Home /News /andhra-pradesh /

VIJAYAWADA THIS IS ISLAND WILL GIVE YOU GOOD EXPERIENCE IN WEEKENDS IN VIJAYAWADA FULL DETAILS HERE PRN VPR NJ

Vijayawada News: పని ఒత్తిడిలో అలసిపోయారా.. ఇక్కడికి వెళ్తే రిలీఫ్ గ్యారెంటీ..!

విజయవాడలోని

విజయవాడలోని భవానీ ద్వీపం

రోజువారి పనుల ఒత్తిడితో విసిగిపోయారా..! సమ్మర్‌ కదా సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని పిల్లలు గోల చేస్తున్నారా..! బయట చూస్తే ధరలు పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌..!

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada

  రోజువారి పనుల ఒత్తిడితో విసిగిపోయారా..! సమ్మర్‌ కదా సరదాగా ఎక్కడికైనా తీసుకెళ్లమని పిల్లలు గోల చేస్తున్నారా..! బయట చూస్తే ధరలు పెరిగిపోయాయి అని ఆలోచిస్తున్నారా? అయితే మీకో గుడ్‌న్యూస్‌.. అతి తక్కువ బడ్జెట్‌లో ఎంతో వినోదాన్ని అందించే పర్యాటక ప్రాంతం మనకు దగ్గరలోనే ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) విజయవాడ (Vijayawada) లోని భవానీ ద్వీపం. సమ్మర్‌లో ఫ్యామిలీతో కలిసి కచ్చితంగా చూడాల్సిన పర్యాటకప్రదేశం. కృష్ణమ్మ ఒడిలో పచ్చనిపరదా పరిచినట్లు ఉండే భవానీ ద్వీపం (Bhavani Island).., పర్యటకులకు వెల్‌ కమ్‌ చెబుతోంది. దాదాపు 133 ఎకరాల్లో విస్తరించిన ఈ ఐలాండ్‌ ప్రకృతి ప్రేమికులకు గొప్ప విహారప్రాంతం. పిల్లలకు ఇక్కడ దొరకని వినోదమంటూ ఏదీ ఉండదు సుమీ.

  ఆ ద్వీపంలో మాయ ప్రపంచం..?
  మాయా ద్వీపం ప్రోగ్రామ్‌ చూస్తూ పిల్లలు ఎంత థ్రిల్‌ ఫిలయ్యేవారో…ఈ భవానీ ద్వీపం చూస్తే కూడా పిల్లలకు అంతే ఎంజాయ్‌ చేస్తారు. వాళ్లకు కావల్సిన ఎంతో వినోదం ఇక్కడ దొరుకుతుంది. వాటర్‌ గేమ్స్‌, అరుపులతో అదురుపుట్టించే క్రూర మృగాలు, రోబోటిక్‌ జురాసిక్‌ పార్క్‌, ఊగే వంతెన… ఆడుకోవడానికి విశాలమైన ప్రాంతం..ఎన్నో సాహస క్రీడలు…ఇలా పిల్లలు తాము ఒక మాయాలోకంలో ఉన్నట్లు ఎంజాయ్‌ చేస్తారు.

  ఇది చదవండి: మారువేషంలో ప్రజల్లోకి మంత్రి, ఎమ్మెల్యే.. పబ్లిక్ రియాక్షన్ ఇదే.. పరువు తీసిన ప్రయోగం..?


  భవాని ఐలాండ్‌లో జురాసిక్‌ పార్క్‌..?
  పర్యాటకులను విశేషంగా ఆకట్టుకునేందుకు ఏర్పాటు చేసిన రోబోటిక్‌ జురాసిక్‌ పార్క్‌లో… అంతరించిపోయిన రాక్షస బల్లి మొదలగు డైనోసార్స్, ఆఫ్రికన్ ఏనుగు ,మొసలి, కింగ్ కాంగ్ లాంటివి అక్కడకు వచ్చే వారిని తమదైన శైలిలో ఆహ్వానిస్తున్నాయి. ఇక పిల్లలు ఆఫ్రికన్ ఏనుగును చూసి కేరింతలు కొడుతూ ఎంజాయ్ చేస్తున్నారు.సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు. రోబోటిక్ పార్క్ లో అనువనువున కొత్తదనం ఉట్టిపడుతుంది. మరి ముఖ్యంగాఊగే వంతెనపై చిన్న , పెద్ద తార తమ్యం లేకుండా ఎంజాయ్ చేస్తున్నారు.

  ఇది చదవండి: ఈ ఫ్లైట్ ఎక్కాలంటే టికెట్ అవసరం లేదు.. ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు..


  అద్భుతమైన కాటేజీలు
  అలసటతీర్చుకునేందుకు మైజ్ గార్డెన్ ,తో పాటు ఐలాండ్‌లోని ప్రత్యేకమైన కాటేజిలు అందుబాటులో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ ద్వీపంలో అదనపు సౌకర్యాలను కల్పించింది. ఇక్కడ హరితా రెసార్ట్‌లో అతిథులు బస చేసేందుకు సదుపాయాలున్నాయి. ఐలాండ్ మొత్తం తక్కువ సమయంలో చూసేందుకు వీలుగా డబుల్రైడ్ సైకిళ్లను, బ్యాటరీ వాహనాలను అధికారులు ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: ఈ కోళ్లను కొనాలంటే ఆస్తులమ్ముకోవాలి.. వాటికున్న డిమాండ్ అలాంటిది మరి.. మీరే చూడండి..!


  ఒకవైపు బుల్‌ ఫైట్‌.., మరోవైపు అద్దాలమేడ
  ఐలాండ్ కు వచ్చిన పర్యాటకులను బరి లోకి రమ్మంటూ స్వాగతిస్తున్న బుల్ , బుల్ ని చూసిన ప్రతి ఒక్కరూ బుల్ ఫైట్ చేయకుండా అక్కడ నుంచి కాలు ముందుకు వేయడం లేదంటే నమ్మండి. పద్మవ్యూహాన్ని తలపిస్తున్న అద్దాల మేడ భవానీ ఐలాండ్‌కు వచ్చిన ప్రతి ఒక్కరికీ ఇదొక పెద్ద పజ్జిల్‌లనే కనిపిస్తుంది. ఆ పజిల్ చేదించేందుకు సమయం పట్టినా అక్కడ పొందే ఆనందం అంత ఇంత కాదండీ.

  ఇది చదవండి: జీవం ఉట్టిపడటం అంటే ఇదే.. వారెవా ఏం టాలెంట్ గురూ..! చరిత్రకు జీవం పోస్తున్నారు..


  ఆహ్లాదకరమైన పడవ ప్రయాణం
  ముఖ్యంగా ఈ దీవికి చేరేందుకు పున్నమి ఘాట్ నుంచి బోట్లు, పడవలు అందుబాటులో ఉంటాయి. పర్యాటకులకు లైఫ్‌ జాకెట్లు తప్పనిసరి. అక్కడ మనం ఎంత సేపైనా గడపొచ్చు. పర్యాటకులను ఉత్సాహ పరిచేఅసలైన ఘట్టం వాటర్ స్పోర్ట్స్. నదిపై పడవలో ప్రయాణం ఓ మధరానుభూతిని ఇస్తే,నది లో జెట్ స్కి,స్పీడ్ బొట్ పై ప్రయాణం సహసం అనే చెప్పాలి, నిష్ణాతులైన ట్రైనర్లల సమక్షంలో ఈ వాటర్ స్పోర్ట్స్ ను భద్రతా ప్రమాణలతో నిర్వహిస్తారు. సాయం సంధ్య వేళలో పర్యాటకులతో పాటు, నగర పరిసర ప్రాంతాల నుంచి అందమైన సన్‌సెట్‌ను చూసేందుకు వస్తుంటారు.

  ఇది చదవండి: ఏపీలో కేజీఎఫ్ తరహా గోల్డ్ మైన్స్..? ఆ కొండల కింద అంతా బంగారమే..!


  సమ్మర్‌లో క్యూ కడుతున్న పర్యాటకులు
  వేసవి సెలవులు కావడంతో పర్యాటకుల చూపు భవాని ఐలాండ్ పై పడింది అని చెప్పలి . వేసవి తాపాన్నికిసేద తీరాలని ఇప్పటికే పొరుగు రాష్ట్రాల నుంచి అనేక మంది టూరిస్ట్లు భవాని ద్వీపంను సందర్శిస్తున్నారు.

  ద్వీపానికి ఆ పేరు ఎలా వచ్చింది?
  విజయవాడ నడిబొడ్డున కనకదుర్గమ్మ కొలువైఉంటుంది. ఆమె మరోపేరు భవానీగా ఆమెకు మరో పేరు కూడా ఉంది, అందువల్ల ఈ ద్వీపాన్ని భవానీ ద్వీపం అని పిలుస్తారు. ఈ ద్వీపం కనకదుర్గమ్మ ఆలయ సమీపంలో ఉంది.

  ఎలా వెళ్లాలి?
  విజయవాడకు బస్సు, రైలు మార్గం ద్వారా వెళ్లొచ్చు. అక్కడ నుంచి పుష్కరఘాట్‌ వరకు ఆటోలు, లోకల్‌ బస్సులు ఉంటాయి. పుష్కరఘాట్‌ నుంచి పడవ ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

  దగ్గరలో చూడాల్సిన మరికొన్ని ప్రదేశాలు
  విజయవాడ వస్తే కేవలం భవానీ ద్వీపమే కాదు, ప్రకాశం బ్యారేజ్, అక్కన్న మాదన్న గుహలు, హంసలదీవి, కొండపల్లి కోట, ఘంటశాల, బౌద్ధారామం, చల్లపల్లికోట, కూచిపూడి, మొగల్రాజపురం గుహలు, సిబార్ డిస్నీల్యాండ్, విక్టోరియా మ్యూజియం, కొండపల్లి ప్రసిద్ధ పర్యాటక ప్రాంతాలను కూడా చూడండి.
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు