రిపోర్టర్ :పవన్ కుమార్ న్యూస్18
లొకేషన్ :విజయవాడ
దొంగలు దొంగతనం చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాక అది ఎవరి ఇల్లా , అని చూడరు అది మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినవారి పనిలో వారు ఉంటున్నారు. తాళాలు వేసిన ఇంటినే అదును చేసుకొని దొంగతనానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లా పామర్రు ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ నివాసంలో దొంగతనం జరిగింది.
ఆయన స్వస్థలం బాపులపాడు మండలం శేరీనరసన్నపాలెంలోని ముందడుగు కాలనీలో ఇంట్లోకి ప్రవేశించిన దుండగులు కాస్త అటు ఇటు గా సుమారుగా మూడు లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. అనిల్ తల్లిదండ్రులు దొంగతనం జరిగిన ఇంట్లో నివసిస్తుంటారు. వారు నివాసం ఉండే ఇంటికి 15 రోజుల కిందట తాళం వేసి పామర్రు వెళ్లారు తల్లిదండ్రులు. పామర్రు లో ఎమ్మెల్యే అనిల్ ఇంట్లో నివాసం ఉంటున్నారు.
శుక్రవారం ఉదయం ఇంటిని శుభ్రం చేయడానికి వెళ్లిన పనిమనిషి తలుపులు తెరిచి ఉండటం గమనించి దొంగతనం జరిగినట్లుగా గుర్తించి ఎమ్మెల్యే తల్లిదండ్రులు కి సమాచారం ఇచ్చింది. వారు వెంటనే వీరవల్లీ పోలీసులుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు రంగంలోకి దిగారు. ఇంటి కింద ఉన్న పడక గదిలో గతంలో విండో ఏసీ వుండేది. దానిని తీసేసిన తర్వాత కిటికీకి ఉండే ఖాళీని కనిపించకుండా ఉండేదుకు కిటికీకి అడ్డంగా చెక్క కొట్టారు. దొంగలు ఎంతో తెలివిగా ఎవరు లేని సమయంలో వచ్చి కిటికీ ఉన్న చక్కని తొలగించి లోపలికి ప్రవేశించారు.
రెండో అంతస్తులో, బీరువాలు, షెల్ఫ్ లు అన్ని చిందరవందరగా చేసేసారు. వంట గదిలో ఉన్న సామగ్రిని కూడా వదలకుండా నగదు కోసం గాలించారు. ఇంట్లో ఎక్కడ చూసినా అంతగా నగదు లేదని...దాదాపుగా ఎనిమిది కాసుల బంగారం మాత్రం అపహరణకు గురైనట్లుగా భావిస్తున్నట్లుగా ఎమ్మెల్యే సోదరుడు జగదీష్ తెలిపారు.గన్నవరం డిఎస్పీ విజయపాల్, సీసీఎస్, డిఎస్పీ, గోపాల్ కృష్ణా, ఆధ్వర్యం లో వీరవల్లి ,హనుమాన్ జంక్షన్ పోలీసులు , క్లూస్ టీం సాయంతో వేలిముద్రలను సేకరించినట్టు తెలిపారు. ఘటన స్థలానికి చేరుకుని నిందితుల జాడ తేల్చుకునేందుకు మరిన్ని ఆధారాలు సేకరిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Local News, Vijayawada