హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

AP Politics: రాష్ట్రానికి ఇదేం కర్మ.. రెండు పార్టీల నినాదం అదే.. పేలుతున్న మాటల తూటాలు

AP Politics: రాష్ట్రానికి ఇదేం కర్మ.. రెండు పార్టీల నినాదం అదే.. పేలుతున్న మాటల తూటాలు

X
వైసీపీ-

వైసీపీ- వైసీపీ మధ్య మాటల యుద్ధం

AP Politics: ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల వేడి కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల తూటలు పేలుతున్నాయి. తాజాగా ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Vijayawada, India

K Pawan Kumar, News18, Vijayawada

ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో  ఎన్నికల వేడి కనిపిస్తోంది. ముఖ్యంగా అధికార వైసీపీ (YCP), ప్రతిపక్ష తెలుగు దేశం (Telugu Desam) మధ్య మాటల తూటాలు పీక్ కు  చేరాయి. దీంతో ఇటు ప్రధాన ప్రతిక్షం రాష్ట్రానికి ఇదేం ఖర్మ అంటూ ఆందోళనలు చేస్తుంటే..? వైసీపీ సైతం ఇదేం ఖర్మ బాబు అంటూ కౌంటర్ నినాదాలు చేస్తున్నారు. ఇలా రెండు పార్టీలు ఒకే నినాదంతో పోటీ పోటీ ఆందోళనలు చేపడుతుండడంతో రాష్ట్రంలో రాజకీయం రచ్చ రచ్చ అవుతోంది. ఎన్టీఆర్ జిల్లా (NTR District) జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో రాష్ట్రానికి ఇదేం కర్మ కార్యక్రమం ప్రారంభించిన టీడీపీ జాతీయ కోశాధికారి శ్రీరామ్ తాతయ్య (Sriram Tatayya) . వీరితో పాటుగామండల నాయకులు కార్యక్రమంలో పాల్గొని ఇంటింటికి తిరిగి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై వారి నుంచే నివేదిక తయారు చేస్తున్నారు.

ప్రజలతో వాట్స్అప్ కాల్ మిస్డ్ కాల్ చేయించి .. తాతయ్య ప్రజల సమస్యలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ వైైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని విధాల నాశనం అయిందని ప్రజలు అనేక రకాల సమస్యలతో సతమతమవుతున్నారని ఆ విషయాన్ని స్వయంగా వారే వెల్లడిస్తున్నారని తెలిపారు. నియోజకవర్గంలో మొదటగా ప్రారంభించిన ఈ కార్యక్రమానికి నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరయ్యారు.

జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ప్రజలు రాష్ట్రానికి ఇదేం ఖర్మ బాబు అని బాధపడుతూ ఉన్నారని మాజీ శాసనసభ్యులు శ్రీరామ్ రాజగోపాల్ గారు తెలిపారు.  టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం జగ్గయ్యపేట మండలం తిరుమలగిరి గ్రామంలో ఇదేం ఖర్మ రాష్ట్రానికి అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఇదీ చదవండి : మొదలైన వైసీపీ ఆకర్ష్.. టీడీపీ నేతల జాబితా సిద్ధమైందా..? త్వరలో భారీగా వలసలు..!

మూడున్నర సంవత్సరాల కాలంలో అన్ని వర్గాల వారు ఇబ్బంది పడుతున్నారని నిత్యవసర సరుకులు, ధరలు పెరగటం, ఆర్టీసీ చార్జీలు పెంపు, గ్యాస్ ధరలు పెరగటం, ప్రత్యేకంగా యువతకు ఉపాధి కరువైందని యువత ఉద్యోగాలు లేవు, కొత్త ఇండస్ట్రీలు, ఐటీ సంస్థలు లేక వారు ఉద్యోగాలు లేని పరిస్థితిలో ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోవడం జరిగిందన్నారు.

ఇదీ చదవండి : న్యూ ఇయర్ తొలి రోజు ఇలా చేయండి.. ఏడాది మొత్తం మీ దగ్గర డబ్బేడబ్బు

ఆడ పిల్లల భద్రతకు రక్షణ లేదని, దిశ యాప్ పెట్టామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి అది ఎలా ఉపయోగ పడిందో తెలపాలని, ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు ఇసుక లేకపోవడం వలన చాలామంది ఇబ్బందులు పడ్డారని, నాడు ఎన్నికల సమయంలో పూర్తిగా మద్యపానం నిషేధం చేస్తానని నేడు మద్యం తోనే జేబులు నింపుకోవడం జరుగుతుందని, రైతాంగానికి గిట్టుబాటు ధరలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని అన్ని వర్గాల వారు కూడా ఇదేంఖర్మ రాష్ట్రానికి అని వాపోతున్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని.. వచ్చిన వెంటనే అందరని సంతోషంగా ఉండే విధంగా చూస్తామని రాజగోపాల్ తాతయ్య ప్రజలకు హమీ ఇచ్చారు..

First published:

Tags: Andhra Pradesh, AP News, AP Politics, TDP, Ycp

ఉత్తమ కథలు