హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: జామసాగుతో జాతకం మారిపోవడం ఖాయం. కళ్లుచెదిరే లాభాలు

Vijayawada: జామసాగుతో జాతకం మారిపోవడం ఖాయం. కళ్లుచెదిరే లాభాలు

X
జామసాగుతో

జామసాగుతో లాభాలు

Andhra Pradesh: జామ చెట్టు పెద్దగా గుబురుగా పెరుగుతుంది.ఈ జామ పంట ని భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు. జామ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.జామ 150 నుండి 200 గ్రా బరువుతో ఉంటాయి.ఈ జామ పండులో విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు కాలిరిలు తక్కువ ఉంటాయి.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Andhra Pradesh, India

రిపోర్టర్:పవన్ కుమార్ న్యూస్18

లొకేషన్: విజయవాడ

ఫ్రూట్స్ అన్నింటిలో కెల్ల పేదవాడి ఆపిల్ గా జామపండుకు ఒక ప్రత్యేకత ఉంది. ఎక్కువ పోషకాలు కలిగిన జామపండ్లు తక్కువ ధరకే మార్కెట్లో లభిస్తూ ఉంటాయి. దేశి జాతుల రకాలతో కలిపి ఎన్నో వెరైటీలు తెలుగు రాష్ట్రాల్లో లభిస్తున్నాయి. అందులో పోషక విలువలు అధికంగా ఉండే జామకు డిమాండ్ మరింత ఎక్కువగా ఉంది. సేద్యం పరంగా చూసుకున్నా జామ సాగు రైతులకు లాభసాటిగా ఉంటుంది. చాలా తక్కువ నీటి వినియోగంతో ఎక్కువ లాభాలు కలిగే ఈ జామ పంట సాగువైపు చాలా మంది రైతులు ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య పంటలను వేసి నష్టాలను చూసిన వారికి ఈ జామ సాగు ఒక మంచి మార్గం కూడా అవుతుందని చెప్పవచ్చు. కరోనా తర్వాత పండ్ల వినియోగం పెరిగింది. దీంతో జామకూ డిమాండ్‌ పెరిగింది.

జామ చెట్టు పెద్దగా గుబురుగా పెరుగుతుంది.ఈ జామ పంటని భారతదేశంలో అన్ని ప్రాంతాల్లో సాగు చేస్తారు. జామ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.జామ 150 నుండి 200 గ్రా బరువుతో ఉంటాయి.ఈ జామ పండులో విటమిన్ సి కలిగి ఉంటుంది. ఇందులో కొవ్వు క్యాలర్సీతక్కువ ఉంటాయి.

నాట్లు వేసే సమయం లో మొక్కకు మొక్కకు మధ్య అంతరం 5 నుండి 8 మీటర్లు ఉండేలా చూసుకోవాలి. ఈ కచ్చితమైన అంతరం ద్వారా నీటి పారుదల సాఫీగా సాగి మొక్కల పునరుత్పత్తి వ్యవస్థ మెరుగ్గా ఉండి ఎక్కువ పంట చేతికి వస్తుంది.దానితో పాటుగా సేంద్రీయ పదార్థాలను భూమి పొరల్లో చొప్పించడం వల్ల ఆరోగ్య వంతమైన పంట పండి ఊహించిన దానికంటే మెరుగైన దిగుబడి పొందవచ్చు

అలాగే పెట్టుబడులు తక్కువ లాభాలు ఎక్కువ అంటే ఎకరానికి 10 వేలు పెట్టుబడి పెడితే లక్ష వరకు ఆదాయం వస్తుందట. విజయవాడ తాడి గడపలోరైతుబసవయ్య ఎకరాకు 500 వందల చెట్లు వేశారని చెప్పారు.అలాగే జామ కాపు మూడు నుండి నాలుగు నెలలు వరకు ఉంటుందని చెప్పారు. ఈ బసవయ్య అనే రైతు 15 సంవత్సరాల క్రితం ఒక్కసారే ఈ పంటను వేసినట్లు చెప్పారు. పంట చేతికి వచ్చాక కాయ కొయ్యడానికి కేవలం నలుగురు మాత్రమే ఈ కాయలను కోసినట్లు చెప్పుకొచ్చారు.మొత్తం మీద బసవయ్య కు ఈ జామ పంట వలన లాభం ఉందనే చెప్తున్నారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Vijayawada

ఉత్తమ కథలు