హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

సర్కార్ పై టీచర్ల వార్.. ధర్నా కూడా చేయనివ్వరా..?

సర్కార్ పై టీచర్ల వార్.. ధర్నా కూడా చేయనివ్వరా..?

విజయవాడలో టీచర్ల ధర్నా

విజయవాడలో టీచర్ల ధర్నా

ఏపీలో ప్రభుత్వానికి టీచర్లకు మధ్య జీతాల పంచాయతీ కొనసాగుతోంది. సీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ, జీతాల బకాయిలు ఇవ్వాలంటూ పోరాటం చేస్తున్నారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada | Andhra Pradesh

K Pawan Kumar, News18, Vijayawada

ఏపీలో ప్రభుత్వానికి టీచర్లకు మధ్య జీతాల పంచాయతీ కొనసాగుతోంది. సీపీఎస్ రద్దుతో పాటు పీఆర్సీ, జీతాల బకాయిలు ఇవ్వాలంటూ పోరాటం చేస్తున్నారు. తమకు ప్రభుత్వం ఇవ్వాల్సిన డబ్బులను వెంటనే ఇవ్వాలని విజయవాడలో ప్రశాంతంగా ఆందోళనలు చేశారు. అలా చేసిన ఉపాధ్యాయులపై ప్రభుత్వ ఉక్కు పాదం మోపుతుంది. దాదాపుగా 1800 కోట్ల రూపాయలు ఉపాధ్యాయులకు చెల్లించాలని అలా చెల్లించవలసిన బకాయిలును వెంటనే ఇవ్వాలని కోరుతూ UTF ఆధ్వర్యంలో విజయవాడలో ఉపాధ్యాయుల ఆందోళనకు అనుమతి ఇచ్చినట్టే ఇచ్చి నేతలను పోలీసులు దౌర్జన్యంగా అరెస్టు చేశారు. అరెస్టు చేసిన వారిని అందరిని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్​కు తరలించారు. అరెస్ట్ అయిన ఉపాధ్యాయులు అందరిని స్టేషన్​లో సీఐటీయూనేత సిహెచ్ బాబురావు పరామర్శించారు. అయితే ప్రభుత్వ నిర్బంధాన్ని బాబూరావు ఖండించారు.

ఉపాధ్యాయులకు పి.ఎఫ్లోన్లు, ఏపీజిఎల్ఐసి లోన్లు,మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు, పిఆర్సి బకాయిలు, రిటైర్ అయిన వారికి చెల్లించవలసిన బకాయిలు, డిఏ బకాయిలు అని మొత్తం ఉపాధ్యాయులకి ఇవ్వాల్సిన 1800 కోట్ల రూపాయలు వరకు ప్రభుత్వం వాడుకుంది. ఉపాధ్యాయులకు ఏడాదిన్నర నుండి లోన్లు కోసం దరఖాస్తులు పెట్టినా, మంజూరు చేయటం లేదు.ఈ బకాయలు అన్నిటినీ వెంటనే చెల్లించాలని కోరుతూ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ( యుటిఎఫ్ ) ఆధ్వర్యంలో విజయవాడలో ధర్నా చౌక్లో ధర్నా చేశారు.

ఇది చదవండి: బెజవాడలో బెస్ట్ స్వీట్స్ దొరికేది ఇక్కడే..! ధర కూడా తక్కువే..!

ఈ ధర్నాకు పోలీసులు ముందస్తుగా అనుమతించి కూడా షామియానాలు అన్ని తొలగించి, ఉపాధ్యాయు నేతలందరిని అరెస్టు చేశారు. అరెస్ట్ అయినవారిలో ఎమ్మెల్సీ కెఎస్.లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు నక్కా వెంకటేశ్వరరావు, ప్రసాద్ వీరంతా ఉన్నారు.అరెస్టు అయిన వారిని అందరిని అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్లో నిర్బంధించారు. స్టేషన్ లో నిర్బదించిన వారి అందరిని బాబురావు తదితర ప్రజా సంఘాల నేతలు అజిత్ సింగ్ నగర్ పోలీస్ స్టేషన్కు పరామర్శించారు.

ఇది చదవండి: బెజవాడ బెస్ట్ బిర్యానీల్లో ఇదీ ఒకటి..! అడ్రస్ ఎక్కడంటే..!

ఉపాధ్యాయులు అంత కూడా ప్రశాంతంగా ఆందోళన చేస్తున్న వారిని అరెస్టు చేయటం దుర్మార్గం అని ఇలా అరెస్టు చేయడం కరెక్ట్ కాదని బాబురావు అన్నారు. ఉపాధ్యాయులు అడిగిన వాటికి సమాధానం చెప్పలేక ప్రభుత్వం ఇలా చేస్తుంది. ఉపాధ్యాయుల వేతనాల నుండి మినహాయించిన డబ్బును కూడా ప్రభుత్వం వినియోగించుకుంది ఇలా చేయడం సిగ్గుచేటు అని బకాయిలు చెల్లించాలని అడిగిన వారిని అరెస్టు చేయటం ఏంటి అని బాబూరావు ఆగ్రహం వ్యక్తం చేసారు.

ధర్నా చేయడానికి ముందుగా అనుమతి ఇచినట్టే ఇచ్చి మరల ధర్నా చేయకుండా అడ్డుకొని అక్రమంగా స్టేషన్ లో నిర్బంధించారు. ఎంతమందిని అయితే అరెస్ట్ చేసారో ఆ ఉపాధ్యాయ నేతలను అందరిని వెంటనే విడుదల చేసి ఉపాధ్యాయులకు న్యాయమైన కోర్కెలను పరిష్కరించాలని బాబూరావు కోరారు.

First published:

Tags: Andhra Pradesh, Local News, Teachers, Vijayawada

ఉత్తమ కథలు