హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

Vijayawada: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

X
బెజవాడలో

బెజవాడలో బెస్ట్ బిర్యానీ ఇదే..

ఫుడ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందులోనూ నాన్ వెజ్ అంటే పడిచస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాన్ వెజ్ కు ఉండే డిమాండే వేరు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ఫుడ్ అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి. అందులోనూ నాన్ వెజ్ అంటే పడిచస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో నాన్ వెజ్ కు ఉండే డిమాండే వేరు. ఇక విజయవాడలో అయితే నాన్ వెజ్ వెరైటీలకు పెట్టింది పేరు. ముఖ్యంగా బిర్యానీ లాంటి వంటకాలు ఎక్కడైనా దొరుకుతాయి. కానీ ఓ చోట దొరికే బిర్యానీ మాత్రం చాలా స్పెషల్. బిర్యానీ కథే కాదు.. ఆ హోటల్ యజమాని స్టోరి కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఇంతకీ ఆ బిర్యానీ పాయింట్ ఎక్కడుందంటే.. బెజవాడ (Vijayawada) ఫేమస్ బీసెంట్ లోడ్డులో. రాయలసీమ ప్రాంతమైన అనంతపురంకు చెందిన శివ.. ఓ అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకొని సినీ ఫక్కీలో గుంటూరుకి పారిపోయి వచ్చేశాడు.

అందరి మాదిరిగానే ఎన్నో కష్టాలు పడ్డాడు. ఎవరూ పనివ్వకపోవడం, ఇచ్చినా కొన్నిరోజులకే తీసేయడంతో ఇక చేసేది లేక సొంతగానే ఉపాధి వెతుకున్నాడు. తనకు బిర్యానీ వండటం వచ్చు. అందుకే ఇంట్లో మాదిరిగానే బిర్యానీ చేసి ఓ పానీ పూరి బండిపై విక్రయించడం మొదలుపెట్టాడు. ప్లేట్ బిర్యానీ రూ.100కు విక్రయించేవాడు. టేస్ట్ బాగుండటంతో కొద్దిరోజుల్లోనే పేరొచ్చింది.

ఇది చదవండి: విజయవాడలో ఈ ప్లేస్ చాలా ఫేమస్.. ఆసియాలోనే అతిపెద్దది.. మీరూ ఓ లుక్కేయండి..!

బీసెంట్ రోడ్డులోని చిరు వ్యాపారులు, అటువైపు రోజూ వచ్చేవారు శివ బిర్యానీని ఇష్టపడటం మొదలుపెట్టాడు. బిర్యానీలో ఏం మాయ చేశాడో ఏం వేశాడోగానీ బీసెంట్ రోడ్డులో ఫేమస్ అయి కూర్చుంది. ఒక్కసారి అక్కడ బిర్యానీ తింటే రోజూ కావాలనేలా పాపులారిటీ సంపాదించాడు. ఒకప్పుడు పానీపూరి బండిపై రూ.100కు బిర్యాని విక్రయించే శివ.. ఇప్పుడు ఏకంగా హోటల్ తెరిచేశాడు.

ఇది చదవండి: ఈ బిర్యానీకి 40ఏళ్ల హిస్టరీ.. రూ.5తో మొదలై ఇప్పుడు ఇలా..!

ప్రస్తుతం ఒక బిర్యానీ రూ.150కి విక్రయిస్తున్నాడు. అంతేకాదు ఒకప్పుడు పనిలేక రోడ్లపై తిరిగిన శివ.. ఇప్పుడు ఓ నలుగురికి ఉపాధి కూడా కల్పిస్తున్నాడు. క్వాలిటీ, క్వాంటిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకపోవడమే తన బిర్యానీకి ఇంత పేరొచ్చిందని శివ చెబుతున్నాడు.

First published:

Tags: Andhra Pradesh, Biryani, Local News, Vijayawada

ఉత్తమ కథలు