Home /News /andhra-pradesh /

VIJAYAWADA TDP LEADER NARA LOKESH WROTE A LETTER TO CM JAGAN REQUEST TO 10TH AND INTER EXAMS CANCEL OR POSTPONED NGS

AP Corona: ఏపీలో టెన్త్, ఇంటర్ పరీక్షలు రద్దు. వేచి చూడడం కంటే విద్యార్థుల ఆరోగ్యమే ముఖ్యం. సీఎంకు లేఖ రాసిన లోకేష్

ఏపీలో పరీక్షలు రద్దు చేయాలంటే లోకేష్ లేఖ

ఏపీలో పరీక్షలు రద్దు చేయాలంటే లోకేష్ లేఖ

ఏపీలో కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకూ కేసుల సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతున్నాయి. ముఖ్యంగా చాలా వరకు విద్యా సంస్థలు కరోనాకు హాట్ స్పాట్ జోన్ లుగా నిలుస్తున్నాయి. దీంతో పరీక్షలతో పాటు, స్కూళ్ల నిర్వహణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోక తప్పడం లేదు.

ఇంకా చదవండి ...
    దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి కోరలు చాచింది. కరోనా వైరస్ వెంటాడుతున్న నేపథ్యంలో ఇప్పటికే దేశ వ్యాప్తంగా సీబీఎస్ఈ తో పాటు పలు పరీక్షలను రద్దు చేసింది కేంద్రం. చాలా వరకు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కేంద్రం బాటలోనే నడుస్తూ పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి. ఆయా తరగతుల విద్యార్థులను నేరుగా ప్రమోట్ చేయాలని నిర్ణయించాయి. ఇక తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే తెలంగాణలో ఇప్పటికే స్కూళ్లు మూతపడ్డాయి. ఆన్ లైన్ క్లాసులే జరుగుతున్నాయి. పది, ఇంటర్ పరీక్షలు రద్దయాయి. కానీ ఏపీలో మాత్రం షెడ్యూల్ ప్రకారమే పరీక్షలని ప్రభుత్వం చెబుతూ వస్తోంది.

    అయితే కరోనా కేసులు పెరిగే నేపథ్యంలో నిర్ణయంలో మార్పు ఉండొచ్చు అని చెప్పారు విద్యా శాఖ మంత్రి ఆది మూలపు సురేష్. ఇప్పటి వరకు ఏపీలో పరిస్థితి చూస్తే.. 24 గంటల్లో నమోదవుతున్న కేసుల సంఖ్య ఏడు వేలకు కాస్త అటు ఇటుగా ఉంటోంది. మరోవైపు మరణాల సంఖ్య కూడా ఒక్క రోజులోనే 22కు పెరిగింది. ఇదే ప్రభుత్వంతో పాటు ప్రజలను కలవరపెడుతోంది.

    ముఖ్యంగా ఏపీలో విద్యాసంస్థలే హాట్ స్పాట్ జోన్ లుగా మారుతున్నాయి. చాలా వరకు విద్యా సంస్థల్లో భారీగా కేసులు పెరుగుతుండడంతో ఆందోళన పెంచుతోంది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో ఓ ప్రైవేటు స్కూళ్లో 175 మంది. ఏయూ ఇంజనీరింగ్ క్యాంపస్ లో 165 మందికి. తాజాగా కర్నూలు జిల్లా కస్తూర్బా గాంధీ స్కూళ్లో 53 మందికి కరోసా సోకింది. దాదాపు ప్రతి జిల్లాల్లోనూ చాలా వరకు స్కూళ్లలోనే అధికంగా కేసులు నమోదవుతూ ఉన్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతున్నారు. ఇటీవల కొందరు ఉపాధ్యాయులు కరోనా కరణంగా మరణించిన సందర్భాలు ఉన్నాయి.

    దాదాపు ప్రతి జిల్లాలోనూ ఇదే పరిస్థితి ఉంది. విద్యార్థులు తల్లి దండ్రుల్లో విపరీతమైన ఆందోళన పెరుగుతోంది. స్కూళ్లో ఒకటి రెండు కరోనా కేసులు వస్తుండడంతో తమ పిల్లలు ఎంత వరకు సేఫ్ అని భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని డిమాండ్ వినిపిస్తోంది. విద్యార్థి సంఘాల యూనియన్లు. కమ్యూనిస్టు నేతలు, ప్రజా సంఘాలు చాలా వరకు స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించాలని కోరుతున్నాయి.

    తాజాగా ఏపీ టీడీపీ నేత నారా లోకేష్ దీనిపై స్పందించారు. ఏపీలో పది, ఇంటర్ పరీక్షలు రద్దు చేయాలని లేని పక్షంలో వాయిదా వేయాలని కోరుతూ సీఎం జగన్ కు లేఖ రాశారు. ఆ కాపీని ట్విట్టర్ లో పెట్టారు నారా లోకేష్. వేచి చూసే ధోరణి కంటే విద్యార్థుల ఆరోగ్యానికి ప్రాధాన్యం ఇవ్వటం ఉత్తమం అంటూ ఆయన తన లేఖలో పేర్కొన్నారు.   

    నారా లోకేష్ రాసిన లేఖపై ప్రభుత్వ ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి.  రాష్ట్రంలో ఇంటర్మీడియట్‌, పదో తరగతి పరీక్షల నిర్వహణపై రాబోయే రోజుల్లో పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకుంటామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. అప్పటి వరకు షెడ్యూల్‌ ప్రకారం యథాతథంగా జరుగుతుందని జగన్ సర్కార్ అంటోంది. కానీ తాజా పరిస్థితి చూస్తుంటే విద్యా సంస్థలు నడపడం దాదాపు అసాధ్యమనే అభిప్రాయం వినిపిస్తోంది. దీంతో వీటి నిర్వహణపై సోమవారం నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అని ప్రచారం జరుగుతోంది.
    Published by:Nagesh Paina
    First published:

    Tags: Andhra Pradesh, AP News, AP Schools, Corona, Corona cases, Corona positive, Corona test

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు