Home /News /andhra-pradesh /

VIJAYAWADA SENSATIONAL ISSUES ACME UP IN GUJARAT DRUG CASE ITS LIKE A TERRORIST WAR ON INDIA WITHOUT TAKING UP ARMS AND NIA ENTERED FOR INVESTIGATION PRV

Drugs case: గుజరాత్​ డ్రగ్స్​​ కేసులో సంచలన విషయాలు.. ఆయుధాలు పట్టకుండానే భారత్​పై ఉగ్రవాదుల యుద్ధం?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్‌ కేసులో మనీలాండరింగ్ కోణంలో రంగంలోకి దిగిన ఈడీ (ED)కి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉగ్రవాదం కోణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దృష్టి పెట్టి దర్యాప్తు ప్రారంభించింది.  డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో మారణాయుధాలు (Weapons) కొనుగోలు చేసేందుకు ఉగ్రవాదులు (Terrorists) వినియోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు (Investigation agencies) అనుమానిస్తున్నాయి.  

ఇంకా చదవండి ...
  గుజరాత్​ డ్రగ్స్​​ కేసు (Gujarat drug case) ప్రకంపనలు సృష్టిస్తోంది. దేశవ్యాప్తంగా నిర్వహించిన సోదాల్లో భారీగా మత్తు పదార్థాలు (drugs) పట్టుబడుతున్నాయి. లింకులు ఎక్కడెక్కడో బయటపడుతున్నాయి.  ఇప్పటి వరకు 8 మందిని అరెస్ట్ (Arrest) చేశారు. వేల కోట్ల విలువైన డ్రగ్స్‌  మూలాలపై విచారణ చేపట్టారు అధికారులు. కేసును సీరియస్‌గా తీసుకున్న భారత రక్షణ సంస్థ దర్యాప్తు ముమ్మరం చేసింది. ముందుగా మనీలాండరింగ్ కోణంలో రంగంలోకి దిగిన ఈడీ (ED)కి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. దీంతో ఉగ్రవాదం కోణంలో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దృష్టి పెట్టి దర్యాప్తు ప్రారంభించింది.  డ్రగ్స్ అమ్మకం ద్వారా వచ్చే డబ్బుతో మారణాయుధాలు (Weapons) కొనుగోలు చేసేందుకు ఉగ్రవాదులు (Terrorists) వినియోగిస్తున్నట్లు దర్యాప్తు సంస్థలు (Investigation agencies) అనుమానిస్తున్నాయి.

  ఆయుధాల కోసం..

  అఫ్ఘాన్ (Afghan) తాలిబన్ల చేతిలోకి వెళ్లిన తర్వాత అక్కడి నుంచి వచ్చే సరుకుపై గట్టి నిఘా పెట్టాలని నిర్ణయించాయి. సరకు రవాణా ముసుగులో మాదకద్రవ్యాలు రవాణా చేస్తున్న ఉగ్రవాదులు.. అయుధం పట్టకుండానే యుద్ధం (war) చేసేందుకు ప్రయత్నిస్తున్నారని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఉగ్రవాద కోణం ఉన్నందున రంగంలోకి దిగింది ఎన్ఐఏ (NIA). డ్రగ్స్‌ దందా వెనుక ఎవరున్నారు ? సూత్రధారులు ఎవరు ? పాత్రధారులు ఎవరు ? అనేది తేల్చే పనిలో పడింది.

  2,988 కేజీల హెరాయిన్‌..

  గుజరాత్ ముంద్రా పోర్టు (Mundra port)లో డ్రగ్స్ వ్యవహారాన్ని డీఆర్ఐ (DRI) అధికారులు బయటపెట్టారు. ఈనెల 13న గుజరాత్‌ ముంద్రా పోర్టులో రెండు కంటైనర్లలో డ్రగ్స్‌ని స్వాధీనం చేసుకున్నారు. 2,988 కేజీల హెరాయిన్‌ను పట్టుకున్నారు. డ్రగ్స్‌ని అఫ్గనిస్తాన్‌ నుంచి ఇరాన్‌ (Iron) మీదుగా భారత్‌కు తరలించినట్టు అధికారులు గుర్తించారు. టాల్క్‌స్టోన్స్‌, టాల్కం పౌడర్‌గా పేర్కొంటూ డ్రగ్స్‌ని భారత్‌ (India)కు రవాణా చేశారు. అయితే డీఆర్‌ఐ విచారణలో నార్కోటిక్‌ డ్రగ్‌ హెరాయిన్‌ (narcotic drug heroin)గా నిర్థారించారు.

  భారీ ఎత్తన డ్రగ్స్‌ పట్టుబడటంతో డీఆర్‌ఐ దేశవ్యాప్తంగా ఆపరేషన్‌ చేపట్టింది. న్యూఢిల్లీ, నోయిడా, చెన్నై, కోయంబత్తూరు, అహ్మదాబాద్‌, మాండ్వి, గాంధీధామ్‌, విజయవాడ (Vijayawada) ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఢిల్లీలో 16.1 కేజీల హెరాయిన్‌, నోయిడాలోని నివాస ప్రాంతాల్లో 10.2 కేజీల కొకైన్‌, 11 కేజీల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో నలుగురు అఫ్గనిస్తాన్‌ దేశస్తులు, ఒక ఉబ్జెకిస్తాన్‌ దేశస్తుడితో పాటు ముగ్గురు ఇక్కడి వారు మొత్తం 8 మంది పట్టుబడ్డారు. డీఆర్‌ఐ అధికారులు వారందరినీ అరెస్ట్‌ చేశారు. అరెస్టయిన ముగ్గురు భారతీయుల్లో ఒకరికి ఇంపోర్ట్‌, ఎక్స్‌పోర్ట్‌ లైసెన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది.

  ఆషి ట్రేడింగ్‌ కంపెనీ యాజమాన్యం డీఆర్‌ఐ కస్టడీలో ఉన్నారు. చెన్నైలో ఎం సుధాకర్‌, జి దుర్గాపూర్ణ, వైశాలిని అరెస్ట్‌ చేశారు. వీరిని గుజరాత్‌లోని భుజ్‌ కోర్టులో హాజరు పరిచారు. వీరిని 10 రోజుల పాటు డీఆర్‌ఐ కస్టడీకి అంగీకరించింది న్యాయస్థానం. తాజాగా ఈ కేసులో మనీ లాండరింగ్‌ కోణంలో ఈడీ దర్యాప్తు చేపట్టింది.

  మరోవైపు, గుజరాత్‌ ముంద్రా ఎయిర్‌పోర్ట్‌లో పట్టుబడ్డ హెరాయిన్‌తో రాష్ట్రానికి సంబంధాలు ఉన్నాయన్న వార్తల నేపధ్యంలో ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ ఇప్పటికే వివరణ ఇచ్చారు. పెడ్లర్స్ విజయవాడను ట్రాన్స్‌పోర్ట్ అడ్రస్‌గా వాడుకున్నారే తప్పా.. దీనికి సంబంధించిన వ్యాపార కార్యకలపాలన్నీ చెన్నై కేంద్రంగా సాగుతున్నాయన్నారు.

  వైసీపీ ఎమ్మెల్యేను విచారించాలంటూ..

  డ్రగ్స్‌ సరఫరా కేసులో విజయవాడ కంపెనీపై ఎందుకు విచారణ చేయడం లేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు టీడీపీ ఎంపీ రామ్మోహన్‌ నాయుడు. శనివారం మీడియాతో మాట్లాడిన ఎంపీ రామ్మోహన్ నాయుడు.. ఏ అంశంపై అయినా టీడీపీ తప్పుడు ఆరోపణలు చేయదని.., అన్ని సాక్షాధారాలతో టీడీపీ మాట్లాడుతుందనేది డీజీపీ గుర్తు పెట్టుకోవాలని అన్నారు. ఏపీలో డ్రగ్స్ మాఫియా నడుస్తోందని ఆరోపించిన ఆయన.. ఏపీలో పోలీసు శాఖ ఎవరి కోసం పని చేస్తుందని ప్రశ్నించారు. హెరాయిన్ అంశంలో ‘‘ఈవే’’ బిల్లులు బయటకి తీయాలని రామ్మోహన్ నాయుడు డిమాండ్ చేశారు. సీఎం జగన్ వన్నీ క్రిమినల్ ఐడియాలని ఆరోపించారు. అలాగే హెరాయిన్ కేసులో అరెస్టైన సుధాకర్ సొంత ఊరు ద్వారపూడి అయినందున అక్కడి వైసీపీ ఎమ్మెల్యేకి... నిందితుడికి ఏమైనా లింక్ ఉందా అనే కోణంలో విచారించాలని డిమాండ్ చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Afghanistan, Drugs, Gujarat, NIA, Terrorists, Vijayawada

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు