Protest in AP: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం (Andhra Pradesh Government) పై అన్ని వర్గాలు ఏదో ఒక రూపంలో తమ నిరసన గళం వినిపిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఉద్యోగులు సర్కార్ పై సమరం ప్రకటించారు. నిరుద్యోగులు, యువత ఇతర గ్రాడ్యుయేట్లు ఓటు అనే అస్త్రంతో జగన్ సర్కార్ కు షాక్ ఇచ్చారు. అలాగే లాయర్లు (Advocates) సైతం ఆందోళన బాట పట్టారు. మరోవైపు అంగన్వాడీ సిబ్బంది సైతం పోరుబాట పట్టింది. అంగన్వాడీ ఆయాలు, టీచర్లు సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర వ్యాప్త ఉద్యమంలో భాగంగా విజయవాడ (Vijayawada)లో సోమవారం చలో అసెంబ్లీ ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనకుండా జిల్లాలో పోలీసులు రైల్వే స్టేషన్లో, ఆర్టీసీ బస్టాండ్ లో అంగన్వాడిలను నిర్బంధింఛారు. తెల్లవారు నుంచే అంగన్వాడి మహిళలను పోలీస్ స్టేషన్లకు తరలించి వారిని స్టేషన్లోనే రాత్రి నిబంధనలకు విరుద్ధంగా నిర్బంధిస్తున్నారు. బస్టాండ్, రైల్వే స్టేషన్లలో అడ్డుకుంటున్నారు. దీంట్లో భాగంగా వేలాదిమంది అంగన్ వాడీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారు. రైల్వే స్టేషన్, బస్లాండ్, ధర్నాచౌక్, ప్రకాశం బ్యారేజ్, రామవరప్పాడు ప్రాంతాల్లో పోలీసులు భారీగా మోహరించారు. అరెస్ట్ చేసిన అంగన్వాడీ కార్యకర్తలను అరెస్ట్ చేసి భవానీపురం, సూర్యాపేట, గవర్నర్ పేట పోలీస్ స్టేషన్లకు తరలిస్తున్నారు.
అయితే తాము విజయవాడకు వెళ్లడం లేదని.. లిఖిత పూర్వక హామీ ఇస్తేనే వెనక్కు పంపిస్తున్నారు. లిఖిత పూర్వక హామీ ఇచ్చేందుకు నిరాకరించిన వారిని స్టేషన్లోనే నిర్బంధిస్తున్నారు. ఇప్పటికే 3 వేలమందికి పైగా అంగన్వాడీలను నిర్బంధించడంతో ఉద్యమం మరింత ఉద్రిక్తంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అంగన్ వాడీల ఆందోళనకు మద్దతు తెలిపిన టీడీపీ లీడర్లను కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ లు చేశారు. వైసీపీ ప్రభుత్వం అంగన్వాడీలకు ఇచ్చిన డిమాండ్లను అమలు చేయాలని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు. దీంతో అంగన్వాడీల పట్ల పోలీసులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి : నేనేమీ గౌతమ బుద్దుడిని కాదు.. టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ రూలింగ్
ఈ ఆందోళనల్లో భాగంగా జరిగిన ఓ ఘటన కలకలం రేపింది. అంగన్వాడీ సిబ్బంది అయన తన భార్యను రైలు ఎక్కించేందుకు భర్త వీర్వో రైల్వే స్టేషన్ కు వెళ్లారు. అదే సమయంలో ఓ మహిళా కానిస్టేబుల్.. ఆ భార్య భర్తలను అడ్డుకుంది.. ట్రైన్ ఎక్కడానికి వీళ్లేదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఆవేశంతో రగిలిపోయిన ఆ వీఆర్వో మహిళా కానిస్టేబుల్ చెంపపై కొట్టినట్టు తెలుస్తోంది. అయితే ఆమె కూడా ఆవేశంగా వీర్వో చేయి కొరికినట్టు స్థానికులు చెబుతున్నారు. ఇద్దరిపైనా కేసులు నమోదు అయ్యాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, AP News, AP Politics, Vijayawada