DGP Meets CM YS Jagan: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో వైసీపీ (YCP) ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తయింది. కేవలం రెండేళ్లలోనే ఎన్నికలు ఉన్నాయి. ఇప్పటికే అన్ని పార్టీల్లో ఎన్నికల మూడు కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం జరిగితే రెండేళ్లు.. కానీ ముందుగానే ఎన్నికలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో 95 శాతం హామీలు పూర్తి చేసినట్లు ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకుంటున్నారు. ప్రభుత్వం పెద్దలు చెబుతున్నట్టు 95 శాతం హామీలు అటు ఉంచితే.. ఆ మిగిలిన ఐదు శాతం హామీల్లో కీలకమైన హామీ ఇప్పుడు తలనొప్పిగా మారింది. అది ఏంటి అంటే..? ఉద్యోగుల సీపీఎస్ (CPS) రద్దు.. దీనికోసం వైసీపీ గతంలో హామీ ఇచ్చింది. అధికారంలోకి రాగానే వారం రోజుల్లో సీపీఎస్ రద్దు చేస్తానని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) తన పాదయాత్ర సందర్భంగా ఉద్యోగులకు భరోసా ఇచ్చారు. కానీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు దాటిపోయాక దీన్ని అమలుచేయలేదు. అసలు సాధ్యం కాదని మంత్రులే స్వయంగా చెబుతున్నారు. అప్పట్లో దీని గురించి తెలియక హామీ ఇచ్చామని వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. దీంతో ఉద్యోగులు సర్కార్ తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉంది.
ఆ దిద్దుబాటు చర్యల్లో భాగంగా ప్రభుత్వం జీపీఎస్ పేరుతో మరో ప్రత్యామ్నాయం తెద్దామని ప్రయత్నించినా ఉద్యోగులు దానికీ ఒప్పుకోవడం లేదు. పాత తరహాలోనే ఉద్యోగులకు ఓపీఎస్ విధానమే అమలుచేయాలని ఉద్యోగులు పట్టుబడుతున్నారు. ఆ ఆందోళనలు ఇప్పుడు మరో లెవెల్ కు వెళ్తున్నాయి. దీంతో ఇప్పటికే అలర్ట్ అయిన ప్రభుత్వం.. ఉద్యోగులతో చర్చలు జరిపింది.
ఉద్యోగులు మాత్రం సీపీఎస్ రద్దుపై స్పష్టమైన హామీ కావాలి అంటున్నారు. జీపీఎస్ ను తెరపైకి తేవడాన్ని వారు వ్యతిరేకిస్తున్నారు. దీనికీ ఉద్యోగులు ససేమిరా అన్నారు. తాజాగా జరిగిన చర్యలు సైతం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో సీపీఎస్ రద్దుపై ప్రభుత్వాన్ని నిర్ధిష్ట హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉద్యోగులు సెప్టెంబర్ 1న మిలియన్ మార్చ్ కు పిలుపునిచ్చారు.
రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు విజయవాడ (Vijayawada) కు చేరుకుని అక్కడి నుంచి సీఎం జగన్ నివాసం ముట్టడికి మిలియన్ మార్చ్ గా వెళ్లాలని నిర్ణయించారు. ఇందుకోసం కమిటీలు తయారు చేసుకుని మరీ మిలియన్ మార్చ్ విజయవంతానికి సిద్ధమవుతున్నారు. గతంలో ఛలో విజయవాడ మాదిరి దీన్ని సక్సెస్ చేస్తేనే.. తీవ్రత ప్రభుత్వానికి అర్థమవుతుందని భావిస్తున్నారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అనుమతి లేదని స్పష్టం చేశారు పోలీసులు.. గతంలో విజయవాడలో జరిగిన ఘటనలను దృష్టిలో ఉంచుకుని ఈ సారి ప్రభుత్వం పటిష్ట చర్యలకు సిద్ధం అవుతోంది.
ఇదీ చదవండి : బాలయ్యకు షాక్.. నోటీసులు జారీ చేసిన సుప్రీం.. ఎందుకో తెలుసా?
తాజా పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డితో సమావేశం అయ్యారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి.. రాష్ట్రంలో శాంతి భద్రతలపై డీజీపీతో సీఎం సమీక్ష నిర్వహించారు.. సెప్టెంబర్ 1వ తేదీన ఛలో విజయవాడకు ఉద్యోగులు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఇవాళ్టి సమావేశానికి ప్రధాన్యత ఏర్పడింది.. ఇప్పటి వరకు చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడికి పోలీసులు అనుమతివ్వలేదు.. ఇక, గత అనుభవాల దృష్ట్యా.. ఉద్యోగులు విజయవాడ రాకుండా తీసుకుంటోన్న చర్యలను సీఎం జగన్కు డీజీపీ వివరించినట్టు సమాచారం. అంతేకాదు, చలో విజయవాడ, సీఎం ఇంటి ముట్టడిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన చర్యలపై డీజీపీకి సీఎం దిశానిర్దేశం చేశారని తెలుస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Ap cm ys jagan mohan reddy, Ap government, AP News, Ycp