Home /News /andhra-pradesh /

VIJAYAWADA THEFT GANG FROM GUJARATH CHALLENGING AP POLICE AS 5 ROBBERIES HAPPENED WITHIN EIGHT DAYS IN VIJAYAWADA SURROUNDINGS FULL DETAILS HERE PRN

Cheddi Gang: అర్ధరాత్రి 2 గంటలకు వస్తారు.. 10 నిముషాల్లో పనిముగిస్తారు.. ఏపీలో దొంగల ముఠాల హల్ చల్..

విజయావాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

విజయావాడలో చెడ్డీ గ్యాంగ్ హల్ చల్

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దొంగల ముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాలో (Guntur District) గత ఎనిమిది రోజుల్లో ఐదుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) శివారు ప్రాంతాల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి.

ఇంకా చదవండి ...
  ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో దొంగల ముఠాలు బెంబేలెత్తిస్తున్నాయి. పోలీసులకు సవాల్ విసురుతూ వరుస చోరీలకు పాల్పడుతున్నాయి. ఒక్క కృష్ణా, గుంటూరు జిల్లాలో (Guntur District) గత ఎనిమిది రోజుల్లో ఐదుచోట్ల దొంగతనాలకు పాల్పడ్డారు. ముఖ్యంగా విజయవాడ (Vijayawada) శివారు ప్రాంతాల్లో దోపిడీలు ఎక్కువగా జరుగుతున్నాయి. తాడేపల్లిలోని ఓ ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేకు చెందిన విల్లాలో దొంగతనానికి యత్నించారు. సీసీ ఫుటేజీలు, అనుమానితుల ఫోటోలు దొరికినా, నిత్యం నిఘా ఉంచినా దొంగల ముఠాలు మాత్రం పోలీసులకు చిక్కకుండా సవాల్ విసురుతున్నాయి. తాజాగా విజయవాడ శివారులోని పోరంకిలోని ఓ గేటెడ్ కమ్యునీటిలో రెండిళ్లలో చోరీలకు పాల్పడ్డారు. పక్కా స్కెచ్ తో టైమ్ చూసుకొని వస్తున్న దొంగల ముఠాలు.. ఎవరికీ అనుమానం రాకుండా పనికానిస్తున్నారు.

  ఈ దొంగల ముఠాలు అర్ధరాత్రి 2-3 గంటల మధ్య దొంగతనాలకు పాల్పడుతున్నారు. ఇటీవల జరిగిన దొంగతనాలన్ని 2 నుంచి 2.30 గంటల మధ్యే జరిగాయి. ఆ సమయంలో పోలీసుల పహారాగానీ, జన సంచారం గానీ తక్కువగా ఉండటం, అలాగే ప్రజలు కూడా గాఢ నిద్రలో ఉండటం వారికి కలిసొస్తోంది. శివారు ప్రాంతాలు, రైల్వే ట్రాక్ సమీపంలోని ఇళ్లు, జనసంచారం తక్కువగా ఉండే ఇళ్లు, అపార్ట్ మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలను వీరు ప్రధానంగా టార్గెట్ చేసుకుంటున్నారు. తొలుత నిర్మానుష్య ప్రాంతాలను ఎంచుకొని చీకట్లో మకాం వేస్తారు. ఆ తర్వాత టైమ్ చూసుకొని తాళాలు వేసి ఉన్న ఇళ్లలో దోపిడీకి పాల్పడతారు. ఆ సమయంలో ఎవరైనా ప్రతిఘటించినా, ఎదురుపడినా వారి వద్ద ఉన్న రాళ్లు, ఆయుధాలతో దాడి చేస్తారు. ఒక్కోసారి చంపడానికి కూడా వెనుకాడరు.

  ఇది చదవండి: అమ్మో ఈమె మామూలు మహిళ కాదు.. ఒకేసారి ముగ్గురితో ఎఫైర్.. అందులో ఒకడ్ని దారుణంగా..


  ఐతే ఇప్పటివరకు సీసీ ఫుటేజ్ ద్వారా సేకరించిన దొంగల ముఠా ఫోటోలను ఏపీ పోలీసులు వాటిని విశ్లేషించి కీలక ఆధారాలు రాబట్టారు. వారి కదలికలు, పోలికలు, ప్రవర్తన వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఇతర రాష్ట్రాలకు చెందినవారై ఉంటారనే నిర్ణయానికి వచ్చారు. అలాగే దొంగతనాలు చేస్తున్న పద్దతులు, టైమ్ వంటి వాటితో పాటు, సీసీ ఫుటేజ్ నుంచి సేకరించిన ఫోటోలు, వీడియోలను మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులకు పంపారు. వీరిలో గుజరాజ్ పోలీసులు వారు అక్కడకివారేనని స్పష్టతనిచ్చినట్లు తెలుస్తోంది. ఈ ముఠాలు గుజరాత్ లోని దాహోద్ ప్రాంతం నుంచి వచ్చినట్లు భావిస్తున్నారు. వీరిని పార్థీగ్యాంగ్ గా సమాచారమిచ్చినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: పెళ్లై 9ఏళ్లైనా ప్రియుడ్ని వదలని భార్య.. భర్త నచ్చజెప్పినా వినలేదు.. చివరకి..


  ఇప్పటికే విజయవాడ పోలీసులు ఏపీ, తెలంగాణల్లో ఇతర ప్రాంతాల్లో దొంగతనాల కేసుల్లో అరెస్ట్ చేసిన వారి ఫోటోలతో పోల్చిచూశారు. ఈ ముఠాలు మధ్యప్రదేశ్ నుంచి కూడా వచ్చి ఉండొచ్చని కూడా భావిస్తున్నారు. దీంతో ఆయా ప్రాంతాలకు ప్రత్యేక బృందాలను పంపే అవకాశముంది. మరోవైపు రెండు రోజులకోసారి చోరీ జరుగుతుండటం, ఈ ముఠాలు రైల్వే ట్రాక్ ల వద్ద సంచరించే అవకాశముంటడంతో ఆయా ప్రాంతాల్లో నిఘా ఏర్పాటు చేశారు.

  ఇది చదవండి: కూతురి పెళ్లికి అన్ని ఏర్పాటు చేసిన తండ్రి.. కానీ ఆమె ఇలా చేస్తుందని అస్సలు ఊహించలేకపోయాడు..


  దొంగల ముఠాలు అర్ధరాత్రి లేదా నిర్మానుష్యమైన ప్రాంతాల్లో పగటి పూటే వచ్చి తలుపులు కొట్టడం, అవసరముందని దీనంగా అడగడం వంటివి చేసి దోపిడీలకు పాల్పడతారు. అపరిచిత వ్యక్తులుగానీ, అనుమానాస్పద వ్యక్తులు గానీ కనిపిస్తే వెంటనే తమకు సమాచారమివ్వాలని పోలీసులు పిలుపునిస్తున్నారు. అలాగే అర్ధరాత్రి అపరిచిస్తులు వస్తే వెంటనే తలుపులు తీయవద్దని.. వారి గురించి పూర్తిగా తెలుసున్న తర్వాతే స్పందించాలని సూచిస్తున్నారు.

  (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Crime news, Theft, Vijayawada

  తదుపరి వార్తలు