Breakfast Biryani: కొందరికి నిద్ర లేవగానే.. కాఫీనో, టీనో తాగితే గానీ మరే పనులు ప్రారంభించరు. అలాంటి వారి కోసం పొద్దు పొడవక ముందే టీ, కాఫీలు, టిఫిన్లు చాలా చోట్ల లభిస్తాయి. కానీ కోడి కూయకముందే.. బిర్యానీ తినాలనే అభిరుచి ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి?
కొందరికి నిద్ర లేవగానే.. కాఫీనో, టీనో తాగితే గానీ మరే పనులు ప్రారంభించరు. అలాంటి వారి కోసం పొద్దు పొడవక ముందే టీ, కాఫీలు, టిఫిన్లు చాలా చోట్ల లభిస్తాయి. కానీ కోడి కూయకముందే.. బిర్యానీ తినాలనే అభిరుచి ఉన్న వాళ్ల పరిస్థితి ఏంటి? అంత పొద్దునే బిర్యానీలు దొరుకుతాయా అంటే అఫ్ కోర్స్ దొరుకుతాయి.. ఆ ఒక్క రెస్టారెంట్లో మాత్రమే..! అదెక్కడో కాదండి మన విజయవాడ (Vijayawada) లోనే..! మాములుగా రెస్టారెంట్లు ఏవైనా మధ్యాహ్నం 12 తర్వాతే ఓపెన్ చేస్తారు.. కానీ, విజయవాడ బాబు హోటల్ మాత్రం పొద్దునే బిర్యానీ తినాలి అనుకునేవారికి స్వాగతం పలుకుతోంది. తూర్పున ఉదయించే సూర్యుడు అయినా కాస్త ఆలస్యంగా వస్తాడేమో కానీ హోటల్ బాబులో బిర్యానీ (Biryani) మాత్రం ఉదయం ఆరు గంటలకు టించనుగా లభిస్తుంది. కేవలం బిర్యానీ ఒక్కటే కాదు అండి చికెన్, మటన్, పాయ వంటి వంటకాలు ఇక్కడ దొరుకుతాయి.
రూ. 30తో మొదలుపెట్టి.., నేడు హోటల్ యజమానిగా..!
12ఏళ్లుగా వేరీ వేరీ ఫేమస్ రెస్టారెంట్లలో పనిచేసిన బాబు..తనే సొంతంగా బిర్యానీ సెంటర్ పెట్టాలనుకున్నారు. ఆ తర్వాతే హోటల్ బాబు పేరుతో ఈ రెస్టారెంట్‌ను ఏర్పాటు చేశారు. 2022 ఏప్రిల్‌లో ఈ రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ఓపెన్ చేసిన కొన్ని రోజుల్లోనే ఇక్కడి మటన్ బిర్యానీకి విపరీతమైన క్రేజ్ వచ్చింది... కారణం ఇక్కడ వందశాతం ప్యూర్ మటన్ దొరకడమే. జేబులో రూ.30 పెట్టుకుని ఇంటి నుంచి వచ్చి... రెస్టారెంట్లలో వర్క్ చేస్తూ ఫ్యామిలీని పోషించుకుంటూ.. ఇప్పుడు ఓ పెద్ద హోటల్‌కు యజమానిగా మారాడు బాబు. అంతేకాదు తనతో పాటు మరికొంతమందికి ఉపాధిని కల్పిస్తున్నాడు.
హైదరాబాద్ వెరైటీలు
తమ వద్ద అన్ని రకాల, బిర్యానీలు హైదరాబాద్ స్టైల్లో లభిస్తాయి అంటున్నారు హోటల్ ప్రొప్రైటర్ బాబు. మటన్ బిర్యాని, చికెన్ బిర్యాని, కిచిడి, పాయ, గోటీ గొంగూర, మటన్ కబాబ్, చికెన్ కబాబ్, మటన్ ఫ్రై, చికెన్ ప్రై, బిర్యాని రైస్.. ఇలా ఎన్నో వెరైటీలు ఇక్కడ దొరుకుతాయి. ముఖ్యంగా మటన్ బిర్యానీ ఇక్కడ మస్త్ ఫేమస్.
పొద్దుపొద్దునే బిర్యాని తింటే ఆ కిక్కే వేరప్పా..!
ఉదయం పూట తినడం అంటే కాస్త రొటీన్‌కి భిన్నంగా ఉన్నప్పటికీ పొద్దు పొద్దున్నే బిర్యానీ తింటే ఆ కిక్కే వేరప్ప అంటున్నారు ఫుడ్ లవర్స్. పొద్దునే వివిధ రకాల టిఫిన్ అందరూ తింటారు కానీ బిర్యానీని టిఫిన్‌గా తీసుకోవడం ఓ ప్రత్యేకమైన అనుభూతి అంటున్నారు.
ఉదయాన్నే కింగ్‌లా తినాలి..!
మన పాత తరం వాళ్లంతా అంత పుష్టిగా ఎందుకుండేవాళ్లో తెలుసా..? ఉదయం పూట బలవర్థకమైన ఆహారమే తినేవాళ్లు..! కాలక్రమేణా బ్రిటిష్ వాళ్లు అలవాటు చేసిన టిఫెన్ సంస్కృతి మనం అలవాటు చేసుకున్నాం. కానీ, ఉదయం వేళ రాజులా తినాలి, మధ్యాహ్నం మంత్రిలా, రాత్రి బంటులా తినాలనే సామెత ఉంది. అందువల్ల ఉదయం వేళ తినే ఆహారం సరైనది తింటే... ఆ రోజంతా ఎనర్జీతో పని చెయ్యడానికి వీలవుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు. మటన్ తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయని.., అందులోనూ మటన్ పాయ తినడం మరీ మంచిదంటున్నారు నిపుణులు.
కస్టమర్ల నుంచి విశేష స్పందన
హోటల్ బాబులో బిర్యానీ , నాన్ వెజ్ ఐటమ్స్ చాలా టేస్టీగా అనిపిస్తాయి. ప్రతి రోజు మధ్యాహ్నం ఇక్కడ బిర్యానీ తింటామంటున్నారు. ఇప్పటి వరకు చాలా చోట్ల మటన్ తిన్నాను.. కానీ ఇలాంటి టెస్ట్ తాము ఎక్కడ పొందలేదని అంటున్నారు ఫుడ్ లవర్స్.
త్వరలో ఫ్రాంచైజీలు ఏర్పాటు చేసే ఆలోచన.!
పొద్దునే కేవలం మందు బాబులు మాత్రమే బిర్యానీ తింటారు అనేది అపోహ. ఎవరైనా తినొచ్చు అదేమీ నేరం కాదు అంటున్నారు హోటల్ యజమాని ఇస్మాయిల్. నగరంలో ఇప్పటి వరకు పొద్దు పొద్దున్నే బిర్యానీ లభిస్తుంది అని చాలామందికి తెలియదు. కొంతమంది చాలాసార్లు తినాలి అని అనిపించినా... ఇలాంటి హోటల్ ఒకటి ఉందని తెలియలేదని.. తెలిసినప్పటి నుంచి రెగ్యులర్‌గా ఇక్కడకు వస్తున్నారు. త్వరలో మరికొన్న ఫ్రాంచైజీలు ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
టైమింగ్స్: ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఇక్కడ నాన్‌స్టాప్‌గా బిర్యానీ దొరుకుతుంది.
అడ్రస్ : స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ, ఆంధ్రప్రదేశ్ – 520012
ఫోన్ నెంబర్ : 9492207862
హోటల్‌కు వెళ్లడం ఎలా..?
విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారి మార్గంలో భవానీపురంకు అత్యంత చేరువుగా ఉండే స్వాతి సెంటర్లో హోటల్ బాబు రెస్టారెంట్ ఉంది. బస్టాండ్ నుంచి ఆటోలు, సిటీ బస్సులు అందుబాటులో ఉంటాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.