రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ : విజయవాడ
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో వైసీపీ నేతల మధ్య వర్గపోరు మరోసారి బయటపడింది . ఎన్నికలు దగ్గరకొస్తున్న కొద్దీ నేతల మధ్య ఆధిపత్య పోరు తారాస్థాయికి చేరాయి.కృష్ణా జిల్లా నాగాయలంకలో మరోసారి వైసీపీవాగ్వాదానికి దిగారు. వైసీపీ వర్గీయులు మధ్య మరల వర్గ విభేదాలు వీధికి ఎక్కాయి.
ఇరు వర్గాలు పరస్పరం చెప్పులతో కొట్టుకుంటూ, చెంప దెబ్బలతోదాడి
శనివారం రేమాలవారిపాలెం పంచాయతీలోని మార్కెట్ యార్డు ఆవరణలో నాబార్డు ఛైర్మన్ కె.వి.షాజీ ఆధ్వర్యంలో మత్స్య, డ్వాక్రా సంఘాల సభ్యులకు చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్‌బాబు, ఎంపీ, బాలశౌరి, ఇతర అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కార్యక్రమం అనంతరం ఎమ్మెల్యే రమేష్‌బాబు, ఎంపీ బాలశౌరి వర్గీయుల మధ్య ఏర్పడిన వాగ్వాదం...కొట్లాటకు దారితీసింది. ఇరు వర్గాలు పరస్పరం చెప్పులతో కొట్టుకుంటూ, చెంప దెబ్బలతోదాడికి దిగారు.ఇదిలా ఉండగా అక్కడ జరుగుతున్న గొడవను మొబైల్ లో వీడియో గా తీస్తున్న ఓ జర్నలిస్టు ఫోన్‌ను వైసీపీ నేతలు లాక్కుని పగలగొట్టారు.
ప్లెక్సీ వివాదం మరకముందే
ఈ మధ్య కాలంలో సీఎం జగన్ అవనిగడ్డలోని పర్యటనకు వచ్చిన సమయంలో ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేష్ బాబు వర్గీయుల మధ్య ఫ్లెక్సీల కు సంబంధించిన వివాదం తలెత్తింది. దాన్ని అంతటితో వదలకుండా అదే విషయంపై మరల ఇరువర్గాలు నాగాయలంకలో ఒకరిని ఒకరు దాడులకు దిగారు. జరిగిన గొడవకు ఎమ్మెల్యే రమేష్‌బాబు స్పందిస్తూ ఎంపీ బాలశౌరికి తనకు ఎలాంటి విభేదాలు లేవన్నారు. ఎంపీ బాలశౌరి వెంట వచ్చిన గరికిపాటి శివ ఎవరైతే ఉన్నారో అతని కారణంగానే గొడవ జరిగిందని తెలియజేసారు. తన మనుషులకు చెప్పి జరిగే తోపులాటను ఆపేశామని తెలియజేసారు.
మీడియా ప్రతినిధులపై..
వారికి వారికి మధ్య జరిగిన ఘర్షణలో ఎమ్మెల్యే కి సంబంధించిన వర్గీయులు వారిపై దాడి చేశారని విలేకరులు ఆరోపిస్తున్నారు. ఎక్కడ ఎటువంటి సంఘటనలు జరిగినా వాటిని ప్రజలు ముందుకు తెచ్చేది విలేకరులేనని అది మంచైనా, చెడైనా.వారి విధి నిర్వహణలో భాగంగానే నాగాయలంకలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాన్ని కవర్ చేయడానికి అక్కడ ఉన్న స్థానిక విలేకరులు వెళ్లారు. అయితే ఎమ్మెల్యే, ఎంపీల వారి మనుషులు గ్రూపులుగా ఏర్పడి తగాదాలతో గోడవలు పడుతుండటంతో మీడియా ప్రతినిధులు వీడియో తీయడానికి ప్రయత్నించారు. దానితో ఎమ్మెల్యే కి సంబంధించిన అనుచరులు ఒక్కసారిగా విలేకరుల ఫోన్ లాక్కుని పగులగొట్టారు. దీంతో విలేకరులు అంత కూడా నిరసన వ్యక్తం చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada