హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

విజయవాడలో అమ్మమ్మల కాలంనాటి ఆపాలు.. తింటే వదిలిపెట్టరు..!

విజయవాడలో అమ్మమ్మల కాలంనాటి ఆపాలు.. తింటే వదిలిపెట్టరు..!

X
విజయవాడలో

విజయవాడలో ఫుడ్ లవర్స్ ను ఆకట్టుకుంటున్న ఆప్పాలు

Vijayawada: ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా కొత్తగా ఉండాలని స్పెషల్ గా కావాలని కోరుకుంటారు. ప్రతి రోజు ఎప్పుడు తినే టిఫిన్ నే తింటున్నాంఅని చాలా మంది బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. రొటీన్ గా దోస, ఇడ్లి, ఉప్మా, అంటూ అనుకుంటూ వుంటారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ఈ రోజుల్లో ఎవరైనా ఏదైనా కొత్తగా ఉండాలని స్పెషల్ గా కావాలని కోరుకుంటారు. ప్రతి రోజు ఎప్పుడు తినే టిఫిన్ నే తింటున్నాంఅని చాలా మంది బోర్ ఫీల్ అవుతూ ఉంటారు. రొటీన్ గా దోస, ఇడ్లి, ఉప్మా, అంటూ అనుకుంటూ వుంటారు. అందుకేనేమో విజయవాడ (Vijayawada) చిట్టి నగర్లోని లక్ష్మీ నారాయణ, శరదా దంపతులు మరియు మరొక ఇద్దరి సభ్యులు ఆ హోటల్లో పని చేస్తుంటారు. మొత్తం వారి కుటుంబ సభ్యులే.. అమ్మమ్మల కాలం నాటి టిఫిన్ ఇది ఆ రుచిని పరిచయం చేద్దామని వాళ్ళ అమ్మమ్మ, అమ్మ, ఇప్పుడు శారదా అలా దాదాపుగా 80 ఏళ్ళ నుండి ఈ టిఫిన్ సెంటర్ ని నడుపుతున్నారు. వారు మొదటిగా జీవనోపాధి కోసం చిన్నగా హోటల్ పెట్టారు.

అందరి లాగా కాకుండా స్పెషల్ వంటతో ఆకట్టుకోవాలని అనుకుని ఆపం దోశను తయారు చేయడం మొదలు పెట్టారు. చూడటానికి చాలా చిన్నగా ఇరుగ్గా కనిపించినా ఈ టిఫిన్‌ సెంటర్‌లో మాత్రం ఆపాల దోశలు అదుర్స్‌ అని చెప్పొచ్చు. అందుకే నోటిమాటతోనే ఈ సెంటర్‌ ఫేమస్‌ అయిపోయింది. దీనికి తోడు గ్యాస్ పొయ్యి మీద సన్నటి మంటతో దోశ పోసి దాని మీద కాస్త కారం వేసుకుని చల్లటి ఫ్యాన్ కింద ఆపం తింటే ఆహా ఉంటుంది చెప్పడానికి మాటలు చాలవనుకో. ఒకసారి రుచి చూశాక దూర ప్రాంతల వారు మళ్లీ విజయవాడ వచ్చినప్పుడు చిట్టి నగర అప్పం ను రుచి చూడాలని అనిపిస్తుంది. ఒకసారి తిన్నారంటే మాత్రం కచ్చితంగా మళ్లీ మళ్లీ తినాలనిపిస్తుంది.

ఇది చదవండి: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకూ ఈ అప్పం దోశలు దొరుకుతాయి.. ఇక్కడ సాదా అప్పం, కారం అప్పం, పప్పుల‌పొడి అప్పం, ఉల్లిపాయ ఆప్పం ఇలా రకరకాల అప్పాలు దొరుకుతాయి. మొదటి గా వీరు కట్టెల పొయ్యి మీద టిఫిన్ తయారు చేస్తుండేవారు. కానీ చుట్టు పక్కల వారు పొగ ఎక్కువగా వస్తుంది అని చెప్పటంతో మారిన పరిస్థితులకు అనుగుణంగా టిఫిన్ సెంటర్లో గ్యాస్‌ పొయ్యి మీద టిఫిన్ తయారు చేస్తు్న్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు