Prayaga Raghavendra Kiran, News18, Vijayawada
ఒకప్పుడు మన ఇళ్ల మధ్య తిరిగిన పిచ్చుకలు ఇప్పుడు ఎక్కడో ఓ చోట కనిపిస్తున్నాయి. వడ్రంగి పిట్ట, కోయిల ఇలా ఎన్నో పక్షులు మన కళ్లముందు తిరుగుతూ ఉండేవి. ఇప్పుడు ఏ రోజైనా సరదాసాయంత్రం బాల్కనీలో కూర్చుని కాఫీ తాగుతుంటే.., వాహనాల హారన్‌ల సౌండ్‌లే కానీ ఏ పక్షి అరుపు వినిపించదు. మనం భవిష్యత్ వైపు పరుగులు పెడుతూ.., వాటి సంగతే మర్చిపోయాం అనిపిస్తుంది కదా. అలాంటిది ఒకప్పుడు ఏ పక్షులు ఉన్నాయి. ఇప్పుడు ఏవి అంతరించిపోయే దశలో ఉన్నాయో నేటితరానికి తెలుసంటారా? అందుకే ఈ తరానికి పక్షుల గురించి తెలిసేలా విజయవాడ (Vijayawada) లో ఓ రోబోటిక్ పార్క్‌ను ఏర్పాటుచేశారు. దేశంలో అంతరించిపోయిన కొన్ని రకాల పక్షులను రోబోటిక్ టెక్నాలజీతో ఆ పార్కులో ఏర్పాటుచేశారు.
ఆకట్టుకుంటున్న రోబోటిక్ బర్డ్స్ పార్క్
విజయవాడ శాతవాహన కళాశాల మైదానంలో రోబోటిక్ పక్షుల పార్కు (Robotic birds park) ఏర్పాటుచేశారు. ఇప్పటికే అంతరించిపోయిన పక్షలును రోబోటిక్ టెక్నాలజీతో ఏర్పాటు చేసి చిన్నారులను, పక్షుల ప్రేమికులను ఆకట్టుకుంటున్నారు. వుడ్ పెక్కర్ (woodpecker) , పెంగ్విన్(penguin) , గుడ్ల గూబ (Owl) , ఆస్త్రిచ్ (ostrich) , చిలకలు(parrot)..ఇలా మరికొన్ని రకాల పక్షులు అక్కడ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పెంగ్విన్లులు చాలా ఫ్రెండలీగా ఉండే జాతుల పక్షుల అవి.. సాధారణంగానీటిలో నివసించే పక్షులు భారత్ దేశంలో అతి తక్కువగా కనిపించే పక్షులలో ఒకటి.
ఆ పార్క్‌లో అడుగుపెడుతుంటే..పక్షుల కిలకిలా రావాలు..మనతో ఏవో ఊసులాడుతున్నట్లే.. మనసంతా ప్రశాంతగా ఉందంటున్నారు సందర్శకులు. సమ్మర్ కావడంతో పిల్లలను తీసుకుని పెద్దవాళ్లు ఈ పార్క్‌ను సందర్శిస్తున్నారు. పిల్లలు అయితే ఆ పక్షుల అరుపులకు ఎంజాయ్ చేస్తూ.., సెల్ఫీలు దిగుతూ సందడి చేస్తున్నారు.
పక్షుల అరుపులను రికార్డు చేసేందుకు ఏళ్ల పాటు నిరీక్షణ
పక్షులను ప్రేమించని వారుండరు, పక్షులు కిలకిల రావాలను ఆస్వాదించాలని చాలా మంది కోరుకుంటారు. కొన్ని సందర్భాలలో పక్షులు చేసే విన్యాసాలకుఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఇక కొన్ని రకాల పక్షులు అయితే ఆ అయా ఋతువులలో మాత్రమే కనిపిస్తాయి. అలా కనిపించే పక్షుల కోసం బర్డ్ లవర్స్ ఎంతో సమయంతో పాటు డబ్బును కూడా ఖర్చు చేస్తారు.వాటి అరుపులు, వాటి వయ్యారాలను రికార్డు చేసేందుకు ఎన్నో ప్రాంతాలు తిరుగుతారు. పెరుగుతున్న సాంకేతిక అభివృద్ధి తో ఇప్పటికే కొన్ని జాతుల పక్షులు అంతరించిపోయాయి. ఇక రాబోయే తరాలు వారు అంతరించిపోయిన పక్షులను చూడాలంటే గూగుల్ లోనో, యూట్యూబ్‌లోనూ చూడటం తప్ప మరో మార్గం లేదు.
అంతరించిన 200జాతుల పక్షులు
అంతర్జాతీయ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్ (International union for conservation of nature) సంస్థ నిర్వహించిన సర్వే ప్రకారం 2018 నాటికి మనదేశంలో 200 జాతుల పక్షులు అంతరించిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా పదివేలుకు పైగా పక్షుల జాతులు ఉండగా.. అందులో భారతదేశంలో 1300లకు పైగా పక్షుల జాతుల ఉండగా అందులో రెండు వందలు జాతులు ఇప్పటికే కనుమరుగు అయిపోయాయి . మిగిలిన వాటిని సంరక్షించకపోతే అవి కూడా అంతరించిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు.
రోబో 2.O.., పక్షులెందుకు అంతరిస్తున్నాయో !
తాజాగా తమిళ్ డైరెక్టర్ శంకర్ తీసిన రోబో 2.O లో చూపించిన విధంగా పక్షులు అంతరించిపోయే అవకాశం ఉంటుందని. ఈ విశ సృష్టి లో ప్రతి ఒక్క జీవికి స్వేచ్చగా బ్రతికే హక్కు ఉందని అలానే పక్షులకుకూడా ఉందని పక్షుల ప్రేమికులు అంటున్నారు. ఇప్పటికే దేశంలో పిచ్చుకలు,కింగ్ ఫిషర్, వుడ్ పెక్కర్ తదితర జాతుల పక్షులు, ఫ్రెండ్లీ గా ఉండేకొన్ని జాతుల పక్షులతో క్రూరంగా ఉండే రాబందు తదితర జాతుల కూడా ఇప్పటికే అంతరించిపోయయిని పక్షుల ప్రేమికులు అంటున్నారు.
ఇది ఇలానే కొనసాగితే రాబోయే తరం పక్షులను ఇలానే రోబోటిక్ పార్కులో చూడాల్సిన దుస్థితి ఏర్పడుతుందని బర్డ్ లవర్స్ అవేదన వ్యక్తం చేస్తున్నారు. బర్డ్ సాంచురీస్ ఏర్పాటు చేసి పక్షుల సంరిక్షించడానికి చర్యల తీసుకోవాలని ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Andhra Pradesh, Vijayawada