హిజ్రాల హితబోధ: సీట్ బెల్ట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో...

విజయవాడ పోలీసులు ప్రజల్లో రోడ్డు భద్రతపై అవగాహన కల్పించేందుకు వినూత్న కార్యక్రమం చేపట్టారు. గతంలో పాపులర్ అయిన ఓ యాడ్‌ను స్ఫూర్తిగా తీసుకుని హిజ్రాలతో వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆకట్టుకుంది.

news18-telugu
Updated: January 11, 2019, 7:31 PM IST
హిజ్రాల హితబోధ: సీట్ బెల్ట్ పెట్టుకో, హెల్మెట్ పెట్టుకో...
విజయవాడలో రోడ్డు భద్రతపై హిజ్రాలతో అవగాహన కార్యక్రమం
news18-telugu
Updated: January 11, 2019, 7:31 PM IST
డ్రైవింగ్ చేసేవారికి రోడ్ సేఫ్టీ గురించి యూట్యూబ్‌లో ఓ యాడ్ ఫుల్ పాపులర్ అయింది. కొందరు హిజ్రాలు రోడ్డు మీద నిలబడి, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద వచ్చే పోయే వారికి సూచనలు ఇస్తుంటారు. ‘కారు డ్రైవర్ సీట్ బెల్ట్ పెట్టుకో, బైక్ రైడర్ హెల్మెట్ పెట్టుకో’ అంటూ మైక్‌లో చెబుతుంటే.. అదంతా చూస్తున్న జనం నవ్వు ఆపుకోలేకపోతుంటారు. కరెక్టుగా అలాంటి సీన్‌ రిపీట్ అయింది. విజయవాడలో ట్రాఫిక్ డీసీపీ రవిశంకర్ రెడ్డి, విజయవాడ ఈస్ట్ రోటరీ క్లబ్, రోటరీ క్లబ్ ఆఫ్ చైన్నై కలసి సంయుక్తుంగా వాహనదారులకు అవగాహన కార్యక్రమం చేపట్టారు.

విజయవాడలో రోడ్డు భద్రతపై హిజ్రాలతో హితబోధ
విజయవాడలో రోడ్డు భద్రతపై హిజ్రాలతో హితబోధ


కొందరు హిజ్రాలు రోడ్డు మీద ట్రాఫిక్ సిగ్నల్ వద్ద నిలబడ్డారు. బైక్ రైడర్లు హెల్మెట్ పెట్టుకోవాలని సూచిస్తూ సైగలు చేశారు. ఏవేవో రూల్స్ పాటించే మనం.. ట్రాఫిక్ రూల్స్ మాత్రం పాటించడం లేదని, ఇకపై ట్రాఫిక్ రూల్స్ కచ్చితంగా పాటిద్దామని సూచించారు.

Road safety Awareness, Road Safety awareness by Vijayawada Police, Road safety by Hijras, Hijras road safety, Vijayawada Hijras Road safety, విజయవాడలో ట్రాఫిక్‌పై అవగాహన, హిజ్రాలతో ట్రాఫిక్‌పై అవగాహన, Seatbelt by Hijras,
విజయవాడలో రోడ్డు భద్రతపై హిజ్రాలతో హితబోధ
ఓ వైపు హిజ్రాలు ట్రాఫిక్ మీద అవగాహన కల్పిస్తుండగా మరోవైపు పోలీసులు, రోటరీ క్లబ్ వారు రోడ్ సేఫ్టీ‌కి సంబంధించిన ప్లకార్డులు ప్రదర్శించారు. ఈ కొత్త తరహా ప్రచారాన్ని చూసి విజయవాడలో ప్రయాణికులు కూడా సరదాగా భావించారు. అయితే, దీన్ని సరదాగా తీసుకోవద్దని సీరియస్‌గానే తీసుకోవాలని పోలీసులు వాహనదారులకు సూచించారు.

 

రోడ్డు భద్రతపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్న హిజ్రాలు
First published: January 11, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...