హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

వినూత్న బోధనంటే ఇదే..! ఇలా చెబితే పాఠం అర్థం కావాల్సిందే..!

వినూత్న బోధనంటే ఇదే..! ఇలా చెబితే పాఠం అర్థం కావాల్సిందే..!

X
ఎన్టీఆర్

ఎన్టీఆర్ జిల్లా వత్సవాయిలో వినూత్న బోధన

స్కూల్లో విద్యార్థులకు పాఠాలు అర్థంకావాలంటే వినూత్నంగా ఆలోచించాలి. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు డిజిటల్ క్లాస్ రూములను అందుబాటులోకి తెచ్చాయి. ఐతే కొన్నిచోట్ల ఉపాధ్యాయులే పిల్లలకు నచ్చేవిధంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Jaggaiahpet (Jaggayyapeta), India

Yashwanth, News18, Jaggayyapeta

స్కూల్లో విద్యార్థులకు పాఠాలు అర్థంకావాలంటే వినూత్నంగా ఆలోచించాలి. అందుకే ఇప్పుడు ప్రభుత్వాలు డిజిటల్ క్లాస్ రూములను అందుబాటులోకి తెచ్చాయి. ఐతే కొన్నిచోట్ల ఉపాధ్యాయులే పిల్లలకు నచ్చేవిధంగా బోధిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం లింగాల MPUP పాఠశాలలో ఉపాధ్యాయులు వినూత్న బోధిస్తున్నారు ఉపాధ్యాయులు. వృత్తిపట్ల నిబద్ధతతో విలువలతో కూడిన విద్యాబోధన చేస్తూ వృత్తికి తమ జీవితాన్ని అంకితం చేసే వ్యక్తులు కొందరుంటారు. ఎన్టీఆర్ జిల్లాలోని వత్సవాయి మండలం లింగాల గ్రామంలోని మండల పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అర్థమయ్యే విధంగా విన్నుతమైన రీతిలో ప్రతి ఒక్క భాషను విద్యార్థులకు వివరిస్తున్నారు.

అదే విధంగా ప్రతి ఒక్క పాఠ్యపుస్తకములోని పాఠమును విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధిస్తూప్రతి ఒక్క పదమును వివరిస్తూ పాఠ్య ముఖ భావము తెలుగు, ఇంగ్లీష్, గణితం, సైన్స్, రసాయన శాస్త్రము, వంటి సబ్జెక్టులను కేవలం పుస్తకం చూసి బోర్డుపై వివరించడమే కాకుండా.. పాఠ్యాంశానికి సంబంధించిన నమూనాలను తయారు చేసి అప్పటికప్పుడు వివరిస్తున్నారు. సబ్జెక్టులోని వస్తువులు లేదా విషయాన్ని ప్రత్యక్షంగా చూపిస్తూ వివరిస్తున్నారు. శరీర అవయవాలు, మొక్కలు, మూలకాలు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని కూడా ప్రత్యక్షంగా వివరించడంతో విద్యార్థులు తొందరగా నేర్చుకోవడంతో పాటు జీవితకాలం గుర్తుండిపోయే విధంగా ఉంటాయని ఉపాధ్యాయులు తెలుపుతున్నారు.

ఇది చదవండి: ఒకేసారి ఐదుగురికి అరుదైన ఆపరేషన్లు.. కర్నూలు డాక్టర్ల రికార్డ్

అదే విధంగా విద్యార్థులు మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పే విధానం తమకు చాలా బాగుందని చెప్పే ప్రతి ఒక్క ఒకటి చాలా సులభంగా అర్థమవుతుందని, ఇంటిదగ్గర చదువుకోవడానికి కూడా బాగుంటుందని ఉపాధ్యాయులు మాకు ఇలా చెప్పడం వలన పరీక్షల్లో ఎక్కువ మార్కులు రావడంతో పాటు మాకు చాలా ఆనందంగా ఉంటుందని విద్యార్థులు తెలుపుతున్నారు.

First published:

ఉత్తమ కథలు