హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Summer Holidays: ఏపీలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి.. ఎన్ని రోజులు ఇస్తున్నారో తెలుసా..?

Summer Holidays: ఏపీలో వేసవి సెలవులు ఎప్పటి నుంచి.. ఎన్ని రోజులు ఇస్తున్నారో తెలుసా..?

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

Summer Holidays: అప్పుడు ఎండలు చంపేస్తున్నాయి. మద్యాహ్నం రోడ్డుపైకి వెళ్లాలి అంటే భయపడాల్సి వస్తోంది. దీంతో విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు వేసవి సెలవులు ఎప్పటి నుంచి వస్తాయా అని ఎదురు చూస్తున్నారు. తెలంగాణలో ఇప్పటికే వీటిపై ప్రకటన చేసినా.. ఏపీలో మాత్రం ఇప్పటి వరకు అధికారిక ప్రకటన చేయలేదు. అయితే ఈ సారి వేసవి సెలవలు ఎప్పటి నుంచి ఉంటాయి.. ఎన్ని రోజులు ఉంటాయో తెలుసా..?

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Summer Holidays: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ఎండలు మండిపోతున్నాయి. మరోవైపు ఇంటర్ పరీక్షలు(Inter Exams) ముగిసాయి.. పది పరీక్షలు త్వరలోనే ప్రారంభం అవుతున్నాయి. దీంతో విద్యార్థులు.. వారి తల్లిదండ్రులు ఎప్పుడెప్పుడు స్కూల్స్‌కు వేసవి సెలవులు (Summer Holiday) ఇస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు అధికారికంగా సెలవులపై ఎలాంటి ప్రకటన చేయనప్పటికీ.. ఏపీ స్టూడెంట్స్‌కు ఓ ముఖ్య అలెర్ట్. ఈసారి రాష్ట్రవ్యాప్తంగా స్కూల్స్‌కు భారీగా వేసవి సెలవులను ఇచ్చే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు అనధికారికంగా చెబుతున్నారు. 2022-2023 ఏపీ విద్యాసంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్ ఒకసారి పరిశీలిస్తే.. 1వ తరగతి నుంచి 9వ తరగతి వరకు చదువుతున్న విద్యార్ధులకు ఏప్రిల్ 27తో ఈ ఏడాది పరీక్షలు ముగిస్తాయి. ఆ తరువాత మూడు రోజుల్లో రిజల్ట్స్, పేరెంట్స్ మీటింగ్స్ వంటివి ఉంటాయి అంటే.. ఏప్రిల్ 30వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న స్కూల్స్, పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే అవకాశం ఉంటుంది అంటున్నారు.

అప్పటికే ఉష్ణోగ్రతలు భారీగా పెరిగితే.. ఈ సెలవులు షెడ్యూల్ కంటే ముందే ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. అలాగే వచ్చే ఏడాది జూన్ 12వ తేదీ నుంచి స్కూల్స్ ప్రారంభించే అవకాశాలు ఉన్నాయి. అంటే దాదాపు గా రాష్ట్రంలో పాఠ‌శాల‌కు సుమారు 45 రోజులు వేసవి సెలవులు ఇవ్వాలని నిర్ణయించినట్టు సమాచారం. అయితే అధికారికంగా దీనిపై ప్రకటన చేయాల్సి ఉంది.

మరోవైపు ఏపీలో పది పరీక్షలకు సర్వం సిద్ధమైంది. పరీక్షలకు సంబంధించి ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తోంది. మరోవైపు అధికారులు విద్యార్ధులను ఎలర్ట్ చేస్తూ పరీక్షల సమయంలో పాటించాల్సిన నియమ నిబంధనలను వెల్లడించారు. ప్రతి సారిలాగే ఈసారి కూడా ఒక నిముషం నిబంధన అమలులో ఉంటుందని ఈ నియమాన్ని ఉల్లంఘించిన విద్యార్ధులను ఎట్టి పరిస్థితిలోనూ పరీక్షకు అనుమతించేది లేదని అధికారులు స్పష్టం చేశారు.

ఇదీ చదవండి : నవంబర్ లోనే ఏపీ ఎన్నికలు.. సీఎం జగన్ ఢిల్లీ పర్యటన అందుకేనా..?

ఉ.930 నుంచి మ.12.45 సమయం మధ్య పరీక్షలు జరగుతాయి. ఉదయం 8.45 నుంచి ఉ.9.30 వరకూ మాత్రమే పరీక్షా కేంద్రాల్లోకి విద్యార్ధులకు అనుమతిస్తారని అధికారులు చెప్పారు. ఉ.9.30 దాటి నిముషం ఆలస్యమైనా పర్మిషన్ ఇవ్వబోమని స్పష్టం చేశారు. అలాగే పరీక్ష సమయంలో సెల్ ఫోన్లు, ట్యాబ్స్, ల్యాప్ట్యాప్‌లు లాంటి డిజిటల్ పరికరాలపై నిషేధం విధించామని అధికారులు చెప్పారు. ఈ ఏడాది పరీక్షలకు 6,10,000 మంది రెగ్యులర్ విద్యార్థులు హాజరవుతుండగా, మరో 55,000 మంది ప్రైవేటుగా పరీక్షలు రాయబోతున్నారు. ఈ ఏడాది నుంచి ఒకే పేపరు విధానంలో పరీక్ష జరుగుతుంది. అంటే ఒక సబ్జెక్టు రెండు పేపర్లతో కాకుండా, ఒక్క

పేపర్‌తోనే వంద మార్కులకు పరీక్ష ఉంటుంది.

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Schools, AP SSC board exams

ఉత్తమ కథలు