K Pawan Kumar, News18, Vijayawada
ఆహార పదార్ధాల్లో దేని ప్రత్యేకత దానిదే...అందులో ధాన్యాల్లో నువ్వుల ప్రత్యేకతే వేరు. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. నల్ల,తెల్ల నువ్వులు.వీటిని అన్ని వంటల్లో కూడా ఉపయోగించటం వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయి. నువ్వులు నూనెగా,తెలగపిండిగా కూడా వాడతారు అలాగే పిల్లలకు మార్నింగ్ సమయంలో పాలల్లో కలిపేహార్లిక్స్ లోను ఈ నువ్వులు పొడిని వాడతారు.
ఈ తెలుపు, నలుపు నువ్వుల్లోపోషకాలు దాదాపు సమానంగా ఉంటాయి. నువ్వులను గానుక చేసిన తర్వాత వచ్చే నూనెలోఒమెగా 6 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన పిండిపదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా నల్ల నువ్వుల్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీహిస్టమైన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని 'పవర్ హౌజ్' అని పిలుస్తారు. నువ్వుల్లో ఐరన్, జింక్, కాల్షియం, థయామిన్, ఇతర మినరల్స్‌తో పాటు విటమిన్ 'ఇ' కూడా సమృద్ధిగా ఉంటాయి.
ఎక్కువ మంది కాల్షియం సమస్యతో బాధపడుతుంటారు.అలాంటి వారు ఎక్కువగా కాల్షియ మాత్రలను వాడుతుంటారు.ఇలా వాడటం చాలా వరకు ఇబ్బంది. దీనికి బదులు కాల్షియం ఉండే పదార్థాలైన ఈ నువ్వులను తినటం ద్వారా చాలా మంచిది..వీటిల్లో 20 శాతం ప్రొటీన్ వుంటుంది. నువ్వుల్లో వుండే ఫైటో స్టెరాల్స్ వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ ఉత్పత్తి తగ్గుతుంది. తెల్ల నువ్వులతో పోలిస్తే నల్ల నువ్వుల్లో ఫైటో స్టెరాల్స్ ఎక్కువగా ఉంటాయి. నల్ల నువ్వుల్లో ఉండే ఔషధ గుణాల వల్ల మహిళల్లో వచ్చే రొమ్ముక్యాన్సర్ ను నివారించటంలో బాగా ఉపయోగపడుతుంది. అలాగే క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
అంతే గాక ఈ నువ్వులు... వివిధ రకాలుగా ఆహర పదార్థాల్లోఉపయోగిస్తూ తినటవలనబ్రెయిన్ క్యాన్సర్ సమస్య ఉండదు. ఈ నువ్వుల ఆయిల్వాడటం వల్ల చాలా తక్కువగా గుండె సంబంధింత వ్యాధులను నివారిస్తాయంటున్నారు నిపుణులు.అంతేగాక శరీరంలో ప్రమాదవశాత్తు గాయాలైనప్పుడు...త్వరగా మానేందుకు ఈ నువ్వుల్లో ఉండే విటవిన్స్చాలా సహాయ సహకారిగా పనిచేస్తుంది.
వీటిని తినటం ద్వారా శరీరంలో పెరుకుపోయిన మలినాలను, అనవసరపు కొవ్వును కరిగించటంలో బాగా ఉపయోగపడుతుంది. అంతేగాక శరీర నిగారింపుకు చక్కని ఔషధంగా పనిచేస్తుంది. చర్మసంబంధిత రోగాలను నయం చేయటంలో కూడా ఉపయోగపడుతుంది.
కేశాలంకరణకు చాలా చక్కగా ఉపయోగపడుతుంది. మధ్య కాలంలో అధిక సంఖ్యలో హెయిర్ పాల్‌తో బాధపడుతున్నారు యువత. వీరు తమ బిజీలైఫ్‌లో పడి సరైన పౌషకాహారాన్ని తీసుకోలేక పోతున్నారు.తద్వారా ఎక్కువ మంది హెయిర్ ఫాల్‌తో బాధపడుతున్నారు. నువ్వుల నూనెను వాడటం వల్ల జుట్టు రాలే సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
అంతేగాక మహిళల్లో రక్తహీనతను తగ్గించేందుకు నువ్వులు చక్కగా ఉపయోగపడతాయి.నీరసంతో బలహీనంగా ఉండేవారు నువ్వులు, బెల్లం కలిపి ఉండలు చేసుకుని తింటే మంచిది. మరి ముఖ్యంగా గర్భీణీలు నువ్వుల విషయంలో డాక్టర్ల సలహా మేరకు వాడటం మంచిది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Health Tips, Local News, Vijayawada