నిత్యం ఏదో ఒక చోట దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడు దొంగతనాలు కూడా ఓ ఫ్యాషన్ అయినట్టుంది. మాటల్లోనే పెట్టి.. ఏమరు పాటుకు గురిచేస్తారు.. రెప్పపాటున దొంగతనం చేసేసి ఉంటారు. అంతే ఓ గంటపాటు ఇటుపాటున లేకపోయేసరికి అల్లంతా గుల్ల చేసేస్తారు. తాజాగా పట్టపగలే ఓ ఇంటిని దోచేసిందో దొంగలముఠా. ఈ ఘటన కృష్ణా జిల్లా (Krishna District) గన్నవరం (Gannavaram) లో జరిగింది. గన్నవరం రామ్ నగర్ కి చెందిన ఓ ప్రైవేటు ఉద్యోగి అవ్వారు నరేష్ బాబు. ఇతను వారం అంతా ఆఫీస్ కి వెళ్లి వస్తుంటారు. కాస్తాంత సమయం ఒక ఆదివారమే.. ఆ రోజు కూడా పుట్టింటికి వెళ్లిన భార్యను తీసుకురావటానికి ఉదయం పది గంటలకు వెళ్లాడు.
నరేష్ మధ్యాహ్నం 3.30 గంటలకు తిరిగి వచ్చేసరికి ఇల్లంతా చెల్లచెదురుగా పడిఉంది. కంగారుగా వచ్చి చూసే సరికి వెనుకవైపు ఉన్న తలుపులు తెరిచి ఉన్నాయి. ఏమి జరిగి ఉంటుందని కాసేపు సందిగ్ధంలో ఉండిపోయాడు. అయితే ఇంట్లో మాత్రం ఒక్కటే నీసు కంపు... గుడ్లులన్నీ పగులిపోయి కిందపడి ఉన్నాయి. అయితే పాపం నరేష్ బాబుకు ఏమి జరిగిందో తెలియక తలపట్టుకున్నాడు. చివరికి బెడ్ రూమ్లో ఉన్న బీరావా ఓపెన్ చేసి అందులోని బట్టలన్నీ చిందరవందరగా పడేసి ఉన్నాయి. అందులో ఉన్న బంగారం, డబ్బు, విలువైన సామాగ్రి కనిపించలేదు.
దీంతో దోపిడీ జరిగిందని భావించి పోలీసులకు సమాచారం అందించాడు. అయితే ఇళ్లు మొత్తం గుడ్లతో పగులకొట్టటంతో గంజాయి బ్యాచ్ మత్తులో ఈ చోరికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇదిలా ఉండగా... ఓ వైపు చోరికి గురైన ఇంటి సమీపంలో ఓ వ్యక్తి అనుమానస్పందంగా తిరుగుతుండగా.. పక్కంటి వాళ్లు గమనించి నిలదీశారు. అయితే ఆ వ్యక్తి మాత్రం పిల్లులు పట్టుకునేందుకు వచ్చానని చెప్పి తప్పించుకుపోయాడు.
అప్పటికే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీంతో వివరాలు సేకరించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాదు ఘటన జరిగిన నరేష్ ఇంటికి సమీపంలో ఓ ఒంటరి మహిళ ఇంట్లోను అదే సమయంలో నగదు చోరికి గురి అయింది. ఆమె ఫిర్యాదు మేరుకు పోలీసులు మరో కేసు నమోదు చేసుకున్నారు. అదివారం కావడంతో అందరూ ఇళ్ల దగ్గరే ఉంటారి. అలాంటిది పట్టపగలు దోపిడీ జరుగుతుంటే చుట్టుపక్కలవాళ్లకు తెలియలేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Local News, Vijayawada