(K.Pawan Kumar,News18,Vijayawada)
ఈ దేవాలయం విజయవాడ(Vijayawada)లోని అగ్రశ్రేణి ధార్మిక క్షేత్రాలలో ఒకటి మరియు భగవంతునిపై వారి దృఢ విశ్వాసం కారణంగా అత్యంత సమస్యాత్మకమైన పరిస్థితులలో స్వామికి సంబంధించిన శ్లోకాలను భక్తులు తరచుగా పటిస్తూ ఉంటారు. ఈ ఆలయం ఇంద్రకాలాద్రి (Indrakaladri)కొండ పైభాగంలో ఉంది మరియు సర్పాలకు అధిపతి అయిన సుబ్రహ్మణ్య స్వామి(Subrahmanya Swami)లేదా కార్తికేయ ఆరాధనకు అంకితం చేయబడింది.
గరుడ స్తంభం..
ఈ ఆలయం ముఖద్వారాన్ని అలంకరించే క్లిష్టమైన రాతితో మెరిసే తెల్లని రాయితో తయారు చేయబడింది. అంతే కాదు భక్తులకు గొప్ప మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్న వెండితో కప్పబడిన గరుడ స్తంభాన్ని కలిగి ఉంది. పాముల సహజ ఆవాసమైన ఆలయం వద్ద ఒక పుట్ట ఉంది, దీనిని భక్తులు ఎంతో ఉత్సాహంతో మరియు నమ్మకంతో పూజిస్తారు. ఆలయ ద్వారాలకు దారితీసే కుమారధార నదిలో పవిత్ర స్నానం చేయకుండా ఆలయ సందర్శన అసంపూర్తిగా ఉంటుంది.
భగవంతుని కోరిక మేరకు..
1942 లో యద్దుపల్లి గురువులు దాసు అనే వ్యక్తికి కలలోకి వచ్చి తనకు దేవాలయాన్ని నిర్మించమని సుభ్రమణ్య స్వామి కలలో కోరగా ఆయన పట్టించుకోలేదు. అయితే ఐతే పదే పదే కలలోకి రావడంతో పాత శివాలయంలోకి వచ్చే పంతులు గారికి జరిగింది. అంత చెప్పిన వెంటనే ఆయన తమిళనాడు లో సుబ్రమణ్య స్వామి దేవాలయాలు ఎక్కువ 6 కేత్రాలు ఉంటాయి. అక్కడికి వెళ్లి 6 ఆలయాలను దర్శించి వాటిలో నీకు ఏది నచ్చితే ఆ దేవాలయం వలె నిర్మించమని చెప్పగా ఆ 6 ఆలయాలను దర్శించి తిరుత్తని దేవాలయం ఆయనకి నచ్చింది వెంటనే ఆ ఆలయంలా నిర్మించారు.
సమస్యలు తొలగించే ఆలయం..
ఇబ్బందులు,కష్టాలు ఉన్న వారికి ఆ ఆలయానికి వచ్చి అభిషేకం చేయిస్తే ఆ చిక్కుముడులు అన్ని వెంటనే తొలగిపోతాయి. అలాగే సంవత్సరానికి మూడు సార్లు ఆ దేవాలయంలో కల్యాణం జరుగుతుంది. ఆ కల్యాణంలో పాల్గొని కల్యాణ మాల ధరిస్తే 6 నెలలు లోపు వివాహం అవుతుంది. అలాగే సంతానం లేని వారికి సంవత్సరం లోపు సంతానంకలుగుతుంది అని అక్కడి వారికి ఎంతో నమ్మకం.
పురాణ ఇతిహాసంతో లింకులు..
ఇడుంబన స్వామి అనేఒక రాక్షసుడు ఎంతో బలవంతుడు ఉండేవాడు. ఆయన కొండంత ఎత్తుని కలిగి ఉండేవాడు తానే బలవంతుడు అని ఆహాకారంతో ఉండగా వశిష్ఠ అనే గురువు ఇడుంబనకి రెండు కొండలు తీసుకునిరా అని చెప్తాడు. అలా చెప్పడంతో ఇడుంబనుడు తన గురువు చెప్పగానే తీసుకుని వస్తూ దారి మార్గంలో అలా సేద తీరుతూ ఉంటాడు. అప్పుడు సుబ్రమణ్య స్వామి వారి తల్లిదండ్రులుశివ,పార్వతులతో గొడవ పడి అలిగి భూలోకమనుకు వస్తాడు. అప్పుడు స్వామి ఇడుంబన తెచ్చిన కొండపై కూర్చుంటాడు.
ఆలయ విశిష్టత అదే..
ఇడుంబనుడు ఏంటి కొండపై కూర్చున్నావు లే అని అనగానే నేను చిన్నపిల్లవాడినే కదా తీసుకెళ్లు ఏమవుతుంది అని అనగానే సరే అని కొండని ఎత్తగా కొండ ఇంచు భాగం కూడా కదలదు. అప్పుడు ఇడుంబనుడు నీలో ఎదో శక్తి ఉంది. చాలా గొప్పవాడవు నీవు. నన్ను క్షమించు అనగానే అప్పుడు సుబ్రమణ్య స్వామి సరే క్షమించను నీకు ఏమికావాలో కోరుకో అనగానే స్వామి నాకు రెండు కోర్కెలు ఉన్నాయి అనగానే సరే అంటాడు సుబ్రహ్మణ్య స్వామి అప్పుడు ఇడుంబనుడు నేను నీదగ్గరే కొలువై ఉండాలి, మరొకటి భక్తులు నీవద్దకు సమస్యలతో వచ్చిన ఆ సమస్యను నీతో కాకుండా నాతో చెప్పాలి. అది నేను మీకు తీసుకువచ్చి చెప్పాలి. ఆ కష్టాలు వారికి తీరాలిఅని అడుగుతాడు. స్వామి సరే అంటాడు అప్పటి నుండి విజయవాడలోని కోమల విలాస్ సెంటర్లోని ఉన్న సుబ్రమణ్య స్వామి గుడికి వచ్చిన వారంతా వారి సమస్యలును ఇడుంబనుడుకి చెప్తారు.అదే అక్కడ గుడి విశిష్టత.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra pradesh news, Local News, Vijayawada