Yashwanth, News18, Jaggayyapeta
కృష్ణా జిల్లా (Krishna District) కోడూరు మండలం విశ్వనాథపల్లిలో స్కూల్ బస్సు అగ్నికి ఆహుతైంది. అయితే, ఆ సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. తెల్లవారుజామున చైతన్య స్కూల్ బస్సు షార్ట్ సర్క్యూట్ కారణంగా దగ్ధం అయింది. శనివారం ఉదయం చైతన్య పాఠశాలకు చెందిన బస్ విద్యార్థులను పాఠశాలకు తీసుకోని రావటానికి వెళుతున్న సమయంలో ఒక్కసారిగా బస్సులో మంటలు వ్యాపించాయి. అప్రమత్తమైన బస్సు డ్రైవర్మంటలను గమనించి బస్సులో నుంచి దూకి ప్రాణాలు రక్షించుకున్నాడు. అదే సమయంలో విద్యార్థులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందనే చెప్పుకోవచ్చు.
కోడూరు మండలం విశ్వనాథపల్లి వద్దకు రాగానే స్కూల్ బస్సుకు ఈ ప్రమాదం జరిగింది. చైతన్య స్కూల్ కూడా సమీపంలోనే ఉండగా అందరూ చూస్తుండగానే పాఠశాల బస్సు కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో విద్యార్థులు ఎవరు లేకపోవడం.. అదృష్టవశాత్తు డ్రైవర్ అప్రమత్తమై క్షేమంగా బయటపడ్డాడు. మంటల దాటికి నిమిషాలలోనే బస్సు బూడిదైపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడు ఫైరింజన్లతో మంటలను అదుపు చేసిన ఫలితం లేకుండా పోయింది. అప్పటికే బస్సులో మంటలు పూర్తిగా వ్యాపించేశాయి. ఈ ప్రమాదంపై ఉన్నతాధికారులు స్పందించి దేని వలన మంటలు చెలరేగాయో దర్యాప్తు చేసి.. మిగతా బస్సుల పరిస్థితిని కూడా గమనించాలని స్కూల్ పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Krishna District, Local News