Home /News /andhra-pradesh /

VIJAYAWADA TDP AP PRESIDENT ATCHANNAIDU AND MLA NIMMALA RAMANAIDU COMMENTS JAGAN ADMINISTRATION UMG

అప్పుల్లో ముందుకి.. అభివృద్ధిలో వెనక్కి.. జగన్‌పై అచ్చెన్న సెటైర్లు

వైఎస్ జగన్

వైఎస్ జగన్

సీఎం (AP CM) వైఎస్ జగన్‌ (YS Jagan)పై టీడీపీ (TDP) నాయకులు వరుస విమర్శలకు తెరదీశారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అధికారిక జగన్ చేసిన అధికారిక ప్రసంగంపై టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ముందుకి.. అభివృద్ధిలో వెనక్కి అన్న చందంగా సాగుతోందన్నారు.

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Mangalagiri, India
  సీఎం (AP CM) వైఎస్ జగన్‌ (YS Jagan)పై టీడీపీ (TDP) నాయకులు వరుస విమర్శలకు తెరదీశారు. స్వాతంత్ర్య దినోత్సవం (Independence Day) సందర్భంగా అధికారిక జగన్ చేసిన అధికారిక ప్రసంగంపై టీడీపీ నేతలు విమర్శలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పుల్లో ముందుకి.. అభివృద్ధిలో వెనక్కి అన్న చందంగా సాగుతోందన్నారు. మూడేళ్లలో ప్రభుత్వం చేసిన ఒక్క అభివృద్ధి పనిని చూపించాలంటూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ట్విటర్ వేదికగా ప్రశ్నలు సంధించారు.

  "ఈ ప్రభుత్వం మూడేళ్లలో ఒక్క కొత్త రోడ్డు వెయ్యలేదు. రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ప్రజలకు బాగా తెలుసు. నాడు - నేడు అంటూ పాఠశాలల అభివృద్ధి అని సొంత పార్టీ వాళ్ళను మేపడానికి వాడారు.. ఇప్పుడు తరగతి గదుల్లో పెచ్చులు ఊడి పడుతున్న వార్తలు రోజూ చూస్తున్నాం. గత ప్రభుత్వంలో 25,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు వేశాము. ఈ ప్రభుత్వంలో వేసింది సున్నా.. గత ప్రభుత్వంలో 13 లక్షల పక్కా ఇళ్ళ నిర్మాణం చేపట్టి దాదాపు 8 లక్షల ఇళ్లు పూర్తి చేసాము. ఈ ప్రభుత్వంలో ఇళ్ళ నిర్మాణం లేదు. ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పన లేదు.. కొత్త ఆసుపత్రులు, పోలీస్ స్టేషన్లు, పంచాయితీ భవనాలు గత ప్రభుత్వంలో కట్టించినవే. ఈ ప్రభుత్వంలో వీళ్ళు తెచ్చిన సచివాలయాలకు అద్దెలు కూడా చెల్లించక భవనాలు అద్దెకు ఇచ్చిన యజమానులు తాళాలు వేస్తున్నారు" అంటూ అచ్చె్న్నాయుడు ఆరోపించారు.

  ఇదీ చదవండి: అతి త్వరలోనే జగన్ పెద్ద కుంభకోణం వెలుగులోకి.. పొలిటికల్ బాంబ్ పేల్చిన లోకేశ్


  గత ప్రభుత్వాల పాలనలో ఆదాయం మరియు అప్పుల మొత్తంలో మూలధన వ్యయం శాతం ఎంత, ఈ ప్రభుత్వంలో ఆదాయం మరియు అప్పుల మొత్తంలో మూలధన వ్యయం శాతం ఎంత అనేది చూస్తే గత మూడేళ్లుగా అభివృద్ధిలో వెనక్కి అప్పుల్లో ముందుకి వెళ్తున్నాం అని తేలిగ్గా అర్ధమయిపోతుందని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గత 72 సంవత్సరాలలో ఎవరూ చేయని అప్పులు వీళ్ళు కేవలం మూడేళ్లలో మూడు రెట్లు అధికంగా చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పలా మార్చి ప్రజల నెత్తిన, పుట్టబోయే బిడ్డల నెత్తిన కూడా అప్పుల భారాన్ని వేశారని.. ఈ ముఖ్యమంత్రి అసమర్థ, ప్రణాళిక లేని పరిపాలన వల్లనే రాష్ట్రానికి నేటి ఈ దుస్థితి పట్టిందంటూ విమర్శించారు.

  టీడీపీ ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు కూడా జగన్ సర్కార్‌పై విమర్శలు గుప్పించారు. మద్యం తాగితేనే పథకాలు అమలవుతాయన్నట్లు జగన్ పాలన ఉందని ఎద్దేవా చేశారు. మద్యపాన నిషేధం చేశాకే ఓట్లు అడుగుతానన్న జగన్ విశ్వసనీయత ఇప్పుడేమైందని ఆయన ప్రశ్నించారు. స్వాతంత్ర్య వజ్రోత్సవ వేడుకల్లో జగన్ మాట్లాడిదంతా అసత్యమేనని ఆరోపించారు. మూడేళ్ల పాలనలో ప్రజలకు ఏం చేశామో చెప్పుకోలేని స్థితిలో సీఎం జగన్ ఉన్నారన్నారు.  జగన్‌ ప్రచారం చేస్తున్న అవాస్తవాలను జనం నమ్మే స్థితిలో లేరన్న రామానాయుడు.. సరైన సమయం కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు. ఇసుక రద్దుతో భవన కార్మికులను రోడ్డున పడేసి ఉద్ధరించినట్లు మాట్లాడారని మండిపడ్డారు. జగన్ ప్రమాణస్వీకారం రోజున పెన్షన్ రూ.3వేలు చేస్తానని సంతకం పెట్టిన ఫైల్​కు నేడు దిక్కులేదని దుయ్యబట్టారు. 3, 4, 5వ తరగతులను హైస్కూల్​లో విలీనం చేయడంతో విద్యార్థులు కాలువలు, చెరువులు, శ్మశానాలు దాటి స్కూళ్లకు వెళ్లాల్సివస్తోందని రామానాయుడు ఆరోపించారు.
  First published:

  Tags: AP Politics, Kinjarapu Atchannaidu, TDP, Ys jagan

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు