(K Pawan Kumar, News18, Vijayawada)
కృష్ణా నది తీరాన ఇక్కడ ఉన్న కొండలలో ప్రాచీన సంస్కృతికి చారిత్రాత్మక ఆనవాళ్లుగా అనేక గుహలు కనిపిస్తూ ఉంటాయి. అటువంటి వాటిలో ప్రముఖంగా చెప్పుకో దగిన గుహాలలో ఒకటి విజయవాడలోని మొగల్ రాజు పురంకి చెందిన గుహాలు. మొగల్ చక్రవర్తులు సందర్శించినకారణంగా ఈ ప్రాంతానికి మొగల్ రాజ్ పురం అనే పేరు వచ్చిందని చెప్తుంటారు. ఇక్కడ ఐదు ప్రధాన గుహాలు ఉన్నాయి. ఈ గుహాలు మొదట బౌద్ధ భిక్ష ఆరామలుగా ఉండి ఆ తరువాత హైందవ గుహలాయలుగా మార్పు చేసి ఉండవచ్చునని చరిత్రకారులు చెబుతున్నారు.
ఈ గుహలయాల్లో మొదటగా ఉన్న ఇందిరాగాంధీ స్టేడియం పక్క రోడ్ లో ఉన్న గిరిపురం సర్కిల్ పక్కన ఉన్న కొండభాగంలో కనిపిస్తుంది. ఈ గుహని గంగమ్మ, శివుని ఆలయంగా చెప్పుకుంటారు. ఇది కొండ రాతిని తొలిచి తీర్చి దిద్దిన గుహ. అలాగే రెండవ గుహలయం శిఖామణిసెంటర్ లోని కుడి వైపుగా కనిపించే గుహని నటరాజ గృహాలయంగా పిలుస్తారు. కొండను తొలచటం ద్వారా ఏర్పడిన ఖాళీభాగం మూలంగా రెండవ గృహ ఎదురు కాస్తాంత విశాలంగా కనిపిస్తుంది.
అక్కడి నుండి కుడి వైపున ఉన్న సిద్ధార్థ కాలేజీ రోడ్ లో ఉన్నమూడవ గృహ ఉంది. కొండ అంచున దిగువన మలుచబడి ఉంది. ఈ గుహలో నాగేంద్ర స్వామి ప్రతిమ, వినాయకుని ప్రతిమ ఇలా కొన్ని ప్రతిమలు ఉన్నాయి. ఈ చక్కడాలు అన్ని పల్లవుల నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తున్నాయని పురావస్తు శాస్త్ర వ్యక్తులు అభిప్రాయం.
ఈ నాల్గవ గుహ ఉన్న కొండ పైన నాల్గవ గృహ కన్పిస్తుంది. గేటు నుండి లోపలికి వెళ్తే పై నుండి కిందకి చూస్తే కొండ దిగువన ఉన్న ప్రాంతం పురావస్తు శాఖ వారిచే రమణీయమైన ఉద్యాన వనంగా కనిపిస్తుంది. ఎత్తులో రెండు స్తంభాలతో మూడు గదులుగా కనిపిస్తుంది. నాల్గవ గుహ లోపలికి వెళ్లి చూస్తే అలంకృత చక్కడాలు కనిపిస్థాయి.ఈ గుహలో ఒకప్పుడు మునులు తపస్సు చేసుకునే వారని స్థానికులు చెప్పుకుంటూ ఉంటారు.
ఐదవ గుహ ఈ కొండ పక్కాగా బోయపాటి మాధవరావు వీధి వెంబటి కొంచెం దూరం వెళ్లి కావేరి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న సందులో ఉన్న కొండ వైపుగా వెళితే కుడి వైపున కొండ అంచులో ఎదురుగా ఐదవ గుహాలయం కనిపిస్తూ ఉంటుంది. ఆ ఐదవ గుహ ఎదురుగా విశాల మైన ప్రాంగణం కలిగి ఉంటుంది. ఈ ఐదవ గుహ రెండు స్తంబాలతో మూడు గుహాలగా కనిపిస్తుంది. గుహ లోపలికి వెళ్తే అర్ధ మండపం వెనుక గోడను తొలిచి నిర్మించిన మూడు గర్భ గృహాల కనిపిస్తాయి.ఈ గుహ లోపల ఎటువంటి విగ్రహాలు, శిల్పాలు లేకుండా ఖాళీగానే ఉంటుంది. ఇవే మొగల్ రాజ్ పురంలోని ఐదు గుహాలయాల చరిత్రాత్మక విశేషాలు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada