థానికులు చెబుతుంటారు. ప్రతి శుక్ర, ఆదివారాల్లో భక్తులు కొండపైకి వెళ్లి అమ్మవారిని పూజిస్తుంటారు.
కొలిచిన వారి కొంగు బంగారం అయ్యి విరాజిల్లుతున్న అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కొందరు స్థానికులు ముందుకొస్తున్నారు. 1992లో దాదాపు ఏడూ అడుగులు గల అమ్మవారి రూపంలో విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ప్రతిష్టించి ప్రత్యేక పూజలు ప్రారంభించారు. ఉగ్ర రూపిణీయై ధనకొండపై వెలసిన అమ్మవారు భక్తులకు కనపడదు అంటే గర్భాలయంలో ఒక ఎర్రటి జ్వాలాల కనిపిస్తుంది. ఈ రూపం దిగువ భాగంలో శ్రీ చక్ర రూపం ఉంటుంది. త్రికోణాకారంలో ఉన్న జ్వాలా రూపం ఇక్కడ వదిలి పెట్టి కనక దుర్గా దేవిగా ఇంద్రకీలాద్రి పై వెలసింది అని చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి.
ఇలా అసలు రూపం ధన కొండపై ఉండి పోయింది. దుష్టులను శిక్షిస్తూ, ఆపదలో ఉన్న వారినిరక్షించే తల్లిగా పూజలు అందుకుంటుంది. ధనకొండకు ఘాట్ రోడ్డులో 9 మలుపులుంటాయి. 8 మలుపుల తర్వాత 9వ మలుపువద్ద అమ్మవారి దర్శనం లభిస్తుంది. కొండ ఎక్కే సమయంలో అమ్మవారి 9 అవతారాలు దర్శనమిస్తాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Durga temple, Local News, Vijayawada