Home /News /andhra-pradesh /

VIJAYAWADA SENSATIONAL FACTS REVEALED BEHIND SOFTWARE ENGINEER MURDER CASE IN KRISHNA DISTRICT AS POLICE ARRESTED ACCUSED FULL DETAILS HERE PRN

Affair: ఫ్రెండ్ భార్య, ప్రియురాలితో ఎఫైర్.. ఆ ఫోటోలతో బ్లాక్ మెయిలింగ్.. ఓ రాత్రి నమ్మకంగా పిలిచి..

నిందితులు జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి (ఫైల్)

నిందితులు జ్యోతి, శ్రీకాంత్ రెడ్డి (ఫైల్)

Affair: చిన్ననాటి మిత్రులైనా, తోడబుట్టిన వారైనా, ఏళ్ల తరబడి క్లోజ్ గా ఉంటున్న కుటుంబాల్లో అయినా చిచ్చుపెట్టే కారణం ఒకేఒక్కటి అదే అక్రమ సంబంధం. చిన్ననాటి స్నేహితుడి ప్రియురాలిని, అతడి భార్యను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఎఫైర్ పెట్టుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అదే సంబంధానికి బలయ్యాడు. స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు.

ఇంకా చదవండి ...
    చిన్ననాటి మిత్రులైనా, తోడబుట్టిన వారైనా, ఏళ్ల తరబడి క్లోజ్ గా ఉంటున్న కుటుంబాల్లో అయినా చిచ్చుపెట్టే కారణం ఒకేఒక్కటి అదే అక్రమ సంబంధం. చిన్ననాటి స్నేహితుడి ప్రియురాలిని, అతడి భార్యను కూడా బ్లాక్ మెయిల్ చేసి ఎఫైర్ పెట్టుకున్న ఓ సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. అదే సంబంధానికి బలయ్యాడు. స్నేహితుడి చేతిలోనే ప్రాణాలు కోల్పోయాడు. వివరాల్లోకి వెళ్లే ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని కృష్ణా జిల్లా (Krishna District) తోట్లవల్లూరు మండలం చాగంటిపాడు శివారులోని ఆళ్లవారిపాలెం గ్రామానికి చెందిన ఆళ్ల శ్రీకాంత్ రెడ్డి, గాడికొయ్య శ్రీనివాస్ రెడ్డి చిన్నప్పటి నుంచి స్నేహితులు. శ్రీనివాస్ రెడ్డి బెంగళూరు (Bengaluru) లో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి భార్య, కుమారుడున్నారు. కొన్నాళ్లుగా వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. శ్రీకాంత్ రెడ్డికి ఆళ్లవారిపాలెం గ్రామానికి చెందిన మిథున అలియాస్ జ్యోతితో నాలుగేళ్లుగా వివాహేతర సంబంధం ఉంది.

    జ్యోతికి గతంలో వివాహం కాగా.. భర్తతో విడిపోయింది. ఆ తర్వాత స్వగ్రామానికే చెందిన మరో వ్యక్తితో పెద్దలు పెళ్లి జరిపించారు. ఆమెకు 8ఏళ్ల బాబు, 10 నెలల పాప ఉన్నారు. ఇదిలా ఉంటే ఓ రోజు శ్రీకాంత్ రెడ్డి తన ఫోన్ అప్ డేట్ చేయమని శ్రీనివాస్ రెడ్డికి ఇచ్చాడు. అదే సమయంలో శ్రీకాంత్ రెడ్డి తన ప్రియురాలు జ్యోతితో చనువుగా ఉంటున్న ఫోటోలు చూసి తన ఫోన్లోకి డౌన్ లోడ్ చేసుకున్నాడు. ఆ ఫోటోలను జ్యోతికి చూపించి తనతో సన్నిహితంగా ఉండపోతో ఫోటోలను సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు.

    ఇది చదవండి: యువతితో గ్రామ సచివాలయ ఉద్యోగి రాసలీలలు.. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న భార్య.. వీడియో వైరల్


    దీంతో ఆమె.. శ్రీనివాస్ రెడ్డితో క్లోజ్ గా ఉండటం మొదలుపెట్టింది. అంతేకాదు శ్రీకాంత్ రెడ్డిని కూడా దూరంపెట్టి అతడి ఫోన్ నెంబర్ ను బ్లాక్ లిస్టులో పెట్టింది. కొన్నిరోజుల తర్వాత శ్రీకాంత్ రెడ్డిని కలిసి జరిగిన విషయం చెప్పింది. వెంటనే శ్రీకాంత్ రెడ్డి... శ్రీనివాస్ రెడ్డి ఇంటికి వెళ్లి మేటర్ మొత్తం చేప్పేశాడు. మరోవైపు శ్రీనివాస్ రెడ్డి.. ఆ ఫోటోలను శ్రీకాంత్ రెడ్డి భార్యకు కూడా చూపించి ఆమెతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.

    ఇది చదవండి: సాయి ప్రియాంక కేసులో మరో ట్విస్ట్.. కేసు నమోదుకు రంగం సిద్ధం..! కారణం ఇదే..!


    ఇదిలా ఉంటే జ్యోతిని బ్లాక్ మెయిల్ చేయడమే కాకుండా తనకు దూరం చేయడాన్ని సహించలేని శ్రీకాంత్ రెడ్డి ఎలాగైనా శ్రీనివాస్ రెడ్డిని హత్య చేయాలని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో రెండుసార్లు స్కెచ్ వేసి విఫలమయ్యాడు. ఓ సారి పొలంలో మోటార్ స్విచ్ కు విద్యుత్ షాకిచ్చేందుకు యత్నించాడు. మరోసారి బైక్ ను ఇసుక లారీ కిందకు నెట్టేందుకు యత్నించి విఫలమయ్యాడు. ఈ క్రమంలో ఈనెల 25న రాత్రి జ్యోతి శ్రీనివాస్ రెడ్డికి ఫోన్ చేసి ఇంటికి రమ్మని పిలిచింది. ఆమె వద్దకు వెళ్లి శ్రీనివాస్ రెడ్డి అక్కడి నుంచి శ్రీకాంత్ రెడ్డి ఫోన్ కు మెసేజ్ లు పంపాడు. అవి చూసిన శ్రీకాంత్ రెడ్డి.. జ్యోతి ఇంటికి వచ్చాడు.


    ఇది చదవండి: అమ్మాయి కోసం కొట్టుకున్న సీఐ, కానిస్టేబుల్.. ఉన్నతాధికారుల ఎంట్రీ.. చివరికి ఏం జరిగిందంటే..!


    అప్పటికే మర్డర్ స్కెచ్ వేసిన శ్రీకాంత్, జ్యోతి.. శ్రీనివాస్ రెడ్డి పారిపోకుండా కట్టుదిట్టం చేశారు. శ్రీకాంత్ రెడ్డి.. జ్యోతి ఇంటికి వెళ్లగానే ఇద్దరూ అక్కడ వాదులాడుకున్నారు. ఈ క్రమంలో నీ భార్యతో కూడా ఎఫైర్ ఉందంటూ శ్రీనివాస్ రెడ్డి ఆ ఫోటోలు కూడా చూపించాడు. దీంతో ఆగ్రహానికి గురైన శ్రీకాంత్ రెడ్డి పలుగు, కొడవలితో శ్రీనివాస్ రెడ్డిపై దాడి చేసి చంపేశాడు. ఆ తర్వాత శ్రీకాంత్ రెడ్డి, జ్యోతిని పాపను తీసుకొని పారిపోయాడు. గత నెల 26న విజయవాడలోని ఓ ఏటీఎంలో ఇద్దరూ డబ్బులు డ్రా చేశారు. అక్కడి నుంచి బైక్ పై రైల్వే స్టేషన్ కు వెళ్లి అక్కడే పార్క్ చేశారు. అనంతరం తిరుమల, తిరుపతికి వెళ్లారు. సాంకేతిక కారణాలతో విశ్లేషించిన పోలీసులు వారిని గూడూరులో అదుపులోకి తీసుకొని తోట్లవల్లూరు తీసుకొచ్చారు.
    Published by:Purna Chandra
    First published:

    Tags: Andhra Pradesh, Extramarital affairs, Krishna District

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు