VIJAYAWADA SUNDAY FULL DEMAND FOR FISH MARKET CHITRAI FISH HUGE DEMAND FOR CHITRAI FISH NGS
Chitrayi Fish: చెరువు చేపలను నదిలో పెట్టి అమ్మేస్తున్నారా..? చిత్రాయి చేపలకు ఎందుకంత డిమాండ్? ధర తెలిస్తే షాక్?
చిత్రాయి చేపకు ఫుల్ డిమాండ్
Chitrayi Fish: సండే వచ్చిందంటే ఫిష్ మార్కెట్ కలకలలాడుతూనే ఉంటుంది. ప్రాంతం ఏదైనా.. చేపల మార్కెట్ సండే రోజు బిజీ బిజీ అవుతుంది. అయితే చాలాచోట్ల చెరువలో చేపలే దొరుకుతుంటాయి.. కానీ అక్కడ మాత్రం నదిలో దొరికే చేపకు ఫుల్ డిమాండ్. అది కూడా చిత్రాయి చేప అంటే ఆ క్రేజ్ మరో లెవెల్.. ధర తెలిస్తే షాక్ అవుతారు.
Chitrayi Fish: మాంసాహార ప్రియులకు (Non Veg Lover) సండే వచ్చింది అంటే పండుగే..? అందులోనూ సీ ఫుడ్స్ (Sea foods) అంటే పడి చచ్చేరు ఎందరో.. నిజం చేప్పాలి అంటే.. చాలామంది సీ ఫుడ్ కోసమే సండే ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తారు.. అదుకే ఆదివారం ఎక్కడ ఫిష్ మార్కెట్లు (Fish Market) చూసినా జనంతో కళకళలాడుతాయి. చేపలను (Fish) నాన్ వెజ్ ప్రియులు ఎంత ఇష్టపడతారో చెప్పడానికి కరోనా (Corona) టైం ఒక ఉదహరణ.. ఎందుకంటే.. కరోనా కర్ఫ్యూ టైంలోనూ.. ఫిష్ మార్కెట్లకు జనం పోటెత్తేవారు.. ఇప్పుడు ఎలాంటి ఆంక్షలు లేవు.. మరి ఇలాంటి టైంలో ఆదివారం వచ్చిదంటే చేపలకు ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందులోనూ నదిలో దొరికే చిత్రాయి చేపలు అంటే అ క్రేజ్ మరో లెవల్ లో ఉంటుంది. ఆదివారం చిత్రాయి చేప తింటే ఆ మజానా వేరు అంటారు.. అది కూడా నదిలో దొరికే చేపల కోసమే వెతుకుతారు.. ఆ డిమాండ్ ను క్యాష్ చేసుకుంటున్నారు అమ్మకం దారులు..
నదీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం.. ఎక్కువమంది అందులో దొరికే చేపల కోసమే ఎదురు చూస్తుంటారు.. అందుకే చేపలో దొరికే చేపలను కొనేందుకు పెద్దగా ఇష్టపడరు. ముఖ్యంగా కృష్ణా నదిలో దొరికే చేప కోసం జనాలు క్యూ కడుతున్నారు.. నదిలో దొరికే చిత్రాయి చేప రుచి వేరు అంటున్నారు నాన్ వెజ్ ప్రియులు. ఇలా చిత్రాయి చేపకు విజయవాడలో ఫుల్ డిమాండ్ పెరిగింది. ఆ డిమాండ్ పెరగంతో.. మత్స్యాకారులు కొందరు కొత్త దారులు వెతుకుతున్నారు. చెరువులో పట్టిన చేపలను కూడా కృష్ణ నది తీర ప్రాంతానికి తీసుకువచ్చి కొంత మంది సొమ్ము చేసుకుంటున్నారు అవి నదిలో దొరికే చేపలు అని చెప్పి అమ్మేస్తున్నారు.
స్థానికులతో పాటు చుట్టుపక్కల గ్రామాల వారు చిత్రాయి చేప కొనుగోలు చేయడానికి పోటీ పడుతున్నారు. దీంతో చేపల ధర ఆకాశానికి చేరుకుంది. సాధారణంగా కిలో 350 లకు అమ్ముతుండగా.. కిలో రొయ్యలు మాత్రం.. 500 రూపాయలకు అమ్ముతున్నారు. ప్రస్తుతం డిమాండ్ పెరగడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి చెరువు చేపలు తెచ్చి కృష్ణా నది చేపలంటూ మరికొందరు అమ్మకాలు చేబడుతున్నారు. ఇక్కడ చేపల కోసం విజయవాడ (Vijayawada) చుట్టుపక్కల ప్రాంతాల నుండి కృష్ణానది కరకట్టకు జనం క్యూ కడుతున్నారు. అవి చేపలో చెరువులు అని తెలియక కొందరు.. ఎంత ధర అయినా పెట్టడానికి సిద్ధమవుతున్నారు. కానీ ఇంటికి వెళ్లి వండకున్న తరువాత తెలుస్తుంది.. అయ్యో మోసపోయామని.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.