VIJAYAWADA TDP CHIEF NARA CHANDRA BABU NAIDU MEETS VANGAVEETI RADHA AT HIS RESIDENCE AND SLAMS GOVERNMENT FULL DETAILS HERE PRN
Babu at Radha House: వంగవీటి రాధా ఇంటికి చంద్రబాబు... ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవడం లేదని ఫైర్..
వంగవీటి రాధాతో చంద్రబాబు భేటీ..
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా చెప్పడంతో ఇటు వైసీపీ (YSRCP), అటు టీడీపీ (TDP) నేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది.
ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాజకీయాల్లో వంగవీటి రాధాకృష్ణ (Vangaveeti Radha Krishna) చేసిన కామెంట్స్ సంచలనం రేపిన సంగతి తెలిసిందే. తన హత్యకు రెక్కీ నిర్వహించారని రాధా చెప్పడంతో ఇటు వైసీపీ (YSRCP), అటు టీడీపీ (TDP) నేతల మధ్య మాటల యుద్ధం కూడా మొదలైంది. కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయం వంగవీటి చుట్టూనే తిరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు.. వంగవీటి రాధా ఇంటికి వెళ్లారు. శనివారం తాడేపల్లిలోని రాధా నివాసానికి వెళ్లిన చంద్రబాబు.. వంగవీటి రాధాతో పాటు ఆయన తల్లి రత్నకుమారితో మాట్లాడారు. జాగ్రత్తగా ఉండాలని.., పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని బాబు ధైర్యం చేప్పారు. రెక్కీ వ్యవహారంపై పోలీసులు, ప్రభుత్వం సీరియస్ గా రియాక్ట్ అవ్వలేదని చంద్రబాబు విమర్శించారు.
రాధాపై రెక్కీ ఘటనపై ప్రజలు నమ్మే విధంగా పోలీసుల విచారణ ఉండాలని చంద్రబాబు అన్నారు. రెక్కీ విషయం బయటకు వచ్చి వారం రోజులవుతున్నా ఏమీ తేల్చలేదన్నారు. తాను డీజీపీకి లేఖ రాశానని.. దాని ఆధారంగా విచారణ జరపలేరా అని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనల్లో కాలయాపన చేయడం మంచిది కాదన్నారు. తనకు ప్రాణహాని ఉందని స్వయంగా రాధా చెప్పారని.. ఇంటివద్ద కారు తిరిగినట్లు ఎవిడెన్స్ వచ్చిన తర్వాత కూడా దోషులను ఎందుకు పట్టుకోలేదని బాబు ప్రశ్నించారు. ఇంత జరిగినా కారు ఎవరిదో ఎందుకు తేల్చలేదన్నారు. దోషులను రక్షించే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోందని ఆయన ఆరోపించారు.
వంగవీటి రాధా రెక్కీ వ్యాఖ్యలు చేసిన తర్వాత ప్రతి రోజూ పలువురు టీడీపీ నేతలు ఆయన ఇంటికి వెళ్లి భేటీ అవుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు రాధా ఇంటికి వెళ్తున్నారు. రాధా విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని విమర్శలు చేస్తున్నారు. ఐతే టీడీపీ విమర్శలకు వైసీపీ నేతలు గట్టిగానే కౌంటర్లిస్తున్నారు. రాధాకు హాని తలపెట్టాల్సిన అవసరం చంద్రబాబుకే ఉందని.. మరోసారి హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని మండిపడుతున్నారు.
ఇదిలా ఉంటే ఇటీవల పరిణామాల నేపథ్యంలో పోలీసులు కూడా రాధా సెక్యురిటీపై దృష్టిపెట్టారు. ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్లను రాధా వెనక్కి పంపడంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆయన అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా రెక్కీ నిర్వహించిదెవరన్నదానిపై ఆరా తీస్తున్నారు. రెండు రోజుల క్రియం రాధా ఆఫీస్ వద్ద అనుమానాస్పద స్కూటీని స్వాధీనం చేసుకున్నా దాని నుంచి ఎలాంటి ఆధారాలు లభ్యం కానట్లు తెలుస్తోంది. ముందుజాగ్రత్త చర్యల్లో భాగంగా ఆయన ఇల్లు, ఆఫీస్ వద్ద పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.