హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Wonder Kid: చిన్నారి కాదు చిచ్చర పిడుగు.. జీనియస్ అనే పదం కూడా తక్కువే.. టాలెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

Wonder Kid: చిన్నారి కాదు చిచ్చర పిడుగు.. జీనియస్ అనే పదం కూడా తక్కువే.. టాలెంట్ చూస్తే షాక్ అవ్వాల్సిందే

X
ఈ

ఈ బుడతడు మామూలోడు కాదు.. జీనియస్ అనే పదం తక్కువే..

Wonder Kid: ఈ చిన్నారి వయసు నాలుగేళ్లు కాని.. చిచ్చర పిడుగు.. ఈ బుడతడు మామూలోడు కాదు.. జీనియస్ అనే పదం కూడా చాలా తక్కువే.. ఇంతకీ ఈ పిళ్లాడి టాలంట్ ఏంటో తెలిస్తే వావ్ అనాల్సిందే..?

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

Yashwanth, News18, Jaggayyapet 

ఈ చిన్నారికి నాలుగేళ్లు.. పేరు శ్రేయాన్..  ఎన్టీఆర్ జిల్లా చందర్లపాడు మండలం మునగాలపల్లి గ్రామంలోని సెయింట్ లూసీ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో యుకెజీ(UKG) చదువుతున్నాడు. చెన్నైకి చెందిన కలం వరల్డ్ రికార్డ్ ఇనిస్ట్యూట్లో నిర్వహించిన ఆల్ ఇన్ వన్ ప్రోగ్రాంలో చిన్న పిల్లల పోటీలలో అతి చిన్న వయసులోనే పోటీలో పాల్గొని అత్యంత ప్రతిభని అందరి ముందు ప్రదర్శించాడు. కలమ్స్ వరల్డ్ రికార్డును కైవసం చేసుకున్న శ్రేయాన్.  చందర్లపాడుఎస్ఐ రామకృష్ణమాట్లాడుతూ.. ఈ అవార్డు 100 మందిలో ఇద్దరికీ లేదా ముగ్గురికి వస్తుంది అలాంటి అవార్డును తమ కొడుకు శ్రేయాన్ ఫస్ట్ ప్లేస్లో సాధించి గోల్డ్ మెడలను కైవసం చేసుకోవడం తమకుఎంతో ఆనందకరంగా ఉందన్నారు.

పిల్లలకి మనం ఏదైనా బొమ్మను కొని ఇచ్చినప్పుడు చాలామంది దాన్ని పగలగొట్టడం మనం చూస్తూ ఉంటాం. కానీ శ్రేయాన్ అలా కాకుండా బొమ్మని ఏ భాగానికి ఆ భాగంగా విడదీసి అది ఎలా తయారు చేశారు అని గ్రహించి అటువంటి బొమ్మలను తయారు చేయడం వాడిలో ఉన్న గొప్ప ఆలోచన తనను ఆశ్చర్యపరిచిందన్నారు.

శ్రేయాన్ లో ఉన్న సైన్సును తన భార్య గుర్తించి తనకు కావలసిన సైన్స్ పరికరాలను కొని తీసుకొని వస్తుంటే ఎందుకు ఇటువంటి తీసుకుంటున్నావు అని నేను ప్రశ్నించాను... కానీ ఒక తల్లిగా వాడిలో ఉన్న ప్రతిభను గుర్తించి తనను ప్రోత్సహించింది తన భార్యనని తెలియజేశారు.

ఇదీ చదవండి : నెల్లూరు నుంచే పోటీ చేస్తా..? బతికినా, చచ్చినా సింహం లాగా.. మాజీ మంత్రి అనిల్ సంచలన వ్యాఖ్యలు..

ఎన్టీఆర్ జిల్లాలో  2018లో  శ్రేయాన్ జన్మించాడు.  ఇంగ్లీషు రైమ్స్ 20, జంతువులు-35, సముద్ర జంతువులు-8, కీటకాలు-9, పువ్వులు-7, ప్రాథమిక చర్యలు-23, పండ్లు-31, కూరగాయలు-23, శరీర భాగాలు-17, రంగులను గుర్తించి, చెప్పడంలో అతని ప్రతిభకు ప్రశంసలు అందుకున్నాడు.

వాహనాలు-24, ప్రాథమిక ఆకారాలు-7, వృత్తులు-7, సంగీత వాయిద్యాలు-6, క్రీడలు-7, ప్రాథమిక పదాలు-13, భక్తిగీతాలు -2, ఇంగ్లీషులో ప్రతిజ్ఞ, స్టోరీ టెల్లింగ్-1, తెలుగు రైమ్-1, వారాలు -7, నెలలుచెప్పడం కలం ఇన్స్టిట్యూట్ వారిని ఆశ్చర్యపరిచాడు. 21-12-2022. ఈ ఘనత కలాం వరల్డ్ రికార్డ్స్‌లో నమోదైంది.

తన తల్లి దేవయాని చిన్నప్పటి నుండి తనలో ఉన్నటువంటి ప్రతిభను గుర్తించి తనకు కావాల్సిన ప్రోత్సాహాన్ని అందించినట్లు దేవయాని తెలియజేశారు. శ్రేయాన్ ద్వారా తమ స్కూల్ కి ఇంత మంచి పేరు రావడం అనేది చాలా సంతోషంగా ఉందని స్కూలు ప్రిన్సిపాల్ తెలియజేశారు. శ్రేయాన్ స్కూలుకు వచ్చిన కొత్తలో తను చాలా ఇబ్బంది పడ్డాడని తర్వాత స్కూల్లోని అందరు పిల్లలతో కలిసిపోయి అన్ని రకాల కార్యక్రమంలో పాల్గొంటూ తన యొక్క చదువులు కూడా గేమ్స్ తో పాటు చదువులో కూడా ముందుంటూ తనతో పాటు చదువుకుంటున్న విద్యార్థులందరికీ ఒక స్ఫూర్తిదాయకమని స్కూల్ టీచర్స్ తెలియజేశారు.

First published:

Tags: Andhra Pradesh, AP News, Local News, Vijayawada