B Yashwanth, News18, Jaggayyapet
ప్రపంచవ్యాప్తంగా మిర్చికి ఎంత పేరు ఉందో అందరికీ తెలిసిందే... ఘాటు మిర్చి అధిక ధర ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మిర్చి సాగు చేయడం ఒక ఎత్తు అయితే తామర నల్లి పడటంతో మిర్చి దిగుబడి లేకుండా పోయింది. దీంతో మిర్చికి డిమాండ్ భారీగా పెరిగింది. అక్కడక్కడ కొంతమంది రైతులకు మాత్రమే ఎకరానికి 10 క్వింటాల దిగుబడి వచ్చింది. వచ్చిన పంటను జాగ్రత్తగా కాపాడుకుంటూ స్టోరేజ్ కుతరలిస్తున్నారు. అయితే మిర్చికి డిమాండ్ ఉందన్న సంగతి తెలుసుకున్న దొంగలు కళ్ళలల్లో ఆరబెట్టిన మిర్చిని దొంగలించే పనిలో పడ్డారు. ఎన్టీఆర్ జిల్లా (NTR District) పెనుగంచిప్రోలు గ్రామానికి చెందిన నలోబోతుల ఏల్లేశ్వరరావు ఎనిమిది ఎకరాల మిర్చి పంటను కోసి స్థానిక తంబరేణి గార్డెన్స్ ఫంక్షన్ హాల్ వెనకాల కళ్ళంలో ఎండబెడుతున్నారు. రాత్రి మిర్చిని కుప్పగా పోసి రాత్రి 10 గంటల వరకు కాపలా ఉన్నాడు.
అర్ధరాత్రి చలి ఉండటంతో ఇంటికి వెళ్లి తెల్లవారుజామున కళ్ళం దగ్గరకు తిరిగి వచ్చి చూస్తే కళ్ళంలోని మిర్చి కొంతతగ్గిపోయి ఉంది. కుప్పలో కొంత భాగాన్ని తీసుకెళ్లినట్లు అర్థమయిదొంగతనం జరిగిందని గ్రహించాడు. ఇదే విషయాన్ని స్థానికులకు చూపించాడు. బంగారం, డబ్బు, విలువైన వస్తువులు మాత్రమే దొంగలించే దొంగలను ఇప్పటివరకు చూశాము.
భవిష్యత్తులో మిర్చి దొంగతనాలను తరచూ చూడవలసి వస్తుందేమో అని రైతులు వాపోతున్నారు. ఏదేమైనప్పటికీ ఇలాంటి దొంగలపై పోలీసు అధికారులు ఓ కన్నేసి ఉంచటం మంచిదని రైతులు వాపోతున్నారు. రూ.40,000 వరకు నష్టపోయినట్లు రైతు తెలిపారు. ఈ దొంగతనంపై పోలీసుల స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేస్తామన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Mirchi market, Vijayawada