VIJAYAWADA RIFT BETWEEN TDP LEADERS AFTER CHANDRA BABU HANDOVER VIJAYAWADA WEST RESPONSIBILITIES TO MP KESENI NANI FULL DETAILS HERE PRN
TDP: చంద్రబాబుకు మళ్లీ తలనొప్పులు.. ఒక్క నిర్ణయంతో తమ్ముళ్ల అసంతృప్తి.. ఆ విధంగా బుజ్జగిస్తారా..?
చంద్రబాబు (ఫైల్ ఫోటో)
కృష్ణా జిల్లా (Krishna District)లో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది టీడీపీ (TDP). ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక విజయవాడ టీడీపీలో పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ నేతల తీరు అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెప్పిస్తూనే ఉన్నారు.
ఏ ముహూర్తాన అధికారం కోల్పోయిందో గానీ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) లో ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ (Telugu Desham Party) కి ఏదీ కలిసిరావడం లేదు. రాష్ట్రంలో చాలా నియోజకవర్గాల్లో తెలుగు తమ్ముళ్ల మధ్య పడటం లేదు. ముఖ్యంగా కృష్ణాజిల్లాలో 2019 ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైందనే చెప్పాలి. జిల్లాలో కేవలం రెండు సీట్లకే పరిమితమైంది టీడీపీ. ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఒకరు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఇక విజయవాడ టీడీపీలో పార్టీ నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి. ముఖ్యంగా విజయవాడ నేతల తీరు అధినేత చంద్రబాబుకు తలనొప్పులు తెప్పిస్తూనే ఉంది. ముఖ్యంగా ఎంపీ కేశినేని శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న మధ్య అస్సలు పొసగడం లేదు. తరచూ ఇద్దరు ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు భగ్గుమంటూనే ఉన్నాయి.
తాజాగా విజయవాడ పశ్చిమ నియోజకవర్గం విషయంలో చంద్రబాబు తీసుకున్న నిర్ణయం బుద్ధా వెంకన్నను షాక్ కు గురిచేయింది. పశ్చిమ నియోజకవర్గ బాధ్యతలను చంద్రబాబు.. కేశినేని నానికి అప్పగించారు. దీంతో బుద్ధా వెంకన్న, నాగుల్ మీరా వేసిన కమిటీలు రద్దయ్యాయి. స్థానిక కమిటీలను నిర్ణయించే అధికారం కేశినేని నాని చేతికి వెళ్లింది. దీంతో తమను కాదని.. నానికి ప్రాధాన్యం ఇవ్వడంపై బుద్ధా వెంకన్న వర్గం మండిపడుతోంది. ఇప్పటికే కార్పొరేషన్ ఎన్నికల సమయంలో కేశినేని నాని తీరును వ్యతిరేకించిన బుద్ధా వెంకన్నకు చంద్రబాబు నిర్ణయం మింగుడుపడటం లేదు.
ఇదిలా ఉంటే గత కొంతకాలంగా కేశినేని నాని.. టీడీపీ అధిష్టానాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదన్న టాక్ వినిపించింది. కార్పొరేషన్ ఎన్నికల సమయంలో నాకు నేనే రాజు అనే విధంగా మాట్లాడటం, తన కుమార్తెను ముందుగానే మేయర్ అభ్యర్థిగా ప్రకటించడం, కేశినేని భవన్ లో చంద్రబాబు ఫోటోలు తీసేసి రతన్ టాటా ఫోటోలు పెట్టడమే కాకుండా వచ్చే ఎన్నికల్లో పోటీ చేయననంటూ వ్యాఖ్యలు చేయడం చంద్రబాబును కాస్త ఇబ్బంది పెట్టాయి. ఐతే టీడీపీ కార్యాలయంపై దాడి జరిగిన తర్వాత చంద్రబాబు చేసిన దీక్షకు మద్దతిచ్చిన కేశినేని నాని.. కార్యకర్తలను ఉత్తేజ పరిచేలా మాట్లాడటతో తెలుగు తమ్ముళ్లు సైలెంట్ అయ్యారు.
ఇదిలా ఉంటే తరచూ పార్టీ లైన్ దాటుతున్న కేశినేని నానికి ప్రాధాన్యత ఇవ్వడంపై బుద్ధా వెంకన్న తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక్కడ కొంతమంది బుద్ధా సామాజిక వర్గాన్ని కూడా తెరపైకి తెస్తున్నారు. ఇదే సమయంలో ప్రత్యర్థులైతే టీడీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు గుర్తింపు లేదంటూ సామాజిక వర్గసమీకరణాలను తీసుకొస్తున్నారు. ఐతే బుద్ధా వెంకన్నను బుజ్జగించేందుకు చంద్రబాబు మరో ఆలోచన చేసినట్లు ప్రచారం జరుగుతోంది. పార్టీలో ఆయనకు కీలక బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది.
(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.