హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Vijayawada: ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే.. వెయ్యిమంది మునుల తపస్సు ఫలితం పొందుతారు..!

Vijayawada: ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే.. వెయ్యిమంది మునుల తపస్సు ఫలితం పొందుతారు..!

యనమలకుదురు

యనమలకుదురు శ్రీ రామలింగేశ్వరస్వామి ఆలయం

చెంబుడు నీళ్లు పోస్తే చాలు.. ఆ భోళాశంకరుడు కోరిన కోర్కెను తీర్చుతాడు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు.. మీకు వెయ్యిమంది మునుల ఆశీస్సులు అందినట్లే. ఎక్కడో సూదూర ప్రాంతాల్లో కాదు.. మన విజయవాడ (Vijayawada) కు అతి చేరువలోనే ఈ ఆలయం ఉంది..!

ఇంకా చదవండి ...
 • News18 Telugu
 • Last Updated :
 • Vijayawada, India

  Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
  చన్ద్ర కోఠి ప్రతీకాశం త్రినేత్రం చన్ద్ర భూషణమ్.హ్ |
  ఆపిఙ్గళ జటజూటం రత్న మౌళి విరాజితమ్.హ్ ||
  చెంబుడు నీళ్లు పోస్తే చాలు.. ఆ భోళాశంకరుడు కోరిన కోర్కెను తీర్చుతాడు. అలాంటిది ఆ పార్వతీ రామలింగేశ్వరుడిని ఒక్కసారి దర్శిస్తే చాలు.. మీకు వెయ్యిమంది మునుల ఆశీస్సులు అందినట్లే. ఎక్కడో సూదూర ప్రాంతాల్లో కాదు.. మన విజయవాడ (Vijayawada) కు అతి చేరువలోనే ఈ ఆలయం ఉంది..! పూర్వ కాలం మునులు, ఋషులు, తప్పస్సు చేసుకోవడానికి వీలుగా నది తీర ప్రాంతాలను ఎంచుకునేవారు . అలా ఎంచుకున్న ప్రాంతాలలో విజయవాడలోని వేయ్యినిమునులకుదురు అని పిలిచే వారు. కాలక్రమేణా దాని పేరు యనమల కుదురుగా మారింది. ఈ ప్రాంతాన్ని అప్పటిలో వేయ్యీన్ని మునుల కుదురు గా పిలిచే వారు కాల క్రమేణా అది మునిగిరి అని ఆ తరువాత యనమల కుదురుగా పిలవబడుతుంది.
  ఆలయ చరిత్ర..!
  కృష్ణానదీ తీరాన సుమారు 612 అడుగుల ఎత్తైన కొండపై వెలసిన శ్రీ పార్వతీ రామలింగేశ్వరస్వామి దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. స్వయంభూవుడిగా వెలసిన ఈ రామలింగేశ్వరుడికి పరుశురాముడు ప్రాణ ప్రతిష్ట చేశాడని పురాణాలు చెబుతున్నాయి.  ఒకప్పుడు యనమలకుదురు ప్రాంతం ఎంతో ప్రశాంతంగా తపసుకు యోగ్యంగా ఉండేదని చరిత్ర ద్వారా తెలుస్తుంది. అందువల్లనేమో విష్ణుమూర్తి ఆరవ అవతారమైన పరుశురాముడు కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి వచ్చి శివునికోసం తపస్సు చేసుకున్నాడట. ఆ సమయంలోనే అక్కడ వెయ్యి మంది మునులు కొలువుతీరి యజ్ఞం నిర్వహించినట్లుగా తెలుస్తుంది. పరుశురాముడు వారు చేస్తున్న యజ్ఞాన్ని రాక్షసుల బారి నుండి రక్షించాడు.

  ఇది చదవండి: రక్తంతో అక్షింతలు.. పొలంలో చల్లితే మంచిదంట..! దీనికి శాస్త్రీయత కూడా.. వింత పండగ ఎక్కడంటే..!


  పరిసమాప్తి అయ్యాక ఆ ప్రాంతంలో పరశురాముడు శివలింగాన్ని ప్రతిష్టించి ప్రాణ ప్రతిష్ట చేశాడని స్థల పురాణం చెబుతుంది. ఆయన ప్రతిష్ఠ చేసిన కారణంగానే ఇక్కడ శివుడిని రామలింగేశ్వరుడుగా భక్తులు ప్రేమగా పిలుచుకుంటారు ఈ గిరి చుట్టూ 1000 మంది మునులు కూర్చుని శివుని గురించి తపస్సు చేశారు కనుక ఈ ప్రాంతాన్ని వెయ్యి మునుల కుదురు అని పిలిచేవారట. కుదురు అంటే వెయ్యి మంది సమావేశం. కాలక్రమమైన స్థానికుల భాషలో అధికాస్తా మారిపోయింది.

  ఇది చదవండి: చీరాల.. మళ్లీ మళ్లీ రావాల..! అక్కడ స్పెషల్ ఏంటో తెలిస్తే థ్రిల్ అవుతారు..! ఇంతకీ ఏముందంటే..!  ఈ మునిగిని కొండ ముఖద్వారంలో ఎత్తైన హనుమంతుడు మనకు స్వాగతం పలుకుతాడు. ఈ కొండపై రామలిగేశ్వరస్వామి ఆలయంతో పాటు విఘ్నేశ్వరాలయం, అయ్యప్పస్వామి ఆలయం, నాగేంద్రస్వామి ఆలయాలను రాతి కట్టడాలతో నిర్మించారు.

  ఇది చదవండి: సిక్స్ ప్యాక్ బాడీపై పెరుగుతున్న క్రేజ్.. కానీ అంత ఈజీ కాదంటున్న ట్రైనర్లు..!


  వైభవోపేతంగా శివరాత్రి ఉత్సవాలు
  మహాశివరాత్రి ఉత్సవాలకు యనమలకుదరు శివాలయం ప్రసిద్ధి. ఇక్కడ మహాశివరాత్రిని మూడురోజుల పాటు వైభవంగా నిర్వహిస్తారు. తొలిరోజు ప్రభోత్సవం, రెండోరోజు కల్యాణోత్సవం, మూడోరోజు వసంతోత్సవం నిర్వహిస్తారు. చివరి రోజు సాయంత్రం ధ్వజ అవరోహణం సమయంలో స్వామికి సమర్పించే నంది ముద్ధలు అంత్యంత మహిమాన్వితమైనవి. సంతానం లేని వాళ్లు వాటిని తింటే కచ్చితంగా వారికి పిల్లలు పుడతారనేది భక్తుల నమ్మకం.

  ఇది చదవండి: స్వయానా గాంధీజీ ప్రారంభించిన ఆశ్రమం.. మన నెల్లూరులో ఉందని మీకు తెలుసా..?


  ఆలయాలను విద్యుత్తు దీపకాంతులతో, పుష్పాలతో అలంకరిస్తారు. ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి పక్క గ్రామాల నుండే కాక జిల్లా నలుమూల నుండి ప్రజలు వస్తారు. గ్రామస్థులు తమ బంధువులను ఆహ్వానించి విందు ఇవ్వటం ఆనవాయితీ. కార్తీకమాసంలోనూ, దసరా ఉత్సవాలను వైభవంగా ఇక్కడ నిర్వహిస్తారు. వనవాస సమయంలో సాక్షాత్తూ సీతారాములు ఈ పార్వతీ రామలింగేశ్వరుడిని దర్శించి పూజించారని ప్రచారంలో ఉంది. అంతేకాదు ఆ తర్వాత ఎంతో మంది రాజులు, చాళుక్యులు, రెడ్డిరాజులు, విజయనగర రాజులు ఈ మునిగిరి క్షేత్రంలో కొలువై ఉన్న మహాశివుడిని దర్శించినట్లు తెలుస్తోంది.

  ఇది చదవండి: యోగి వేమ‌నకు గుడికట్టి పూజలు, ఉత్సవాలు చేస్తున్నారు..? ఎక్కడో తెలుసా..!


  నేటికీ రాత్రులు మునులు , ఋషులు నాగ కన్యలు ఈ ప్రాంతానికి వచ్చి వెళ్తుంటారని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని సందర్శించి పార్వతీ రామలింగేశ్వరుడిని పూజిస్తే తమకున్న కష్టాలన్నీ తొలగిపోతాయని…ఏం కొరుకుంటే అది నెరవుతుందని భక్తుల నమ్మకం. అంతేకాదు ఒక్కసారి ఈ ఆలయాన్ని దర్శిస్తే వెయ్యిమంది మునుల ఆశీస్సులు అందుకున్నంత పుణ్యమని భక్తుల ప్రగాఢ విశ్వాసం.

  ఇది చదవండి: పిల్లలకు మార్షల్ ఆర్ట్స్ నేర్పించాలి అనుకుంటున్నారా..? మీకో గుడ్ న్యూస్


  ఈ ఆలయం గురించి, ఆలయంలో జరిగే పూజలు లాంటి మరిన్ని వివరాలు తెలియాలంటే ఈ ఆలయ వెబ్‌సైట్‌ http://sriramalingeswara.com/ ను ఒక్కసారి పరిశీలించండి.
  పూజా సమయాలు: శ్రీ రామలింగేశ్వర స్వామివార్కి నిత్యం ఉదయం 6 గం”లకు దేవతార్చన. అనంతరం 11 గం”ల వరకు అభిషేకములు. ఉదయం 11 గం”లకు అలంకరణ నీరాజన మంత్రపుష్పం. సోమవారం మాత్రం ఉదయం 5.30కు సుప్రభాతంతో మొదలై సాయంత్రం 7.15కు స్వామివార్లకు పల్లకిసేవతో ముగుస్తాయి.


  దర్శన సమయాలు: ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 గంటలు, సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటలు.
  అడ్రస్‌ : కొండ రోడ్డు, రామలింగేశ్వర నగర్‌, యనమలకుదురు, విజయవాడ, ఆంధ్రప్రదేశ్‌- 520007
  సంప్రదించాల్సిన ఫోన్‌ నెంబర్‌: 7386160555
  Sri Ramalingeswara Swamy Temple Yanamalkuduru Vijayawada Map
  ఎలా వెళ్లాలి?
  విజయవాడ నగరంలోని పలు ప్రాంతాల నుంచి యనమలకుదురుకు బస్సులు అందుబాటులో ఉంటాయి. పండిట్‌నెహ్రూ బస్టాండ్, ఆటోనగర్‌ బస్టాండ్‌, బెంజ్‌ సర్కిల్‌ నుంచి ఆటోలు దొరుకుతాయి. రైలుమార్గం ద్వారా కూడా వెళ్లొచ్చు.

  Published by:Purna Chandra
  First published:

  Tags: Andhra Pradesh, Hindu Temples, Local News, Vijayawada

  ఉత్తమ కథలు