K Pawan Kumar, News18, Vijayawada
ఇండియా (India) అంటే ఫుడ్ లవర్స్ కి పెట్టింది పేరు. వెరైటీ వంటకాలన్నీ మన దగ్గరే దొరుకుతాయి. ఇక ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విషయానికి వస్తే స్వీట్లు, హాట్లు, పిండి వంటలు, బిర్యానీలు ఇలా తిన్నోడికి తిన్నంత అనేలా ఫుడ్ వెరైటీస్ ఇక్కడ దొరుకుతుంటాయి. తెలుగు వారికి స్వీట్లు అంటే పిచ్చి. అందుకే ఏపీలోని ఒక్కో ప్రాంతంలో ఒక్కో స్వీట్ ఫేమస్ అయింది. అందుకే ఆంధ్రలో ఏ ఫంక్షన్ ఉన్నా.. ముందు స్వీట్ తోనే ప్రారంభిస్తారు. కాకినాడ కాజా, ఆత్రేయ పురం పూత రేకులు, బందరు లడ్డు రాష్ట్రంలోనే కాదు దేశంలోనే ఫేమస్. ఈ స్వీట్లు ఇక్కడి నుంచి దేశవిదేశాలకు వెళ్తుంటాయి. ఐతే స్వీట్లతో పాటు కొన్ని స్వీట్ షాపులు కూడా జనం నోట్లో నానుతుంటాయి. అదే విజయవాడలోని శ్రీకృష్ణ స్వీట్ షాప్.
ఇక్కడ ఒకటికాదు రెండు కాదు పదులకొద్దీ వెరైటీలు నోటిని తీపిచేస్తుంటాయి. విజయవాడలో కృష్ణా స్వీట్స్ అంటే తెలియని వారు ఉండరు. మంచి రుచిని అందిస్తూ అందరి ఆదరాభిమానాలు మన్ననలు పొంది ఎంతో రుచికరమైన స్వీట్స్ అందిస్తుంది. అన్నిరకాల స్వీట్స్ అందిస్తూ అన్ని చోట్లా ఎంతో నమ్మకాన్ని పొందారు ఈ కృష్ణా స్వీట్స్.
50 ఏళ్ల క్రితం బందరు రోడ్డులో శ్రీకృష్ణ స్వీట్స్ ప్రారంభమైంది. ఇక్కడ దాదాపు 50రకాల స్వీట్, హాట్ వెరైటీలు తయారు చేస్తుంటారు. 50 మంది వర్కర్లు జనం నోరు తీపి చేసేందుకు కష్టపడుతుంటారు. ఎలాంటి కల్తీ లేకుండా రుచికరమైన స్వీట్స్ ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ స్వీట్స్ ని రుచి చూడటం కోసం విజయవాడ వాసులే కాకుండా చుట్టూ పక్కల గ్రామాల వారు జిల్లాలవారు కూడ వస్తుంటారు. ఇక్కడ నుంచి స్వీట్స్ తీసుకెళ్లి గ్రామాల్లో కూడా విక్రయిస్తుంటారు. అలాగే ఫంక్షన్లు, పెళ్ళిళ్లకు శ్రీకృష్ణ స్వీట్సే వెళ్తుంటాయి.
ఇక ఇక్కడ ధరలు కూడా చాలా అందుబాటులోనే ఉంటాయి. హైరేంజ్ స్వీట్ షాపుల మాదిరి వేలకు వేలు వసూలు చేయరు. సామాన్యుడు కూడా కొనుగోలు చేసే విధంగా స్వీట్స్ ధరలుంటాయి. స్వీట్స్ ను బట్టి కిలో రూ.200 లోపే ఉంటాయి. ఇక వినాయక చవితి వంటి పండుగల సమయంలో భారీ లడ్డూలను కూడా తయారు చేస్తుంటారు. ఇక్కడి బొబ్బట్లు చుట్టుపక్కల వారికి చాలా ఫేవరెట్ స్వీట్ అని చెప్పాలి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada