హోమ్ /వార్తలు /ఆంధ్రప్రదేశ్ /

Andrapradesh; ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు!..

Andrapradesh; ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు!..

soma veeraju made comments on cm jagan kumar reddy

soma veeraju made comments on cm jagan kumar reddy

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు పలు వ్యాఖ్యలు చేశారు.వైసీపీని గద్జె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

 • News18 Telugu
 • Last Updated :
 • Rajahmundry, India

  Andrapradesh;  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలపై బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు(President) సోము వీర్రాజు (soma veeraju) కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీలో(Andrapradesh) త్వరలో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్నారు. ఎవ్వరూ ఊహించని పరిణామాలు (situvation) ఏపీలో చోటు చేసుకోబోతున్నాయని ఆయన వెల్లడించారు. ఏపీ విషయంలో బీజేపీ అధినాయకత్వం అత్యంత కీలక నిర్ణయం  తీసుకోబోతోందన్నారు. రాజకీయ పరిణామాలు (political  situvation)

  ఈ విధంగా ఎలా జరిగాయోననే విషయం ఎవ్వరికీ అర్ధం కాదన్నారు. ఏపీలో త్వరలో సినిమా సీన్లను మించిన స్థాయిలో పరిణామాలు చోటు చేసుకుంటాయన్నారు.

  ఎవ్వరికీ భయపడని జగన్(Jagan) భయపడేది నరేంద్ర మోడీకేనని (Narendra modi) ఆయన అన్నారు. వైసీపీని గద్జె దించే ఏకైక పార్టీ బీజేపీనేనని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అంతర్వేదిలో రథం దగ్ధమైతే బీజేపీ ఒత్తిడితో ప్రభుత్వం దిగొచ్చిందన్నారు. జగన్ ప్రభుత్వాన్ని వణికించిన పార్టీ బీజేపీ అంటూ చెప్పుకొచ్చారు. విగ్రహాలు(Statue), రథాలను ధ్వంసం చేస్తే బీజేపీ పోరాటం చేసిందన్నారు. రామ తీర్థం నుంచి కపిల తీర్థం వరకు యాత్ర ( political trip) చేస్తామంటే వెనక్కి తగ్గారన్నారు. రాయలసీమ (Rayalseema) కూడా యాత్ర చేసి ప్రాజెక్టుల పనులు చేపడతామన్నారు. పోలవరంలో నిర్వాసితులే కాదు. ఏపీ వ్యాప్తంగా నిర్వాసితులు ఉన్నారని వీర్రాజు వెల్లడించారు.

  Published by:Abhiram Rathod
  First published:

  Tags: Ap cm ys jagan mohan reddy, AP Politics, Rajamundry, Somu veerraju

  ఉత్తమ కథలు