Jr.NTR: అభిమాని కోరిక తీర్చిన జూనియర్ ఎన్టీఆర్.. వీడియో కాల్ చేసి ధైర్యం చెప్పిన తారక్..

అభిమానితో మాట్లాడుతున్న ఎన్టీఆర్

టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) తన అభిమానికి ధైర్యం చెప్పారు. ఆస్పత్రి బెడ్ పై ఉన్న అతడికి వీడియో కాల్ చేసి కోరిక తీర్చారు.

 • Share this:
  హీరోలకు అభిమానులుంటారు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే ఫ్యాన్స్ చేసే హంగామా అంతా ఇంతా కాదు. థియేటర్ల దగ్గర సందడి చేస్తూ ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేసి తమ అభిమానాన్ని చాటుకుంటుంటారు. అలాగే తమ హీరో పుట్టినరోజులకు రక్తదానాలు, అన్నదానాలు చేసి మంచిపేరు తెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి అభిమానానికి నటులు కూడా ఫిదా అవుతుంటారు. అభిమానులు కష్టాల్లో ఉన్నా.., సమస్యల్లో ఉన్నా ధైర్యం చెప్పి భరోసానిస్తారు. గతంలో చాలా మంది హీరోలు తమ ఆనారోగ్యంతో ఉన్న అభిమానుల దగ్గరకు వెళ్లి స్వయంగా కలిసిన సందర్భాలున్నాయి. తాజాగా టాలీవుడ్ (Tollywood) స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR) తన అభిమానికి ధైర్యం చెప్పారు. ఆస్పత్రి బెడ్ పై ఉన్న అతడికి వీడియో కాల్ చేసి కోరిక తీర్చారు.

  వివరాల్లోకి వెళ్తే... ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లోని తూర్పుగోదావరి జిల్లా (East Godavari District) మలికిపురం మండలం గుడపల్లి గ్రామానికి చెందిన కొప్పాడి మురళి జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. ఎన్టీఆర్ సినిమాలు, ఆయన ప్రోగ్రామ్ లు అంటే పిచ్చి. ఐతే ఇటీవల మురళీ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రాణాపాయ స్థితిలో విజయవాడలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే అతనికి రెండు కిడ్నీలు దెబ్బతినడంతో పరిస్థితి విషమంగా ఉంది. చావుబ్రతుకుల మధ్య ఉండి కూడా తన అభిమాన హీరోని మర్చిపోలేదు మురళి.

  ఇది చదవండి: రోజా కుమార్తె అన్షుకి అరుదైన గౌరవం.... తల్లికి తగ్గ తనయ అనిపించుకుందిగా..


  తనకు జూనియర్ ఎన్టీఆర్ అంటే అభిమానం అని ఆయన్ని చూడలని డాక్టర్లకు పేపర్ పై రాసిచ్చాడు. ఆస్పత్రి వైద్యులు ఎన్టీఆర్ అభిమాన సంఘాలను సంప్రదించారు. విషయంలో రామారావు వరకు వెళ్లడంతో ఆయన వీడియో కాల్ చేసి మాట్లాడారు. అతని ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు, కుటుంబ సభ్యులను అడిగి తెలుసున్నారు. నీకు నేనున్నానని.. త్వరలగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని ఎన్టీఆర్ ధైర్యం చెప్పారు. అంతేకాదు తగ్గిన వెంటనే కలుద్దామని భరోసా కూడా ఇచ్చారు.

  ఇది చదవండి: సాయితేజ్ రిపబ్లిక్ సినిమాపై వివాదం.., కోర్టుకు వెళ్తామని హెచ్చరిక.. అసలేం జరిగిందంటే..!

  తన అభిమాన కథానాయకుడు వీడియో కాల్ చేయడంతో మురళీ ఆనందపడిపోయాడు. మాట్లాడలేని స్థితిలో ఉన్నా సైగలు చేస్తూ ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అభిమాని పట్ల ఎన్టీఆర్ చూపిన ప్రేమకు ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. నిజంగా రామారావు గ్రేట్ అని పొగిడేస్తున్నారు. గతంలో జనసేన అధ్యక్షుడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Janasena Chief Pawan Kalyan) ఆనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు అభిమానుల ఇళ్లు వెళ్లివారికి ధైర్యం చెప్పిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఎన్టీఆర్.. రాజమౌళి (Rajamouli) డైరెక్షన్లో రామ్ చరణ్ (Ram Charan)తో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో (RRR Movie) నటిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ తర్వాత మరికొన్ని సినిమాలకు ఆయన సైన్ చేశారు. మరోవైపు జెమినీ టీవీలో (Gemini TV) ప్రసారమవుతున్న ఎవరు మీలో కోటీశ్వరుడు (Evaru Meelo Koteeswarudu) కార్యక్రమానికి తారక్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.
  Published by:Purna Chandra
  First published: