హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Shiva Puja: ఇవాళ చాలా అరుదైన రోజు.. శివుడ్ని దర్శించి పూజిస్తే అన్నీ శుభాలే..!

Shiva Puja: ఇవాళ చాలా అరుదైన రోజు.. శివుడ్ని దర్శించి పూజిస్తే అన్నీ శుభాలే..!

X
శివముక్కోటి

శివముక్కోటి పూజతో అన్నీ శుభాలే

శాస్త్రాన్ని అనుసరించి అనేక పుణ్యతిథులు ఉంటాయి. అయితే జనవరి 6న శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ప్రతి ఒక్కరిని కాపాడేది శివుడు మాత్రమే. ఈ రోజున శివుడికి శివాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం చేస్తారు. శివ ముక్కోటి రోజు శివకేశవులను దర్శిస్తే ఆధ్యాత్మిక సంతృప్తి కలుగుతుంది. శాస్త్రాన్ని అనుసరించి అనేక పుణ్యతిథులు ఉంటాయి. అయితే జనవరి 6న శివ ముక్కోటి నాడు వచ్చే పుణ్యతిథి చాలా ప్రత్యేకం. ఈ పుణ్యతిథి నాడు శివానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ముక్కోటి ఏకాదశి నాడు ఎలా అయితే ఆ విష్ణు మూర్తి, నారాయణుడి అనుగ్రహం కోసం వెళ్తామో.. అలానే ఈ శివ ముక్కోటి రోజున కూడా శివాలయానికి వెళ్తే ఆ ఈశ్వరుడి అనుగ్రహం ఉంటుందని పండితులు చెబుతున్నారు. శివ ముక్కోటి ఎందుకంత ప్రత్యేకం అంటే.. వంద సంవత్సరాల క్రిందట ఏర్పడిన పుణ్యతిథి ఇది.

ఆరుద్ర నక్షత్రం, పౌర్ణమి, శివ ముక్కోటి కలిసి రావడం అనేది చాలా అరుదు. కాబట్టి ఈరోజు చాలా ప్రత్యేకమైన రోజు. పైగా సంపదను సూచించే శుక్రవారం నాడు వచ్చింది. కాబట్టి ఇది భక్తులకు ఎంతగానో ఉపయోగపడే అద్భుతమైన రోజు. వంద ఏళ్ల కొకసారి వచ్చే ఈ అత్యంత పుణ్యతిథి నాడు.. శివాలయంలో ఉత్తర ద్వారం గుండా శివ దర్శనం చేసుకుంటే.. కోటి సార్లు ఈశ్వరాభిషేకం, ఈశ్వర అర్చన చేసినంత పుణ్యం లభిస్తుంది. ఆరుద్ర నక్షత్రం అంటేనే అన్నాభిషేకం. శివుడికి ఎంతో ఇష్టమైన అభిషేకం ఈ అన్నాభిషేకం.

ఇది చదవండి: శివునికి ఏ అభిషేకం చేస్తే ఎలాంటి ఫలితం వస్తుందో తెలుసా..?

ఈ ఆరుద్ర నక్షత్రం రోజున అన్నాభిషేకం చేయడంతో పాటు, అన్నదానం కూడా చేయాలి. శివుడికి,శివ బంధువులకి అన్నదానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు. ఇక ప్రతి రోజూ ఆరుద్ర నక్షత్రం చూడడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని చెబుతున్నారు. శివుడికి స్వచ్ఛమైన ఆవు నెయ్యితో తెల్లవారుజామున అభిషేకం చేస్తే ఎన్నో పుణ్యముల ఫలితంగా చెప్పాలి.

ఇది చదవండి: ఆవుకు ఈ ఆహారం పెడితే ఆదృష్టం మీవెంటే..! అప్పులు, శత్రువులు పరార్..!

మంచి ఆరోగ్యం కోసం అయితే మృత్యుంజయ స్తోత్రం, ఐశ్వర్యం కోసం అయితే శివ పంచాక్షరితో చేయొచ్చు. వివాహం జరగాలనుకునే వారికి పాశుపద మంత్రంతో చేయాలి. ఏమైనా కష్టాలు వస్తే ఆరుద్ర నక్షత్రం రోజున నాటు ఆవు నెయ్యితో అభిషేకం చేయాల్సి ఉంటుంది. పువ్వులతో శివలింగాన్ని తయారు చేసి అర్చన చేస్తే శివానుగ్రహం కలుగుతుంది. నూకలు లేని బియ్యంతో పాయసం చేసి శివుడికి నివేదన చేయాలి.

ఆ తర్వాత ఆ పాత్రను దానం చేయాలి. జన్మరాశి బట్టి ఈశ్వరుడిని పూజిస్తే మంచి ఫలితం కలుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు, అప్పుల బాధలు తొలిగిపోవాలంటే జన్మరాశిని బట్టి శివుడికి ప్రత్యేకమైన అభిషేకం చేస్తే దానికి తగిన ఫలితాలు వస్తాయని చెప్పాలి.శివుడికి తీపి పదార్థాలను నైవేద్యంగా సమర్పించాలి.

First published:

Tags: Andhra Pradesh, Local News, Lord Shiva, Vijayawada

ఉత్తమ కథలు